international terrorist
-
21 ఏళ్ల తర్వాత.. లాడెన్ లేఖ వైరల్
లండన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తీవ్రరూపం దాలి్చన వేళ.. ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను మరోసారి జనం స్ఫురణకు తెచ్చుకుంటున్నారు. 2001లో అమెరికాపై అనూహ్య రీతిలో ఉగ్రదాడులు జరిపి ప్రపంచ దేశాలకు షాకిచి్చన బిన్ లాడెన్.. ఆ తర్వాత అమెరికా ప్రజలనుద్దేశించి రాసిన రెండు పేజీల లేఖ టిక్–టాక్‌లో వైరల్‌గా మారడం గమనార్హం. ఒసామా లేఖకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. పాలస్తీనాను ఆక్రమించి అణచివేతకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కూడా 9/11 దాడులకు ఓ కారణమని అందులో లాడెన్ సమరి్థంచుకున్నాడు. ‘‘పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంది. అమెరికా అధ్యక్షులెవరూ పట్టించుకోలేదు. పాలస్తీనా ఎప్పటికీ ఆక్రమణలోనే ఉండిపోదు. సంకెళ్లను తెంచుకునేందుకు ప్రయతి్నస్తాం. అమెరికా అహంకారానికి క్రైస్తవుల రక్తంతో మూల్యం చెల్లించక తప్పదు’అని లాడెన్ హెచ్చరించాడు. -
మరోసారి చైనా మోకాలడ్డు
ఐరాస: పాకిస్తాన్‌కు చెందిన లష్కరే నేత షహీద్ మహమూద్ (42)ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన సంయుక్త ప్రతిపాదనకు చైనా మరోసారి మోకాలడ్డింది. ఈ ప్రతిపాదనను చైనా అడ్డుకోవడం గత నాలుగు నెలల్లో ఇది నాలుగోసారి. పాక్‌లో తలదాచుకుంటున్న అబ్దుల్ రెహ్మాన్ మక్కీ తదితరులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలన్న ఇరు దేశాల సంయుక్త ప్రతిపాదనలకు కూడా చైనా ఎప్పటికప్పుడు ఐరాసలో గండి కొడుతూ పాక్‌ను ఆదుకుంటూ వస్తోంది. భారత్, అమెరికాలపై దాడులే లష్కరే ప్రధాన లక్ష్యమని 2011 నుంచి పదేపదే చెబుతూ వస్తున్నాడని అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది. -
హఫీజ్ ఖర్చులకు డబ్బులివ్వండి : పాక్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ అసలు రంగు మరోసారి బయటపడింది. ఓ వైపు ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెబుతూనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డ హఫీజ్ సయీద్ కోసం ఆ దేశం తాజాగా ఐరాసను ఆశ్రయించింది. ముంబయి పేలుళ్ల సూత్రదారి, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి అతనికున్న బ్యాంక్‌ఖాతాను నిలిపివేసింది. అప్పటి నుంచి తన వ్యక్తిగత, కుటుంబ ఖర్చులకు ఇబ్బందులు ఎదురవడంతో హఫీజ్ పాక్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హఫీజ్‌కు వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు రూ. 1,50,000 (పాక్ కరెన్సీ) విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పాకిస్తాన్ ఐరాసను కోరింది. కాగా పాక్ చేసిన ప్రతిపాదనపై గడువులోగా ఐరాస సభ్య దేశాల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో మండలి అందుకు ఆమోదిస్తూ హఫీజ్ తన బ్యాంక్ ఖాతాను వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో అరెస్టైన హఫీజ్ ప్రస్తుతం లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
దౌత్య విజయం
మన దేశం ఐక్యరాజ్యసమితిలో ఎడతెగకుండా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. పాకిస్తాన్ సైన్యం చెప్పుచేతల్లో నడిచే గూఢచార సంస్థ ఐఎస్ఐకు సన్నిహితుడైన జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా సమితి ప్రకటించింది. భారత్ ప్రయత్నాలకు పదేళ్లనుంచి మోకాలడ్డుతున్న చైనా తన వైఖరి మార్చుకోవడంతో ఇది సాధ్యమైంది. సార్వత్రిక ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతున్న వేళ వెలువడిన ఈ నిర్ణయం సహజంగానే బీజేపీకి సంతోషాన్నిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ఆ పార్టీ ట్వీటర్ ద్వారా ప్రకటించింది. ఆ వెంటనే మసూద్ అజర్ వ్యవహారంపై బీజేపీ–విపక్షాల మధ్య వాగ్యుద్ధం మొదలైంది. ఈ పదేళ్లలో రెండుసార్లు– 2008లో ముంబైపై ఉగ్రవాది దాడి జరిగాక, 2016లో పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు విరుచుకుపడినప్పుడు మన దేశం అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానాలను భద్రతామండలికి అనుబంధంగా ఉన్న 1267 ఆంక్షల కమిటీలో ప్రతిపాదించింది. ఆ రెండుసార్లూ చైనాకు ‘సాంకేతిక కారణాలు’ అడ్డొ చ్చాయి. 2017లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు తీర్మానం తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించడానికి చైనా ఈ సాకే చెప్పింది. ఇలా మోకాలడ్డిన ప్రతిసారీ ఆ వ్యవహారాన్ని పరి శీలించడానికి తనకు ‘మరింత సమయం’ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ ‘సాంకేతిక కార ణాలు’, ఇతర అభ్యంతరాలతో సంబంధం లేకుండా జైష్ సంస్థ తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఈమధ్య కశ్మీర్‌లోని పుల్వామాలో 43మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాద దాడి తన ఘనతేనని ఆ సంస్థ ప్రకటించుకుంది. దాన్నే ప్రస్తావిస్తూ మొన్న ఫిబ్రవరి, మార్చి నెలల్లో మన దేశం మరోసారి తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు సైతం చైనా యధాప్రకారం అడ్డుకుంది. ఆ రెండుసార్లూ ‘సంబంధిత పక్షాలన్నిటితో మాట్లాడిన అనంతరం నిర్ణయిస్తామ’ని చెప్పి తప్పించుకుంది. కానీ తాజాగా తీర్మానం ప్రవేశపెట్టిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో చైనా దారికి రాక తప్పలేదు. పాత తీర్మానాలకూ, ప్రస్తుత తీర్మానానికీ వ్యత్యాసం ఉండటం వల్లే అంగీకరించానని, ‘ఆయా దేశాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నానని ఆ దేశం చెబుతోంది. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం దౌత్యపరంగా ఘన విజయమన డంలో సందేహమేమీ లేదు. అలాగని అందువల్ల ఏదో ఒరుగుతుందని చెప్పడం కూడా తొందర పాటే అవుతుంది. ఇప్పటికైతే ఈ చర్య పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికపై దోషిగా నిలబెట్టింది. దాన్ని ఒంటరిని చేసింది. అది ఇన్నేళ్లుగా మసూద్ అజర్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడ నటానికి ఆధారాలేమీ లేవని దబాయిస్తూ వస్తోంది. పఠాన్‌కోట్, పుల్వామా దాడుల్లో అతగాడి ప్రమేయం ఉన్నదని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు అందించాలని మన దేశాన్ని సవాలు చేస్తోంది. ఇచ్చిన సాక్ష్యాధారాలు చాలవంటున్నది. అదేం చెప్పినా చైనా సమర్థిస్తూనే ఉంది. కానీ ఈసారి అది కుదరలేదు. ఇందుకు అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లు ఒక కారణమైతే, మన దేశం ఓపిగ్గా సాగించిన దౌత్య కృషి మరో కారణం. చైనాతో మన దౌత్యవేత్తలు పలుమార్లు చర్చిం చారు. దాని వైఖరిలోని లోపాలను ఎత్తిచూపారు. ఇది సత్ఫలితాన్నిచ్చిందని తాజా పరిణామం తెలియజెబుతోంది. మౌలికంగా ఐక్యరాజ్యసమితి చర్య ప్రతీకాత్మకమైనది. పాకిస్తాన్ మనస్ఫూర్తిగా సహకరించి మసూద్ కార్యకలాపాలన్నీ స్తంభింపజేస్తేనే, అతడి సంస్థపై కఠిన చర్యలు ప్రారంభిస్తేనే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. కానీ పాక్ గత చరిత్ర తెలిసినవారెవరూ అది ఆ పని చేస్తుందని విశ్వసిం చరు. ఇప్పటికీ ఆ దేశంలో రహస్యంగా ఆశ్రయం పొందుతున్న నేరగాడు దావూద్ ఇబ్రహీం, బహిరంగంగా ఉంటున్న జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ వంటివారే ఇందుకు రుజువు. వారిద్దరూ పదేళ్లుగా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నారు. సయీద్‌ను అప్ప గించినా, హతమార్చినా కోటి డాలర్లు ఇస్తానని అమెరికా 2012లో ప్రకటించింది కూడా. దావూద్ తమ వద్ద లేడని పాక్ ఇప్పటికీ బుకాయిస్తోంది. సయీద్ తరచు స్థానిక పత్రికలకు వ్యాసాలు కూడా రాస్తున్నాడు. మసూద్ జీవితం వారికి భిన్నంగా ఉంటుందని అనుకోనవసరం లేదు. మహా అయితే ఫలానా ఉగ్రదాడి తమ ఘనతేనని ఇకపై అతడు చెప్పుకోవడం మానేయొచ్చు. వాస్తవానికి భద్రతామండలికి అనుబంధంగా 1999లో ఏర్పడిన 1267 ఆంక్షల కమిటీ అల్ కాయిదాపై ఆంక్షలు విధించడానికి ఉద్దేశించింది. అల్ కాయిదాకు సహకరిస్తున్నారనుకునే వ్యక్తులనూ, సంస్థలనూ అనంతరకాలంలో దాని పరిధిలోకి తెచ్చారు. ఫలానా వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలు ఉగ్ర వాదానికి ఊతమిస్తున్నాయని ఏ దేశమైనా తీర్మానం ప్రతిపాదిస్తే అది ఏకగ్రీవ ఆమోదం పొందాలి. అప్పుడు మాత్రమే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా, ఉగ్రసంస్థలుగా పరిగణించడం సాధ్యపడు తుంది. అలా ప్రకటించిన సంస్థల, వ్యక్తుల ఆస్తులు ప్రపంచంలో ఏమూలనున్నా స్తంభింపజేస్తారు. ప్రపంచ ఉగ్రవాదిగా ముద్రపడిన వ్యక్తులను ఏ దేశమూ తమ గడ్డపైకి అడుగుపెట్టనీయదు. మసూద్‌కు న్యూయార్క్, లండన్ వంటిచోట ఆస్తులేమీ లేవు. బ్యాంకు ఖాతాలు కూడా లేవు. పైగా అతడు పాకిస్తాన్ దాటి బయటికెళ్లే రకం కాదు. కనుక అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడటం వల్ల అతగాడికి వచ్చే నష్టమేమీ లేదు. అయితే ఇదే అదునుగా మన దేశం కశ్మీర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి అక్కడ ఉద్రిక్తతలు ఉపశమించడానికి తగిన చర్యలన్నీ తీసుకోవాలి. మసూద్ విషయంలో పాక్‌పై మున్ముందు కూడా అమెరికా ఒత్తిడి తీసుకొచ్చేలా చేస్తే కశ్మీర్లో ఉగ్ర వాద చర్యలు కాస్తయినా తగ్గే అవకాశం ఉండొచ్చు. కేవలం నామమాత్ర ప్రకటన చేసి, ఆ తర్వాత పట్టించుకోనట్టయితే పెద్దగా ఫలితం ఉండదు. -
అజార్ అంతర్జాతీయ ఉగ్రవాదే
ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. అగ్రదేశాల ఒత్తిడులకు ఎట్టకేలకు చైనా తలొగ్గింది. జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు సన్నిహితుడైన మసూద్ అజార్(50)ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఫలితంగా, అజార్ ఆస్తులను స్తంభింపజేసేందుకు, అతడి ప్రయాణంపై నిషేధం విధించేందుకు, ఆయుధాలు సమకూర్చుకునే వీలు లేకుండా చేసేందుకు ఐరాసకు సత్వరం వీలు కలిగింది. డ్రాగన్ దేశం అడ్డుపుల్ల... మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న అగ్రరాజ్యాల ప్రయత్నాలను భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశం, వీటో అధికారం కలిగిన చైనా గత పదేళ్లలో నాలుగు సార్లు అడ్డుకుంటూ వచ్చింది. పుల్వామా ఘటన అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకుంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు తమకు కొంత సమయం కావాలంటూ మెలికపెట్టింది. అయితే, ఈ విషయంలో ఇటీవలి కాలంలో చైనా సానుకూలత వ్యక్తం చేస్తోంది. చైనా అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. ‘ఇటీవల సంబంధిత దేశాలు 1267 కమిటీకి పంపిన ప్రతిపాదనల్లో కొన్నిటికి మార్పులు– చేర్పులు చేశాయి. తాజాగా చేర్చిన అంశాలను, ఆయా దేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. పట్టువదలని భారత్.. పెంచిన ఒత్తిడి అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ 2009 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. 20016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి వ్యూహకర్త అజార్‌పై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు సాయంతో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది. 2017లో ఈ మూడు దేశాలు మరోసారి ఈ ప్రయత్నం చేశాయి. చైనా వీటోతో ఈ ప్రతిపాదన వీగిపోయింది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు కలిసి భద్రతామండలిలో నేరుగా ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి, అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాయి. కశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడికి జైషే మొహమ్మద్నే కారణమని ఆరోపిస్తూ భారత్ భద్రతా మండలిలో ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డ్రాగన్ దేశం అడ్డుకుంది. భారత్ తన ప్రయత్నాలను మాత్రం కొనసాగించి ఇతర మిత్ర దేశాల మద్దతు కూడగట్టుకుంది. చైనాపై అంతర్జాతీయంగా, మరి ముఖ్యంగా అమెరికా ఒత్తిడి పెరిగింది. అజార్‌ను దిగ్బంధనం చేయడానికి ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తామంటూ భద్రతా మండలి చైనాకు హెచ్చరికలు పంపింది. దీంతో తన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది. భారత్‌పై పలు దాడులు 1999లో ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు 1994 నుంచి భారత్ జైలులో ఉన్న అజార్‌ను విడిపించుకు పోయారు. ఆ తర్వాత జైషే మొహమ్మద్‌ను స్థాపించిన అజార్ 2000లో కశ్మీర్‌లోని బాదామిబాగ్ సైనిక స్థావరంపై దాడి చేయించాడు. ఈ ఘటనలో 17 మంది వరకు జవాన్లు నేలకొరిగారు. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి పథకం వేశాడు. ఆ తర్వాత పఠాన్‌కోట్, ఉడి, పుల్వామా తదితర ఘటనలకే ఇతడే సూత్రధారి. ఇతడికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అన్ని విధాలుగా తెరవెనుక సాయం అందిస్తోంది. భారత్, పాక్‌ల మధ్య తీవ్రఉద్రిక్తతలు తలెత్తటానికి ఇతడి కార్యకలాపాలే ప్రధాన కారణం. ఐరాస తీర్మానం ఏం చెబుతోంది? అల్ కాయిదాతో సంబంధాలు సాగిస్తూ జైషే మొహమ్మద్ సంస్థ పేరుతో, ఆ సంస్థ తరఫున, ఆ సంస్థ మద్దతుతో ఆయుధాలు, సంబంధిత సామగ్రి సరఫరా, విక్రయం, రవాణా ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు వ్యూహ రచనతోపాటు ఆర్థిక సాయం చేస్తున్నందున మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేరుస్తున్నట్లు ఐరాస ఆంక్షల కమిటీ ప్రకటించింది. ఫలితంగా అజార్‌కు చెందిన ఆస్తుల స్తంభన, అతడిపై ప్రయాణ నిషేధం, ఆయుధ కొనుగోలుపై ఆంక్షలకు వీలవుతుంది. దీని ప్రకారం అన్ని దేశాలు ఎలాంటి ఆలస్యంగా లేకుండా సత్వరం అజార్ ఆస్తులు, నిధులు, ఆర్థిక వనరులపై ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుంది. భారత్ ఘన విజయం: మోదీ అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం భారత్‌కు దక్కిన ఘన విజయమని ప్రధాని మోదీ అన్నారు. ‘ఇప్పటికే ఆలస్యమైనా ఆహ్వానించదగ్గ, గర్వించదగ్గ పరిణామం. సహకరించిన ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు’ అని ఆయన తెలిపారు. ‘ఇది స్వాగతించదగిన పరిణామం. అయితే, ఐరాస తీర్మానంలో పుల్వామా ఆత్మాహుతి దాడి ప్రస్తావన లేకపోడం నిరుత్సాహం కలిగిస్తోంది’ అని కాంగ్రెస్ పేర్కొంది. ఆంక్షలను అమలు చేస్తాం: పాక్ రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని అంగీకరిస్తున్నాం. అజార్‌పై ఆంక్షలను వెంటనే అమలు చేస్తాం. స్వాగతించిన అమెరికా, ఫ్రాన్సు.. అంతర్జాతీయ సమాజం ఆకాంక్షించిన విధంగా పాక్ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. తమ ప్రయత్నాలు ఫలించాయనేందుకు సంకేతమని ఫ్రాన్సు తెలిపింది. -
ఓపిగ్గా వ్యవహరిస్తాం
న్యూఢిల్లీ/వాషింగ్టన్/న్యూయార్క్: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఓపిగ్గా వ్యవహరిస్తామని భారత్ తెలిపింది. అయితే ఉగ్రవాదంపై పోరాటం విషయంలో ఎక్కడా రాజీపడబోమని స్పష్టం చేసింది. పాక్ భూభాగంలో ఆశ్రయం పొందుతున్న కొన్ని ఉగ్రసంస్థలు చైనా ప్రయోజనాలకూ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని గుర్తుచేసింది. ఇటీవల సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ భద్రతామండలిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగోసారి అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్–పాకిస్తాన్ల మధ్య మరే దేశమయినా మధ్యవర్తిత్వం చేయొచ్చన్న వాదనలను తోసిపుచ్చారు. మసూద్ అజహర్ విషయంలో చైనా మెతకవైఖరి నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దౌత్యాధికారులు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయమై చైనా ప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు. మసూద్‌ను చైనా భద్రతామండలిలో కాపాడటంపై అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తన సంపాదకీయంలో ఘాటుగా విమర్శించింది. -
మళ్లీ చైనా అడ్డుపుల్ల
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుతగిలింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. గతంలోనూ భారత్ యత్నాలను చైనా అడ్డుకుంది. చైనా నిబంధల ప్రకారమే నడుచుకుంటుందని, అజహర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసే ప్రయత్నాలను అడ్డుకోబోతున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి లు కాంగ్ అంతకుముందే సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసేందుకు అజహర్ తగిన వ్యక్తేనని అమెరికా పేర్కొంది. తాజా పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారత పౌరులపై దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని అనుసరిస్తామని ప్రకటించింది. తమ ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడటంపట్ల విచారం వ్యక్తం చేసింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు పలికిన అమెరికా, ఫ్రాన్స్, యూకేలకు కృతజ్ఞతలు తెలిపింది. -
‘మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాదే’
వాషింగ్టన్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌కు అమెరికా పూర్తి బాసటగా నిలిచింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్‌ను ప్రకటించేందుకు విస్పష్ట ఆధారాలు ఉన్నాయని అగ్రదేశం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కీలక భేటీకి ఒక రోజు ముందు జైషే చీఫ్‌పై అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ భారత్‌లో పఠాన్‌కోట్ వైమానిక స్ధావరంపై దాడి, జమ్మూ,యూరిలో సైనిక పోస్టులపై దాడులు, భారత పార్లమెంట్‌పై దాడి సహా ఇటీవల పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఉగ్రదాడికీ బాధ్యుడని భారత్ చెబుతోంది. కాగా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మూడు శాశ్వత సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఇప్పటికే తీర్మానం చేసిన విషయం తెలిసిందే. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గతంలో ఈ మూడు దేశాలు చేసిన పలు ప్రయత్నాలను చైనా నిలువరించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు సరైన ఆధారాలు లేవంటూ ఈ ప్రతిపాదనను చైనా వీటో చేస్తూ వచ్చింది. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇండో-పాక్ ఉద్రిక్తతల నడుమ మసూద్‌పై తీవ్ర చర్యలు చేపట్టే ప్రతిపాదనను ఈసారి చైనా అడ్డుకోబోదని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ భావిస్తున్నాయి. -
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి
ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. 15 సభ్య దేశాలున్న భద్రతా మండలిలో వీటో అధికారమున్న ఈ మూడు దేశాలు బుధవారం ఈ ప్రతిపాదన చేశాయి. ప్రతిపాదనను భద్రతా మండలి పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. పాకి స్తాన్‌ను కేంద్రంగా చేసుకుని భారత్‌లో పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ చాన్నాళ్లుగా అభ్యర్థిస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ విషయంలో భారత్‌కు వివిధ దేశాల మద్దతు లభించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ మండలిలో ప్రతిపాదించడం ఇది నాల్గోసారి. పాక్‌తో సన్నిహిత సంబంధాలున్న చైనా తన వీటో అధికారంతో ప్రతిసారీ అడ్డుతగులుతోంది. పుల్వామాలో భారత భద్రతా దళంపై జరిగిన దాడిని ఖండించిన చైనా ఈసారి ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే మసూద్, సంస్థ చరాస్తుల లావాదేవీలు స్తంభించిపోతాయి. ఆర్థిక వనరులు మూసుకుపోతాయి. ప్రతిపాదనకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. పాక్ స్థావరంగా పనిచేస్తున్న అన్ని ఉగ్రసంస్థలను నిషేధించాలని కోరింది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త తలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రెండు దేశాలు వెంటనే సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారిపోకుండా సంయమనం పాటించాలి. ఇరు దేశాలు బాధ్యతగా వ్యవహరించి శాంతిని నెలకొల్పాలి. ఐక్యరాజ్య సమితి అందరికీ అందుబాటులో ఉంటుంది. రెండు దేశాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. – ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ -
భారత్ ప్రయత్నాలకు చైనా మళ్లీ అడ్డుపుల్ల
వాషింగ్టన్: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత అజార్ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ చేసిన ప్రయత్నం మరోసారి విఫలమయింది. ఈ మేరకు భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల మద్దతు ప్రకటించినప్పటికీ చైనా వీటో చేసింది. శుక్రవారం వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడారు. ‘ఈ తీర్మానంపై మండలిలోని దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ విషయంతో నేరుగా సంబంధం ఉన్న భారత్, పాక్లూ భిన్నాభిప్రాయంతో ఉన్నాయి’ అని అన్నారు. -
అంతర్జాతీయ ఉగ్రవాది కుమారుడి అరెస్ట్
శ్రీనగర్: ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి అంతర్జాతీయ ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ కొడుకు షకీల్ యూసఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షకీల్‌ను రాంబాగ్‌లో ఉండగా గురువారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. షకీల్ తన తండ్రి నుంచి ఉగ్రవాద నిధులు అందుకున్నట్లు 2011 ఏప్రిల్‌లో కేసు నమోదైంది. ఇదే కేసులో సలాహుద్దీన్ పెద్ద కొడుకు షాహిద్‌ను జూన్‌లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరు హవాలా మార్గం ద్వారా పాక్ నుంచి సేకరించిన నిధులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు అందించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇదే కేసులో పాక్ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీతోపాటు మహ్మద్ సిద్దిఖి గనాయ్, గులాం జిలానీ లిలూ, ఫరూక్ అహ్మద్ ఇప్పటికే ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. -
కొత్త జిహాదీ జాన్.. సిద్ధార్థ ధర్
వాషింగ్టన్/లండన్: బ్రిటన్‌కు చెందిన భారత సంతతి ఉగ్రవాది, ఐఎస్ సీనియర్ కమాండర్ సిద్ధార్థ ధర్ అలియాస్ అబూ రుమైసా(33)ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఐఎస్‌లో బందీల గొంతుల్ని కిరాతకంగా కోసి హతమార్చే ‘జిహాదీ జాన్’ మొహమ్మద్ ఎజావీ మరణానంతరం అతని స్థానంలో ధర్ పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బ్రిటన్‌లో ఉన్నప్పుడే ఇస్లాం స్వీకరించిన ధర్.. ఓ కేసులో బెయిల్‌పై బయటికొచ్చిన అనంతరం 2014లో భార్యాపిల్లలతో కలిసి సిరియాకు వెళ్లి ఐఎస్‌లో చేరాడు. అమెరికాతో పాటు బ్రిటన్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ 2016లో పలువురిని ముసుగు ధరించి కాల్చిచంపింది ధరేనని నిఘా వర్గాలు తెలిపాయి. ఇతనితో పాటు బెల్జియన్–మొరాకో పౌరుడు అబ్దుల్లతిఫ్ గైనీని కూడా అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినట్లు వెల్లడించాయి. దేశంలో వీరిద్దరి ఆస్తులుంటే స్తంభింపజేస్తామనీ, పౌరులెవరూ వీరితో ఆర్థిక సంబంధాలు పెట్టుకో వద్దని యూఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. ఎవరీ కొత్త జిహాదీ జాన్?: లండన్‌లోని ఓ బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించిన సిద్ధార్థ ధర్ అక్కడే పెరిగాడు. టీనేజీలోనే ఇస్లాం లోకి మారి సైఫుల్ ఇస్లామ్‌గా పేరు మార్చుకున్నాడు. గతంలో బ్రిటిష్ తీవ్రవాద సంస్థ అల్–ముహజిరౌన్లో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. ఐఎస్‌లో చేరడానికి ముందు లండన్‌లో పలు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఒకచేతిలో ఏకే 47 తుపాకీ, మరో చేతిలో తన నాలుగో సంతానాన్ని పట్టుకున్న ఫొటోను ఆన్లైన్లో పోస్ట్ చేసి సిరియాలో తన ఉనికిని చాటుకున్నాడు. -
మసూద్ అజహర్ విషయంలో చైనాపై మన వైఖరేంటి?
ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలో మసూద్ అజహర్ పేరును చేర్చకుండా చైనా రెండోసారి అడ్డుకుందని, ఈ విషయాన్ని భారతదేశం ఎలా చూస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజ్యసభలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆయనీ ప్రశ్న అడిగారు. అసలు చైనా ఏ సాంకేతిక కారణాలతో అడ్డుకుంటోందని, భారత దేశం తన ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమైందా అని కూడా ఆయన అడిగారు. మసూద్ అజహర్ ఈ సమాజానికి ప్రమాదకారి అని స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా చెప్పిన నేపథ్యంలో దీనిపై భారతదేశం ఎలా ముందుకు వెళ్లబోతోందన్నారు. దానికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2016 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లిందని, మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరిందని చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా గుర్తించారని, అది ఉగ్రవాద కార్యకలాపాలలో ఉండటంతో పాటు అల్ కాయిదాతో కూడా సంబంధాలు కలిగి ఉందని చెప్పామన్నారు. ఆ సంస్థ నాయకుడైన మసూద్ అజహర్‌ను మాత్రం ఉగ్రవాదిగా గుర్తించలేదని, 1267 ఆంక్షల కమిటీలో సభ్యత్వం కలిగిన చైనా ముందుగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఆపాలని చెప్పి, ఆ తర్వాత భారత ప్రతిపాదనను 2016 డిసెంబర్ 29న పూర్తిగా అడ్డుకుందని అక్బర్ చెప్పారు. ఈ సంవత్సరం జనవరిలో మళ్లీ తాజాగా అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలు కమిటీ ముందు మసూద్ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరాయని, అయితే దీనిపై మళ్లీ చైనా అభ్యంతరం చెప్పిందని వివరించారు. కమిటీ నిబంధనల ప్రకారం, ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకోవాల్సి ఉంటుందని, అంతేకాక తమ అభిప్రాయాలకు కారణం ఏంటో ఏ సభ్యదేశం బహిరంగంగా వివరించాల్సిన అవసరం లేదని తెలిపారు. మన ప్రభుత్వం ఈ అంశాన్ని చైనాతో చర్చించిందని కూడా ఆ సమాధానంలో వివరించారు. పాకిస్తాన్ ఇటీవల లష్కరే తాయిబా, జమాత్ ఉద్ దవా సంస్థలను నిషేధించడంతో పాటు హఫీజ్ సయీద్‌ను గృహనిర్బంధంలో ఉంచిందని, అప్పుడే ఆ దేశ రక్షణ మంత్రి హఫీజ్ సయీద్‌ను సమాజానికి ప్రమాదకారిగా చెప్పారని అన్నారు. ఉగ్రవాదాన్ని అణగదొక్కి, మన దేశ పౌరులను కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. -
చైనాపై మన వైఖరేంటి?