miners
-
బలూచిస్తాన్ బొగ్గు గనిలో భారీ పేలుడు.. 12 మంది మృతి!
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ పరిధిలో గల జర్దాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హర్నై జిల్లాలో జరిగింది. గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ విపత్తు సంభవించింది. ఆ సమయంలో 18 మంది మైనర్లు గనిలో చిక్కుకుపోయారు. వెంటనే మైనర్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనలో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గనిలో రాత్రిపూట మీథేన్ వాయువు వెలువడింది. ఇదే పేలుడుకు కారణం కావచ్చని బలూచిస్తాన్ చీఫ్ మైన్స్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఘనీ బలోచ్ తెలిపారు. ప్రభుత్వ గనుల శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయని తెలిపారు. మృతదేహాలను గుర్తించి, ఆసుపత్రికి తరలించామన్నారు. -
ఆ చెక్కులు వెనక్కిచ్చేస్తాం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా వద్ద సొరంగంలో గత నెలలో 17 రోజుల పాటు చిక్కుబడిపోయిన 41 మంది కార్మికు లను రక్షించడంలో కీలకమైన 12 మంది ర్యాట్–హోల్’ గని కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ‘‘అన్ని రకాల యంత్రాలు విఫలమైన వేళ.. మేం ఎలాంటి షరతులు పెట్టకుండా ప్రాణాలనొడ్డి మార్గం తయారు చేశాం. సొరంగం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా వెలుపలికి తెచ్చాం. ఇందుకుగాను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేవలం రూ.50 వేల చొప్పున చెక్కులిచ్చింది. మాకీ ప్రతిఫలం సరిపోదని చెప్పాం. అధికారుల నుంచి, ఇప్పటికీ జవాబులేదు. ఈ చెక్కులు మాకొద్దు. మేమందరం వాపసు చేస్తాం’’ అని మైనర్లలో ఒకరైన వకీల్ హసన్ పీటీఐకి తెలిపాడు. ప్రభుత్వం తమకు శాశ్వత ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశాడు. -
ఇండోనేసియా బొగ్గు గని ప్రమాదంలో 10 మంది మృతి
జకార్తా: ఇండోనేసియా పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 10 మంది కార్మికులు మరణించారు. మరో నలుగురిని సహాయ బృందం కాపాడింది. ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన గనిలో ప్రమాదకరమైన మిథేన్ వంటి వాయువుల కారణంగానే పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. విషవాయువులు పీల్చడం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయ చర్యలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మరణించిన వారిలో ఎక్కువ మందికి కాలిన గాయాలతో పాటు ఊపిరి సమస్యలు తలెత్తడంతో ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా కొత్త ఎత్తుగడ.. వీధి కుక్కల సాయంతో.. -
9 రోజుల పాటు గనుల్లో చిక్కుకున్న కార్మికులు...కాఫీ ఫౌడర్, నీళ్లే ఆహారంగా...
దక్షిణ కొరియాకి చెందిన మైనింగ్ కార్మికులు బొంగ్వాలోని జింక్ గని కూలిపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఈ మేరకు తొమ్మిది రోజుల పాటు అక్కడే ప్రాణాల కోసం పోరాడారు. అక్కడ గనుల నుంచి వస్తున్న నీరు, తమ వద్ద ఉన్న కాఫీ పౌడర్‌తో తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఆపన్న సాయం కోసం ధీనంగా ఎదురు చూశారు ఆ ఇద్దరు. ఈ క్రమంలో ఇద్దు వ్యక్తులు గనుల్లో చిక్కుకుపోయారంటూ దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కి లేఖలు రాశారు అధికారులు. ఆ కార్మికులు సుమారు 190 మీటర్ల భూగర్భంలో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారుల చొరవతో ఆ వ్యక్తులను సురక్షితంగా బయటకు తీశారు. ఆ ఇద్దరు అక్టోబర్ 26న గని కూలిపోవడంతో భూగర్భంలో చిక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఒకరికి 62 ఏళ్లు మరొకరికి 56 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు కండరాల నొప్పితో భాదపడుతున్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియాలో సియోల్‌లో ఉన్న హాలోవిన్ గని ఇప్పటి వరకు 156 మందిని బలిగొందని అధికారులు చెబుతున్నారు. (చదవండి: హిరోషిమా అణుబాంబు విషయమై పుతిన్ కీలక వ్యాఖ్యలు... షాక్‌లో ఫ్రాన్స్) -
కేటీకే 8వ గనిలో ప్రమాదం నలుగురు కార్మికులకు గాయాలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గనిలో గురువారం కోల్ కట్టింగ్‌లో భాగంగా బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. కార్మికులు, అధికారుల కథనం ప్రకారం.. గనిలోని 3వ సీమ్ 21వ లెవల్లో ఉదయం మొదటి షిఫ్ట్‌లో కోల్‌కట్టింగ్ కార్మికులు సీహెచ్ రామకృష్ణ, బండి రాజశేఖర్, ఈర్ల శ్రీనివాస్‌తోపాటు భూక్య గంగ్య అనే యాక్టింట్ కోల్ కట్టర్.. బొగ్గును తొలిచేందుకు పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేశారు. రెండోసారి కూడా బ్లాస్టింగ్ చేసేందుకు డ్రిల్స్ చేస్తున్నారు. ముందు పెట్టిన పేలుడు మందు ఒక చోట పేలకుండా ఉండిపోయింది. దీనిని గమనించకుండా డ్రిల్స్ చేస్తుండగా ఆ పేలుడు పదార్థానికి డ్రిల్లింగ్ మెషీన్ బలంగా తగలడంతో ఒక్కసారిగా పేలింది. దీంతో రామకృష్ణ, రాజశేఖర్, శ్రీనివాస్‌లకు తీవ్రగాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ గంగ్య భయంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆ నలుగురిని సింగరేణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
30 లక్షల మంది మైనర్లు మద్యం బానిసలు
సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్ధాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చిన్నారులను వాటి నుంచి దూరం చేయలేకపోతున్నారనడానికి దేశంలో 30 లక్షల మంది మైనర్లు మద్యానికి బానిసయ్యారనే విషయమే నిదర్శనం. నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ), ఎయిమ్స్, ఢిల్లీల ఆధ్వర్యంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా పలు అంశాలు వెల్లడించారు. దేశంలో 30 లక్షల మంది మైనర్లు మద్యం బానిసలేనని తెలిపారు. తొలిసారిగా 2017–18లో మత్తుపదార్ధాల వినియోగంపై సర్వే నిర్వహించామని ఆయా వివరాలు 2019లో ప్రచురించామని తెలిపారు. ప్రజలను మద్యం బానిస నుంచి విముక్తి చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేశామని తెలిపారు. జువైనల్ హోమ్స్‌లో డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మత్తుపదార్ధాలకు బానిసలైన చిన్నారులను ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారిని సంరక్షించాలని సూచించామన్నారు. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట అవగాహన కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. 10 నుంచి 18 ఏళ్ల మధ్య చిన్నారులను గుర్తించి వారికి అవగాహనతోపాటు ఇతరత్రా నైపుణ్య కార్యక్రమాల్లో భాగస్తులను చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి కటారియా పేర్కొన్నారు. -
బ్రిటన్‌లో ఇద్దరు భారతీయుల మృతి
లండన్: మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు ఢీకొనడంతో భారత సంతతికి చెందిన ఇద్దరు మైనర్లు మృతిచెందిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంజయ్ (10), పవన్‌వీర్ సింగ్ (23 నెలలు) మృతిచెందారు. అన్నదమ్ములైన వీరిద్దరూ తల్లితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వోల్వర్హామ్టన్ వద్ద వారి కారును ఆడీ ఎస్3 కారు ఢీకొంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ బెంట్లీ కారు డ్రైవర్‌తో రేసింగ్‌లో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ రేసింగ్‌లో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉండగా.. బెంట్లీ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడీ, బెంట్లీ కార్లు మితిమీరిన వేగంతో వెళ్తుండగా చూశామని పలువురు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. -
మేఘాలయలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
అన్నా చెల్లెళ్ల ప్రేమ.. ఆత్మహత్య
సాక్షి, చెన్నై: ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు.. కొంతకాలం చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇద్దరి వ్యవహారం ఇంట్లో తెలిసింది. అయితే వారివురు అన్నాచెల్లెలు అవడంతో పెద్దలు తీవ్రంగా మందలించారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుచ్చి జీయపురం, కీళ కారియపట్టికి చెందిన అశోక్ కుమార్ కుమార్ ప్రవీణ్(17) ప్లస్ టూ చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమించాడు. వీరిద్దరూ ఒకే కులానికి చెందిన వారు.. పైగా వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరిని మందలించారు. దీంతో మనస్థానం చెందిన ఇద్దరు బుధవారం మామూలుగానే స్కూలుకు వెళ్లారు. అక్కడ నుంచి తిరుచ్చి రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదని, చనిపోయి ప్రేమను కాపాడుకుంటామని వారు నోట్లో రాసినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
అప్‌లాంజ్ బార్ సీజ్
సాక్షి, హైదరాబాద్ : మద్యం మత్తులో నిండు ప్రాణం బలిగొన్న యువతుల ఘటనపై ఘట్కేసర్ అధికారులు స్పందించారు. 21 ఏళ్ల వయసు లోపు వారికి మద్యం అమ్మకూడదన్న నిబంధనను పట్టించుకోకుండా మద్యం అమ్మకాలు చేశారన్న కారణంతో మంగళవారం ఏఎస్రావు నగర్‌లోని అప్‌లాంజ్ (సమ్మక్క సారక్క) బార్‌ను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య ఆధ్వర్యంలో దాడులు జరిపి సీజ్ చేశారు. నిర్వాహకుడు శ్రీధర్‌గౌడ్‌పై కేసు నమోదు చేశామని, ఉన్నతాధికారుల సూచన మేరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. సమ్మక్క–సారక్క పేరుతో నాగారానికి చెందిన శ్రీధర్‌గౌడ్ పేరు మీద బార్‌కు లైసెన్స్ ఉంది. నిర్వహణ సక్రమంగా సాగకపోవడంతో నిర్వాహకుడు బార్‌ను మూసేశాడు. మూసేసిన బార్‌ను పై ఫ్లోర్లో ఉన్న అప్‌లాంజ్ రెస్టారెంట్ నిర్వాహకులు లీజ్‌కు తీసుకొని గత 6 నెలలుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కనీస నిబంధనలను పాటించకుండా బార్ నిర్వహణ, మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఈ బార్లో తప్పతాగిన యువతులు డ్రైవింగ్ చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. కాగా సదరు యువతులు 21 ఏళ్లు దాటినట్లు తప్పుడు ధృవపత్రాలు చూపించారని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అతిగా మద్యం సేవించడంతో బారు సిబ్బంది వారిని కారు వరకు తీసుకెళ్లి వదిలినట్లు సీసీ కెమెరా రికార్డులు చెబుతున్నాయి. -
ప్రేమ సుడిలో బాల్యం..!
► రహస్యంగా పెళ్ళి చేసుకున్న ఇద్దరు మైనర్లు ► గర్భవతైన బాలిక ► మైసూరులో కలకలం మైసూరు: పదహారేళ్ల బాలిక– 17 ఏళ్ల కుర్రాడు ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయి గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ ముక్కుపచ్చలారని బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన మైసూరు నగరంలో సంచలనాత్మకమైంది. నగరంలోని ఎన్.ఆర్. మోహల్లాలో ఉన్న కురిమండిలో సోమవారం వెలుగు చూసింది. కురిమండికి చెందిన టెన్త్ బాలికను 17 సంవత్సరాల మైనర్ యువకుడు ప్రేమపేరుతో మభ్యపెట్టి సన్నిహితంగా ఉంటున్నాడు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాల్లో 10వ తరగతి చదువుతుండగా, తండ్రి చనిపోవడంతో ఆమె పెద్దమ్మ వద్ద ఉంటోంది. కుర్రవాడు మైసూరు ప్యాలెస్ ముందు బాగంలో బొమ్మల వ్యాపారం చేసేవాడు. బాలికతో కలిసి కుర్రాడు సినిమాలకు షికార్లకు తిరిగేవాడు. ఇది తప్పని ఎన్నిసార్లు చెప్పినా కూడా బాలిక వినిపించు కోలేదు, దాంతో వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో నుంచి ఆమెను వెళ్ళగొట్టింది. బాలిక కుర్రాడితో కలిసి దేవాలయానికి వెళ్ళి ఇద్దరు రహస్యంగా పూలదండలు మార్చుకుని ‘పెళ్ళి’ చేసుకున్నారు. దీంతో పరువు పోతుందని భయపడి కుర్రవాని తల్లిదండ్రులు ఇద్దరినీ ఇంటిలోకి రానిచ్చారు. ఉపాధ్యాయుల ఆరాతో వెలుగులోకి నెల రోజుల నుంచి పాఠశాలకు బాలిక రాకపోవడంతో సహచర విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు బాలికను రప్పించి విచారించారు. తాను పెళ్ళి చేసుకున్నానని, ప్రస్తుతం మూడు నెలల గర్బవతిని అని అందుకే పాఠశాలకు రావడం లేదని చెప్పడంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఈ విషయాన్ని బాలల సహాయవాణికి తెలిపారు. శిశు సంక్షేమ అధికారులు బాలికను విచారించారు. చివరకు ఎన్.ఆర్ మోహల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను బాలల సహాయ కేంద్రానికి, కుర్రాడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు విచారణలో ఉంది. -
యాక్టివాను ఢీకొన్న స్కార్పియో
భార్యాభర్తలకు తీవ్రగాయాలు.. భార్య పరిస్థితి విషమం స్కార్పియోలో ఆరుగురు మైనర్లు ప్రగతినగర్ వద్ద ఘటన హైదరాబాద్: మైనర్లు నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో భార్యాభర్తలకు తీవ్రగాయాలరుున ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రగతినగర్‌లో ఫ్లాట్ కొనేందుకు నాగేంద్రకుమార్, దేవి యాక్టివాపై ఆదివారం సాయంత్రం బయలుదేరారు. మిథిలానగర్ వద్దకు రాగానే వీరి వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో(ఏపీ 29 ఏటీ 2799) ఢీకొట్టింది. దేవి తలకు తీవ్రగాయం కావడంతో కోమాలోకి వెళ్లగా.. నాగేంద్రకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన దేవి పరిస్థితి విషమంగా ఉండగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగేంద్రకుమార్ కాలు, చేయి విరిగాయి. ప్రమాద సమయంలో స్కార్పియోలో ఆరుగురు 10వ తరగతి విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా పరారీలో ఉన్నారని.. కారులో ఫణీంద్ర, సాయి నిఖిల్, తేజ, మౌళి, రాములతో పాటు మరో విద్యార్థి ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. వాహనాన్ని సాయినిఖిల్ నడిపినట్లు.. వీరు నిజాంపేటలోని భాష్యం స్కూల్లో చదువుతున్నట్లు తెలిపారు. కాగా స్కార్పియో సాయి నిఖిల్ తండ్రిదిగా పోలీసులు గుర్తించారు. -
పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు జైలుకే !
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు ఊచలు ఇద్దరినీ కేసుల్లో బుక్ చేస్తాం : ఏసీపీ హితేంద్ర హెచ్చరిక బెంగళూరు (బనశంకరి) : మైనర్లు తాగి వాహనాలు నడిపినా... ప్రమాదాలకు పాల్పడినా వారి తల్లిదండ్రులు జైలుకు వెళ్లడం ఖాయమని నగర ఏసీపీ హితేంద్ర హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అత్యధికంగా మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతుండటంతో వాటి నివారణకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. మైనర్లు తెలిసీ తెలియని వయసులో మద్యం తాగి వాహనాలను వేగంగా నడుపుతూ అమాయలకును బలి తీసుకుంటున్నారని, మైనర్లు తాగి వాహనాలు న డిపితే శిక్ష ఏకంగా వారి తల్లిదండ్రులకు తప్పదని హెచ్చరించారు. ఇద్దరినీ కేసులో బుక్ చేస్తామని హితేంద్ర అన్నారు. మైనర్ల చేతికి వాహనాలు ఇచ్చే ముందు జాగ్రత వహించాలన్నారు. గతంలో మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లెసైన్స్‌ను ఆరు నెలలు లేదా పూర్తి స్థాయిలో రద్దు చే సేవారన్నారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదన్నారు. లెసైన్స్ ఇంటిలో మరిచిపోయాను అని చెప్పే వారికి కూడా శిక్ష తప్పదు’ అని అన్నారు. నగర పోలీసులు అర్ధరాత్రి వేళ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నా కేవలం మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాతో సరిపెడుతున్నారన్నారు. గత నెలలో 4 వేల లెసైన్స్‌లు స్వాధీనం చేసుకున్నామని, వాటి రద్దుకు సిఫార్సు చేశామన్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదన్నారు. దీంతో కఠిన చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ్త -
మంత్రిని అపహరించి హతమార్చారు
బొలీవియా: కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చలేదని డిప్యూటీ మినిస్టర్ ను కిడ్నాప్ చేసి కిరాతకంగా హతమార్చిన ఘటన బొలీవియాలో చోటు చేసుకుంది. ప్రైవేటు కంపేనీలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా గని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులున్న ఆ దారి గుండా వెళుతున్న డిప్యూటీ మంత్రి రొడాల్ఫో ఇల్లాన్న్ ను చుట్టు ముట్టిన కార్మికులు ఆయనను అపహరించి, హతమార్చారని బొలీవియా ప్రభుత్వం తెలిపింది. బొలీవియా ప్రభుత్వ మంత్రి కార్లోస్ రొమేరో ఇది కిరాతక చర్యగా అభివర్ణించారు. డిప్యూటీ మినిస్టర్ మృతదేహాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా ఆయన ఆందోళన కారులను హెచ్చరించారు. గత కొంత కాలంగా బొలీవియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గని కార్మికులు ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. దీంతో ఇద్దరు ఆందోళనకారులను పోలీసులు హతమార్చారు. -
బండి నడిపితే బడి నుంచి బహిష్కరణే!
సాక్షి, సిటీబ్యూరో: తల్లిదండ్రులారా ఒక్క క్షణం ఆలోచించండి...పిల్లల సరదా కోసం వారికి బండి కొనిస్తున్నారా? అలా చేస్తే వారి భవితను చేజేతులా మీరు నాశనం చేసినట్టే. ఎందుకంటారా...? డ్రైవింగ్ లైసెన్స్‌కు అర్హత లేని (18 లోపు) వారికి బండి ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగి ఎదుటివారి ప్రాణాలు పొవచ్చు...లేదా వారే బండి పై నుంచి జారిపడితే ప్రాణం పోవచ్చు... ఈ రెండింటీలో ఏది జరిగినా నష్టం మాత్రం పూడ్చలేం. అందుకే ప్రమాదం జరిగే వరకు వేచి చేసే కన్నా పిల్లలకు బైక్ ఇవ్వకుండా జాగ్రత్త పడటం మేలని సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ పోలీసులంటున్నారు. ఇలాంటి మాటలు చెబుతూనే.. మైనర్ బండి నడుపుతూ తమకు చిక్కితే మాత్రం ఏకంగా బడి, కాలేజీ నుంచి వారిని బహిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. అండర్ ఏజ్డ్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్ వల్ల కలిగే అనర్ధాలపై గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గతేడాది జనవరి నుంచి జూన్ వరకు 1088 మంది మైనర్లు బండి నడుపుతూ పోలీసులకు చిక్కితే.., ఈ ఏడాది అదే సమయంలో 1289 మంది దొరకడాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు తల్లిదండ్రులతో పాటు మైనర్లకు ప్రత్యేక క్లాస్‌లు తీసుకున్నారు. అలాగే అండర్ ఏజ్డ్ డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులో గతేడాది జనవరి నుంచి జూన్ వరకు 21 కేసులు నమోదైతే, ఈసారి అదే సమయంలో 29 మంది పట్టుబడ్డారని గుర్తుచేశారు. తల్లిదండ్రులూ ఇవి గుర్తుపెట్టుకోండి... ‘‘మోటారు వెహికల్ యాక్ట్ సెక్షన్ 181 కింద బండి నడిపినందుకు మైనర్‌కు రూ.500లు, ఆ బండి యజమానికి 1000ల జరిమానా విధిస్తారు. స్కూల్, కాలేజీల నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వారిని ప్రోత్సహించిన నేరంపై తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు ఉంటాయి. మైనర్‌తో పాటు తల్లిదండ్రులు జువైనల్ జస్టిస్ బోర్డు, కోర్టుకు హాజరు కావాలి. వీసా, పాస్‌పోర్టు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, స్కూల్, కాలేజీ అడ్మిషన్ పొందే విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాలి. మేజర్ అయిన తమ పిల్లలు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, వాహనం నడిపేటప్పుడు మొబైల్ వాడకపోవడం, మద్యం తాగి బండి నడపకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పార్టీలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, మద్యం తీసుకొని వ్యక్తిని మాత్రమే డ్రైవర్‌గా నియమించుకోవాలి’’.. అని సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. కళ్లు చెమర్చిన దృశ్యాలు... సైబరాబాద్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీలన్నీ కలిపి యాక్సిడెంట్స్ జరుగుతున్న తీరును ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. వాటిని చూసిన తల్లిదండ్రులు, మైనర్లు, డ్రంకన్ డ్రైవర్లు ఉద్విగ్నానికి లోనయ్యారు. మైనర్‌కు బండి ఇవ్వడం తప్పని పేరెంట్స్ అంటే.., ఇక నుంచి బండి నడపబోమని మైనర్లు అన్నారు. ‘‘నేను యూసుఫ్‌గూడలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు అర్హత లేని నేను బండి నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డా. అయితే పోలీసులు ఇచ్చిన ఈ అవగాహన కార్యక్రమం నాలో మార్పును తీసుకొచ్చింది. ఇక నుంచి బండి నడపను. మరో పది మందికి ఇదే విషయమే చెబుతా’.. అని ఫయాజ్ అనే బాలుడన్నాడు. బండి నడుపుతూ పోలీసులకు చిక్కిన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మైనర్ తండ్రి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ...పోలీసులు ఇదే తీరును సాగిస్తే పిల్లలు బండిపై బయటకు వచ్చేందుకు భయపడతారని, తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుందన్నారు. -
వారి జీవితాలతో ఆడుకోవద్దు:పాపయ్య
సాక్షి,సిటీబ్యూరో: ‘‘జీవితం చాలా విలువైనది. ఒక్కసారి దానిని కోల్పోతే తిరిగిరాదు. మైనర్లకు వాహనాలిచ్చి వారి జీవితాలతో ఆడుకోవద్దు’’.. అని ట్రాఫిక్ నార్త్ డిస్ట్రిక్ అడిషనల్ డీసీపీ పాపయ్య తల్లిదండ్రులకు సూచించారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ)లో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ పాపయ్య మాట్లాడుతూ... డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఎంవీఐ యాక్ట్ ప్రకారం నడిపిన వారితో పాటు వాహనం యజమానిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. వాహన యజమానికి రూ.1200ల చలాన్ విధించి కౌన్సెలింగ్ చేస్తామన్నారు. నగర రహదారులపై ప్రమాదాలు నియంత్రించేందుకే మైనర్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మైనర్లు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే వారికి మద్యం సరఫరా చేసిన బార్, వైన్‌షాపుల లైసెన్స్ రద్దుకు ఎక్సైజ్‌శాఖకు సిఫారసు చేస్తామన్నారు. అలాగే మైనర్ల సమాచారాన్ని వారు చదువుకొనే విద్యా సంస్థలకు, పెద్దలైతే వారు పనిచేసే సంస్థలకు తెలియజేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైనర్ బాబులూ జాగ్రత్త..!
-
మైనర్ బాబులూ జాగ్రత్త..!
డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలే.. ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ గన్‌ఫౌండ్రీ: మైనర్లు వాహన డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నగర ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాథ్ హెచ్చరించారు. తాను అధికారిగా కాకుండా ఒక తండ్రిగా తన మైనర్ కుమారుడికి వాహనం ఇవ్వనని వాగ్దానం తీసుకున్నానన్నారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు శనివారం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ)లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండని బాలలు వాహనం నడిపితే తల్లిదండ్రులదే బాధ్యత అని హెచ్చరించారు. డ్రైవింగ్ లెసైన్స్ లేని వ్యక్తికి వాహనం అప్పగించడం, వయసు నిండని పిల్లలకు వాహనం ఇచ్చినా తల్లిదండ్రులపై సైతం కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే చలాన్ రాసే సమయంలో సదరు వ్యక్తి ఆధార్ నెంబర్, తాను తాగిన బార్ అండ్ రెస్టారెంట్ పేరును సైతం నమోదు చేస్తామని తెలిపారు. ఎక్కువసార్లు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి ఏ బార్లో తాగాడో విచారించి ఎక్కువసార్లు ఆ బార్ పేరు నమోదైతే ఆ బార్ లెసైన్స్‌ను సైతం రద్దు చేసేలా ఎక్సైజ్ శాఖకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. అనంతరం నేటి నుంచి తమ మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వబోమని ఈ కౌన్సిలింగ్‌కు హాజరైన తల్లిదండ్రులతో వాగ్దానం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీలు జైపాల్, భద్రేశ్వర్, టీటీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు హరీష్, నరహరి, కె. శ్రీనివాస్, రవి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
షీ-టీమ్స్‌కు పట్టుబడ్డ 37 మంది మైనర్లు
అదనపు సీపీ స్వాతిలక్రా సిటీబ్యూరో: ఈవ్‌టీజింగ్‌పై ఉక్కుపాదం మోపిన షీ-టీమ్స్ డెకాయి ఆపరేషన్లను ముమ్మరం చేసింది. వారం రోజుల వ్యవధిలో 37 మంది మైనర్లు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి పోలీసులకు చిక్కారు. వీరందరికీఈసారి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్వచ్ఛంద సంఘాల కౌన్సెలర్లతో వారికి బుధవారం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పించారు. ఈ సంద ర్భంగా క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతి లక్రా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు 80 మందిపై ఈవ్‌టీజింగ్ కేసులు నమోదు చేశామన్నారు. వీరిలో ఎనిమిది మందికి జైలు శిక్ష పడగా మిగతావారికి చలానా విధించామన్నారు. తాజాగా ఈ వారం రోజుల్లో షీ-టీమ్స్ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 37 మంది బాలలు దొరికారన్నారు. వీరందరికీ వారి తల్లిదండ్రుల సమక్షంలోనే ఈవ్‌టీజింగ్‌పై నిపుణులైన ప్రొఫెసర్లు, మహిళా సంఘాల నేతలతో కౌన్సెలింగ్ ఇప్పించామన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించిన తీరు చూస్తే వీరంతా మారిపోతారనే నమ్మకం కలిగిందని స్వాతి లక్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఈవ్‌టీజింగ్ జరిగితే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. బాధితుల పేర్లు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతున్నామన్నారు. డీసీపీ పాలరాజు మాట్లాడుతూ నగరంలో తప్పిపోయిన పిల్లల ఆచూకీపై సీఐడీ అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్‌కు నగర పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. డివిజన్ల వారీగా ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు వి.శ్రీనివాస్, కె.ప్రసన్నరాణి, కవితతో పాటు ఈవ్‌టీజింగ్‌లో పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులు, వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన కౌన్సెలర్లు పాల్గొన్నారు. -
మృత్యుగనులు
సాక్షి, మంచిర్యాల: సింగరేణి.. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లనేల.. జిల్లాలో పదిహేను భూగర్భగనులు, నాలుగు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఏటా వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు బొగ్గులో కలిసి ‘పోతున్నారు’. మరికొందరు గాయాలపాలై జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. గనిలోకి వెళ్లిన కార్మికుడు ఇంటికి తిరిగొస్తాడో లేదో తెలియని పరిస్థితి. ప్రకృతికి విరుద్ధంగా భూమి పొరల్లో వందల మీటర్ల దూరంలో బొగ్గు ఉత్పత్తి చేసే కార్మికుడికి ఏ రూపంలో విపత్తు ముంచుకొస్తుందో తెలియదు. కార్మికుడు ఇంటికొచ్చే వరకు కుటుంబ సభ్యుల్లో ఒకటే ఉత్కంఠ. కార్మికుల జీవితాలతో చెలగాటం సింగరేణి యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉత్పత్తే లక్ష్యంగా కార్మికులపై ఒత్తిడి తెస్తూ వారి ప్రాణాలు బలిగొంటోంది. ఏటా చాలామంది కార్మికులు తమ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. మరెన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి కోసం టెక్నాలజీ పెంపొందిస్తుందే తప్ప కార్మికుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేక పోతోంది. ప్రమాదాలు పసిగట్టే యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం సింగరేణిలో లేదు. భూగర్భంలో సెకనుకోసారి పరిస్థితులు మారుతూ ఉంటాయి. పైకప్పు కూలడం, సైడ్ఫాల్, విష వాయువులు, నీటి గండాలు కార్మికులను చంపేస్తుంటాయి. వీటిని పసిగట్టే యంత్రాలు ఉంటే కొంతవరకైనా ప్రమాదాలు తగ్గించవచ్చు. అమలుకాని డీజీఎంఎస్ నిబంధనలు గనుల్లో ప్రమాదాల నివారణ చర్యలకు ఆరు నెలలకోసారి డీజీఎంఎస్ నిబంధన ప్రకారం నిర్వహించాల్సిన కార్పొరేట్ సేఫ్టీ ట్రై పార్టీయేట్ సమావేశం ఏడాదిగా జాడలేదు. 1981 నుంచి 2013 వరకు అంటే దాదాపు మూడు దశాబ్దాల కాలంలో జిల్లాలోని భూగర్భ గనుల్లో 8,260 మంది కార్మికులు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది జనవరి 11న శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే న్యూటెక్గనిలో పైకప్పు కూలి కోల్‌కట్టర్ కోతయ్య(56), కోల్పిల్లర్ నేరళ్ల సతీశ్(33) మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రతిసారి కార్మికులు ఆందోళన చేపడుతూనే ఉన్నారు. రక్షణ కల్పిస్తామని అధికారులు హామిలిస్తూనే ఉన్నారు. అయినా గని ప్రమాదాలు ఆగడం లేదు. రక్షణ చర్యలపై చిత్తశుద్ధి కరువు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టడంలో సింగరేణి విఫలమవుతోంది. రిస్క్ పనిస్థలాల్లో రూప్ సపోర్టు చేయాలి. పనిస్థలాన్ని మూసివేయాలి. ఒకవేళ పని చేయాల్సి ఉంటే సరిపడా మ్యాన్ పవర్ ఏర్పాటు చేయాలి. మైన్ యాక్ట్ ప్రకారం.. సరైన సూపర్‌వైజింగ్‌లో పనిచేయాలి. కానీ, సింగరేణిలో సుమారు 500 మంది సూపర్వైజర్లు అవసరమున్నారు. ఏటా ఉత్పత్తి లక్ష్యం భారీగా నిర్ణయిస్తూ కార్మికులపై పనిభారం మోపుతోంది. నిబంధనల ప్రకారం.. కేవలం మూడు షిఫ్టులు ఉండాలి. అధిక ఉత్పత్తి, మెయింటెన్స్ పేరుతో ఐదు షిఫ్టులు పెడుతోంది. పని ఒత్తిడి పెరగడంతో కార్మికులు స్వీయరక్షణపై దృష్టిసారించలేక పోతున్నారు. కోడ్ ఆఫ్ ప్రాక్టీస్‌కు విరుద్ధంగా ఉత్పత్తి కోడ్ ఆఫ్ ప్రాక్టీస్‌కు విరుద్ధంగా అధిక ఉత్పత్తి కోసం యాజమాన్యం పనిచేయిస్తోంది. ఇందుకోసం అధికారులు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. ఏదైన ప్రమాదం జరిగినపుడు ఎందుకు చేశారంటూ కిందిస్థాయి సూపర్వైజర్లు కార్మికులకు చార్జిషీట్లు, సస్పెండ్ చేస్తు వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే.. ఎక్కడైన రైల్వే ప్రమాదం జరిగితే కిందిస్థాయి ఉద్యోగి నుంచి పైస్థాయి అధికారుల వరకు అందరిపై చర్యలు తీసుకుంటారు. అదే తరహాలో సింగరేణిలోనూ అమలు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందు షిఫ్టులో ఉన్న సేఫ్టీ రిపోర్టులను తరువాత షిఫ్టులో పరిగణలోకి తీసుకొని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉండగా దాన్ని పూర్తిస్థాయి లో అమలు చేయడం లేదు. అలాగే సేఫ్టీ సమావేశాలు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఉత్పత్తి వేటలో కార్మికుల ప్రాణాలను పట్టించుకోకుండా సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలు కల్పించకుండా పని చేయిస్తుండటంతోనే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధినపడుతున్న కుటుంబాలు గని ప్రమాదాల్లో సింగరేణి కార్మికులు చనిపోతే యాజమాన్యం నష్టపరిహారం, అవసరమైతే ఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇచ్చే డబ్బులు కూడా కార్మికుని జీతం నుంచి కట్ చేసుకున్నవే అని యాజమాన్యం గుర్తించాలి. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం వీధిపాలవుతుందని గ్రహించడం లేదు. డబ్బులు, ఉద్యోగం పోయిన కుటుంబ పెద్దను తెచ్చివ్వలేదు కదా అన్న విషయాన్ని గుర్తించాలి. -
ఆ పిల్ల రాక్షసులను గుర్తించారు
హైదరాబాద్: పాతబస్తీలో మైనర్ బాలికపై రాక్షసంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. తలాబ్‌కట్టకు చెందిన 14 ఏళ్ల బాలికను ఓ స్నేహితుడు నమ్మించి బయటకు తీసుకువెళ్లాడు. ఆ తరువాత ఆ బాలికను ఓ వాహనంలో తిప్పుతూ అత్యాచారం చేశాడు. అతనే కాకుండా అతని స్నేహితులు మరో ముగ్గురు కూడా మానవ మృగాల్లాగా ఆ బాలికపై అత్యాచారం చేశారు. నలుగురు కలిసి సామూహికంగా అత్యాచారం చేసి ఆ బాలికను హింసించారు. వివిధ ప్రాంతాలలో తిప్పుతూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితులు ఆటో డ్రైవర్ సల్మాన్, షేక్ ఇమ్రాన్, అజహర్, ఎండీ ఇమ్రాన్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై నిర్భయ చట్టం, ఐపీసీ 366 సెక్షన్ల కింద భవానీపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. దేశంలో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధులు స్వైర విహారం చేస్తున్నారు. ప్రతిరోజూ ఎన్నో చోట్ల మహిళలు, బాలికలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. కామాంధులకు భయంలేదు. పసిమొగ్గలను కూడా ఈ కామపిశాచులు వదలడంలేదు. నిర్భయ చట్టం కాగితాలకే పరిమితమైపోయింది. ఈ చట్టానికి కూడా ఎవరూ భయపడటంలేదు.