మైనర్లు వాహన డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నగర ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాథ్ హెచ్చరించారు. తాను అధికారిగా కాకుండా ఒక తండ్రిగా తన మైనర్ కుమారుడికి వాహనం ఇవ్వనని వాగ్దానం తీసుకున్నానన్నారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు శనివారం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (టీటీఐ)లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండని బాలలు వాహనం నడిపితే తల్లిదండ్రులదే బాధ్యత అని హెచ్చరించారు.