పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ పరిధిలో గల జర్దాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హర్నై జిల్లాలో జరిగింది. గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ విపత్తు సంభవించింది. ఆ సమయంలో 18 మంది మైనర్లు గనిలో చిక్కుకుపోయారు. వెంటనే మైనర్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనలో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గనిలో రాత్రిపూట మీథేన్ వాయువు వెలువడింది. ఇదే పేలుడుకు కారణం కావచ్చని బలూచిస్తాన్ చీఫ్ మైన్స్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ ఘనీ బలోచ్ తెలిపారు. ప్రభుత్వ గనుల శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయని తెలిపారు. మృతదేహాలను గుర్తించి, ఆసుపత్రికి తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment