
ఐరాస: పాకిస్తాన్‌కు చెందిన లష్కరే నేత షహీద్ మహమూద్ (42)ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన సంయుక్త ప్రతిపాదనకు చైనా మరోసారి మోకాలడ్డింది. ఈ ప్రతిపాదనను చైనా అడ్డుకోవడం గత నాలుగు నెలల్లో ఇది నాలుగోసారి.
పాక్‌లో తలదాచుకుంటున్న అబ్దుల్ రెహ్మాన్ మక్కీ తదితరులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలన్న ఇరు దేశాల సంయుక్త ప్రతిపాదనలకు కూడా చైనా ఎప్పటికప్పుడు ఐరాసలో గండి కొడుతూ పాక్‌ను ఆదుకుంటూ వస్తోంది. భారత్, అమెరికాలపై దాడులే లష్కరే ప్రధాన లక్ష్యమని 2011 నుంచి పదేపదే చెబుతూ వస్తున్నాడని అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది.