Province
-
బలూచిస్తాన్ బొగ్గు గనిలో భారీ పేలుడు.. 12 మంది మృతి!
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ పరిధిలో గల జర్దాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హర్నై జిల్లాలో జరిగింది. గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ విపత్తు సంభవించింది. ఆ సమయంలో 18 మంది మైనర్లు గనిలో చిక్కుకుపోయారు. వెంటనే మైనర్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనలో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గనిలో రాత్రిపూట మీథేన్ వాయువు వెలువడింది. ఇదే పేలుడుకు కారణం కావచ్చని బలూచిస్తాన్ చీఫ్ మైన్స్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఘనీ బలోచ్ తెలిపారు. ప్రభుత్వ గనుల శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయని తెలిపారు. మృతదేహాలను గుర్తించి, ఆసుపత్రికి తరలించామన్నారు. -
Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’
ఇస్లామాబాద్: పర్యాటక, వినోదాత్మక ప్రాంతాల్లోకి మహిళలు కనిపించరాదంటూ పాకిస్తాన్‌లోని ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని గిరిజన మండలి తీర్మానం చేసింది. ఆ ప్రాంతాల్లోకి మహిళల ప్రవేశం అనైతికం, ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంది. బజౌర్ గిరిజన జిల్లా సలార్జాయ్ తహసీల్‌కు చెందిన జిర్గా (గిరిజన మండలి) ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రభుత్వం వెంటనే అమలు చేయకుంటే తామే ఆ పని చేస్తామంది. ఈ సమాశానికి జమియాత్ ఉలేమా–ఇ–ఫజుల్(జేయూఐ–ఎఫ్) జిల్లా చీఫ్ మౌలానా అబ్దుర్ రషీద్ నేతృత్వం వహించారు. పాక్ అధికార సంకీర్ణంలో జేయూఐ–ఎఫ్ ప్రధాన భాగస్వామి. -
కాబూల్ శివార్లలో తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ తాలిబన్ల వశమయ్యే సమయం దగ్గర పడుతోంది. కాబూల్ శివార్ల దాకా తాలిబన్లు చొచ్చుకొని వచ్చి సరిగ్గా 11 కి.మీ. దూరంలో తిష్టవేసుకొని కూర్చున్నారు. దేశ రాజధాని కాబూల్‌ని ముట్టడించే పని ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అఫ్గాన్ మొత్తం తాలిబన్ల వశమైతే మరోసారి దేశం అంతర్యుద్ధంతో తల్లడిల్లిపోతుందనే ఆందోళనలు చెలరేగుతున్నాయి. కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరంలో ఉన్న చార్ అస్యాబ్ జిల్లా వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్ ప్రావిన్స్ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది చెప్పారు. అఫ్గాన్ నుంచి అమెరికా ఈ నెల 31న చివరి విడత బలగాలను ఉపసంహరించాల్సి ఉండగా, దానికి రెండు వారాల ముందే తాలిబన్లు కాబూల్‌లో తమ జెండాని ఎగురవేయడానికి సిద్ధమవుతున్నారు. శనివారం ఒక్కరోజే మరో ఐదు ప్రావిన్స్‌లను ఆక్రమించుకున్నారు. లోగర్ ప్రావిన్స్ స్వాధీనం చేసుకునే సమయంలో తాలిబన్లు, అఫ్గాన్ సైన్యానికి మధ్య భీకర పోరు జరిగింది. అయినప్పటికీ తాలిబన్ల ధాటికి అఫ్గాన్ దళాలు నిలవలేకపోయాయి. పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న పక్తికా ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నట్టు ఆ ప్రావిన్స్ ప్రజాప్రతినిధి ఖలీద్ అసాద్ వెల్లడించారు. ఆ ప్రావిన్స్‌లోని ప్రధాన నగరమైన సహరానా తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకుంది. దేశంలోని దాదాపుగా ముప్పావు వంతు ప్రాంతాలు ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కీలక నగరాలైన హెరాత్, కాందహార్లు (దేశంలోని రెండో, మూడో అతిపెద్ద నగరాలు) ఇప్పటికే తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ఉత్తర, పశ్చిమ, దక్షిణాది ప్రాంతాలను కొల్లగొట్టేసి తమ సంస్థకు చెందిన తెల్ల జెండాను ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగురవేస్తున్నారు. ఒక పథకం ప్రకారం ముందుకు వెళుతున్న తాలిబన్లు మజార్ ఏ షరీఫ్(బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని)ను ఆక్రమించుకోవడానికి ముప్పేట దాడి చేశారు. భీకరపోరు తర్వాత శనివారం రాత్రి మజార్ ఏ షరీఫ్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్నారు. ఫర్యాబ్, కునార్ ప్రావిన్స్‌లు కూడా తాలిబన్ల వశమయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో(రాష్ట్రాలు) 22 తాలిబన్ల అధీనంలోకి వచ్చేశాయి. ఉలిక్కిపడిన అమెరికా, కాబూల్‌కు 3 వేల బలగాలు తాలిబన్లు చెలరేగిపోతూ వాయువేగంతో ఒక్కో ప్రాంతాన్ని చుట్టేస్తూ ఉండడంతో అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాబూల్‌లోని తమ దౌత్య సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి 3 వేల మంది భద్రతా బలగాలను పంపింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలస్యం కావడంతో ఆగస్టు 31 నాటికి పూర్తిగా బలగాలను వెనక్కి తీసుకురావాలన్న తమ లక్ష్యాలను ప్రభుత్వం అందుకోగలదా లేదా అన్న సందేహాలైతే ఉన్నాయి. మూడువేల బలగాల్లో కొంతమంది శుక్రవారం కాబూల్‌కు చేరుకోగా... మిగతా వారు ఆదివారం నాటికి రానున్నారు. ఈ బలగాలు కాబూల్ చేరుకొని దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకువస్తాయి. తాలిబన్లు కాబూల్ చేరే లోపు అమెరికా చేసే ఈ ఆపరేషన్ ఎంతవరకు సాగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం అమెరికాకి చెందిన సైనికులు వెయ్యి మంది మాత్రమే ఉండడంతో తమ సిబ్బందిని తరలించడం కష్టమవుతుందనే అంచనాతోఅప్పటికప్పుడు 3 వేల మంది సైనికుల్ని పంపింది. క్షణక్షణం బతుకు భయం అఫ్గాన్‌పై తాలిబన్లు పట్టు బిగుస్తూ ఉండడంతో ప్రజల్లో రోజు రోజుకీ ఆందోళన తీవ్రతరమవుతోంది. ఇక ముందు తమ బతుకులు ఎలా ఉంటాయోనని తలచుకుంటే వారికి వెన్నులో వణుకు పుడుతోంది. మజర్–ఏ–షరీఫ్ చుట్టూ తాలిబన్లు మోహరించి ఉండడంతో క్షణక్షణం భయంతో బతుకుతున్నారు. పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని నగరవాసి మొహిబుల్లా ఖాన్ చెప్పారు. సుస్థిరతకే కృషి: అధ్యక్షుడు ఘనీ అఫ్గాన్‌లో సుస్థిరత ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని, దేశంలో చెలరేగే హింసాత్మక పరిస్థితుల్ని అడ్డుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సాయుధ బలగాలను తిరిగి సమాయత్తపరచడానికే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ కాబూల్ శివార్లకి చేరుకున్న నేపథ్యంలో ఘనీ రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిపోతారని విస్తృతంగా ఊహాగానాలు చెలరేగాయి. అంతర్జాతీయ మీడియా ఇక ఘనీ పని అయిపోయినట్టుగా కథనాలు రాసింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం నాడు టెలివిజన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. గత 20 ఏళ్లుగా సాధించిన లక్ష్యాలను వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని అన్నారు. అఫ్గాన్లపై యుద్ధాన్ని ప్రకటించి, ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోనని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. అయితే తన రాజీనామా విషయంపై వస్తున్న వార్తల గురించి ఆయన ప్రస్తావించలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడుకోవడానికి, యుద్ధ ప్రమాదం నుంచి ప్రజల్ని రక్షించడానికి అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దేశంలో శాంతి, సుస్థిరత ఏర్పాటు చేయడానికి రాజకీయ పక్ష నాయకులు, ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పారు. శాంతి, సుస్థిర స్థాపనకు పరిష్కార మార్గాన్ని కనుగొంటామని ఘనీ స్పష్టం చేశారు. ► 22: అఫ్గాన్‌లో మొత్తం 34 ప్రావిన్స్‌లలో 22 ఇప్పటికే తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోయాయి ► 5: శనివారం తాలిబన్ల వశమైన ప్రావిన్స్‌లు ► 3000: కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బంది, పౌరులను తరలించేందుకు అమెరికా అత్యవసరంగా 3వేల మంది సైనికులను పంపుతోంది -
తాలిబన్ల చెరలో జరాంజ్‌నగరం
కాబూల్: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా, యూరప్ దేశాల సేనలు వెనక్కి మళ్లడం మొదలైన తర్వాత తాలిబన్లకు అడ్డే లేకుండా పోయింది. దేశంలో క్రమంగా ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే 70% భూభాగం ముష్కరుల పెత్తనం కిందకు వచ్చేసింది. తాజాగా నిమ్రోజ్ ప్రావిన్షియల్ రాజధాని జెరాంజ్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ గవర్నర్ రోహ్ గుల్ జైర్జాద్ శుక్రవారం స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అఫ్గాన్ నుంచి విదేశీ సైనిక బలగాల ఉపసంహరణ మొదలైన తర్వాత తాలిబన్లు ఒక ప్రావిన్షియల్ రాజధానిని చెరపట్టడం ఇదే మొదటిసారి. దేశంలో ప్రధాన నగరాలను కాపాడడానికి ప్రభుత్వ దళా లు అష్టకష్టాలు పడుతున్నాయి. తాజా ఘటనతో అఫ్గాన్ సైనికుల ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. ఇరాన్ సరిహద్దుల్లోని జరాంజ్ నగరం ఎలాంటి ప్రతిఘటన లేకుం డానే తాలిబన్ల వశమయ్యింది. ఇక్కడ 50 వేల కుపైగా జనాభా నివసిస్తోంది. తీవ్రవాదులు జరాం జ్ వీధుల్లో వీర విహారం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీరి రాకతో స్థాని కులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ మీడియా చీఫ్ కాల్చివేత అఫ్గానిస్తాన్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ డైరెక్టర్‌ను తాలిబన్లు కాల్చి చంపారు. అఫ్గాన్ తాత్కాలిక రక్షణ మంత్రిపై హత్యాయత్నానికి తెగించిన కొన్ని రోజులకే ఈ ఘటనకు పాల్పడ్డారు. రాజధాని కాబూల్‌లోనే మీడియా సెంటర్ డైరెక్టర్‌ను తాలిబన్లు చంపేయడం చర్చనీయాంశంగా మారింది. తాలిబన్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ..‘‘మా ముజాహిదీన్ల కాల్పుల్లో ప్రభుత్వ మీడియా సెంటర్ డైరెక్టర్ దావాఖాన్ మెనపాల్ మృతి చెందారు’ అని పేర్కొన్నారు. -
హిందూ రాజు ముస్లిం రాజ్యం
స్వాతంత్య్రానంతర పరిణామాల్లో రెండు రాచరిక పాలనల్లోని రాజ్యాంగ అంశాలు కీలకంగా మారాయి. అవే హైదరాబాద్, కశ్మీర్ సంస్థానాలు. ఈ రెండు సంస్థానాల మధ్య ఒక పోలిక ఉంది. హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు కాగా, రాజ్యాధికారం ముస్లింల చేతిలో ఉండేది. కశ్మీర్లో మెజారిటీ ప్రజలు ముస్లింలు కాగా, అధికారం హిందూ రాజు చేతిలో ఉండేది. భారత్‌లో విలీనానికి నిజాం రాజు అంగీకరించకపోవడంతో ‘ఆపరేషన్ పోలో’తో భారత్ సైన్యాన్ని దించడంతో, హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. పాకిస్తాన్ సైన్యం దురాక్రమణకు రావడంతో కశ్మీర్ రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రాన్ని సాధించుకునేటప్పటికి 562 ప్రాంతాలు రాచరిక పాలనలో ఉన్నాయి. అయితే అందులో మూడు మాత్రం 1947 స్వాతంత్య్రానంతరం కూడా అదే రాచరిక వ్యవస్థలో కొనసాగాయి. కశ్మీర్, హైదరాబాద్, గుజరాత్ కతీవార్ ప్రాంతంలోని జునాగఢ్‌లు మాత్రం 1947 నాటికి భారత్‌లో భాగం కాలేదు. హైదరాబాద్ సంస్థానం ప్రత్యేకత... బ్రిటిష్ పాలన సమయంలోనే హైదరాబాద్ సంస్థానానికి ప్రత్యేక సైన్యముండేది. ప్రత్యేకంగా రైల్వే, పోస్టల్ విభాగాలున్నాయి. హైదరాబాద్ సంస్థానంలో 80 శాతంగా ఉన్న హిందువులను ముస్లిం రాజు పాలించేవాడు. భారత్ పాకిస్తాన్ విభజన సందర్భంగా హైదరాబాద్ సంస్థాన నిజాం రాజు 1947 జూన్ 26న హైదరాబాద్ సంస్థానం ఇటు పాకిస్తాన్‌లోకానీ, భారత్‌లో కానీ విలీనం కాబోదని ఫర్మానా జారీ చేశాడు. హైదరాబాద్ సంస్థానంపై సంపూర్ణాధిపత్యాన్ని కొనసాగించాలని భావిం చాడు. ఆయనకు టోరీ పార్టీ నాయకుడు విన్స్టన్ చర్చిల్ వెన్నుదన్నుగా నిలిచాడు. 1947 ఆగస్టు 15 నాటికి నిజాం రాజు తేల్చుకోలేకపోవడంతో భారతప్రభుత్వం మరో రెండు నెలల సమయమిచ్చింది. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్ స్వతంత్రతను ఒప్పుకునే ప్రసక్తే లేదని నిజాంని హెచ్చరించారు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలపై నిరంకుశ పోకడలను మానుకోవాలని నిజాం రాజును భారత సర్కార్ 1948 సెప్టెంబర్ 7న హెచ్చరించింది. భారతసైన్యం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో అడుగుపెట్టడంతో హైదరాబాద్ సంస్థానం ఎట్టకేలకు భారత్‌లో విలీనమైంది. అదేసమయంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న కశ్మీర్ సంస్థానాన్ని రాజా హరిసింగ్ పాలిస్తున్నారు. కశ్మీర్‌పై పాకిస్తాన్ దండెత్తడంతో రాజా హరిసింగ్ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ముందుకొచ్చారు. చివరకు కొన్ని షరతులకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ భారత్‌లో విలీనం అయ్యింది. -
వనపర్తిలో సప్త సముద్రాలు..
సాక్షి, వనపర్తి(మహబూబ్‌నగర్) : సంస్థానాల కాలం నుంచే.. వనపర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. వనపర్తి సంస్థానాన్ని సుమారు నాలుగు వందల ఏళ్లు పాలించిన రెడ్డిరాజులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ప్రస్తుత పెబ్బేరు మండలంలోని సూగూరు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసుకుని రాయలసీమకు చెందిన వీరకృష్ణారెడ్డి క్రీ.శ.1510లో పరిపాలన ప్రారంభించినట్లు చరిత్రకాలు వెల్లడిస్తున్నారు. కాలానుగుణంగా శ్రీరంగాపురం, వనపర్తి ప్రాంతాలకు రాజధానిని మార్చి పాలన చేశారు. మొదటి రాజారామేశ్వర్‌రావు తదనంతరం 18వ శతాబ్దంలో ఎక్కువ కాలం రాణిశంకరమ్మ వనపర్తి రాజధానిగా సంస్థానాన్ని పరిపాలించారు. సంస్థానానికి వచ్చిన ఆదాయంలో సగభాగం నిజాం ప్రభుత్వానికి కప్పం కడుతూ.. రాజ్యపాలన చేసేవారు. రాణి శంకరమ్మ అదే పద్ధతిని అనుసరించి పాలన చేశారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో ఉన్న రాజమహల్, రాణిమహల్ భవనాలు రాణి శంకరమ్మ హయాంలో నిర్మాణం చేసినవిగా ప్రచారంలో ఉంది. రాణిశంకరమ్మ హయాంలో బీజం వనపర్తి సంస్థానాన్ని ఎక్కువకాలం పాలించిన రాణిగా శంకరమ్మకు చరిత్రలో పదిలమైన స్థానం ఉంది. 18వ శతాబ్దంలో రాణి శంకరమ్మ రాజ్యంలో కరువుఛాయలు కనిపించకుండా.. కురిసిన ప్రతి వర్షం చుక్కను ఒడిసి పట్టి నిల్వ చేసేందుకు ప్రణాళిక రచించారు. పురాణాల్లో ఉన్న సప్తసముద్రాల మాదిరిగా.. తన సంస్థానంలో ఏడు పెద్ద చెరువులను నిర్మించి వాటికి సప్త సముద్రాలుగా ఏడు వేర్వేరు పేర్లను పెట్టి భవిష్యత్ తరాలకు తరగని సంపదగా ఇవ్వాలని బృహత్తరమైన కార్యానికి పూనుకుని తన హయాంలోనే.. నాటి వనపర్తి సంస్థానంలో రెండు తాలుకాలు కొత్తకోట, పెబ్బేరుల పరిధిలో ఏడు చెరువులను నిర్మించారు. ఈ చెరువులకు వర్షం నాటి పాటుతో పాటు ఆయా ప్రాంతాల్లోని చెరువులు అలుగు బారినప్పుడు సప్త సముద్రాల్లోకి చేరేలా.. గొలుసుకట్టు విధానానికి రూపకల్పన చేశారు. సుమారు రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఏడు చెరువులు (సప్త సముద్రాలు) జిల్లా ప్రజలకు ఇప్పటికీ కల్పతరువులుగానే.. ఉపయోగపడుతున్నాయి. ఇక్కడే గొలుసుకట్టు చెరువులు వనపర్తి సంస్థానాధీశుల కాలంలోనే సప్త సముద్రాల పేరిట చెరువుల నిర్మాణంతోపాటు అన్ని చెరువులు, కుంటలకు వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని వ్యవసాయానికి ఉపయోగించే విధంగా అన్ని చెరువులకు గుట్టల ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాల నుంచి వర్షం వరద నీరు చెరువుల్లోకి చేరేలా పాటు కాల్వల నిర్మాణం చేశారు. చెరువులు నిండిన తర్వాత అలుగు పారే నీటిని మరో చెరువులోకి వెళ్లేలా వాగులను నిర్మించారు. చెరువులన్నీ నిండిన తర్వాత చివరగా సప్త సముద్రాల చెరువుల్లోకి వర్షం నీరు చేలా పాటు కాల్వలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అప్పట్లో వ్యవసాయం పండగలా విరాజిల్లినట్లు ప్రచారంలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి జిల్లాలో పండించే వేరుశనగ పంటల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి చెన్నై, కోల్కత్తా, ముంబయి ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి పల్లిని కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నారు. పల్లి ధరల విషయానికి వస్తే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ల కంటే వనపర్తిలో మార్కెట్లో ఏటా వేరుశనగ పంట ఉత్పత్తులకు ఎక్కువ ధరలు పలుకుతాయి. ఎక్కువగా జిల్లా రైతులు వేరుశనగను యాసంగి పంటగా సాగు చేస్తారు. వేరుశనగ పంట ఉత్పత్తులు వచ్చే సమయంలో జిల్లాకేంద్రంలోని మార్కెట్ పల్లి రాశులతో కళకళలాడుతుంది. కాలు మోపెందుకు స్థలం లేనంతగా వేరుశనగ రాశులతో నిండిపోతోంది. 2 లక్షల ఎకరాల్లో సాగు.. సంస్థానాధీశుల కాలం నుంచే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు సంతరించుకున్నది వనపర్తి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి పాలకుల కృషి ఫలితంగా కొత్త రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నిర్మాణం, పంట కాల్వల నిర్మాణాలను చేపట్టడంతో ప్రస్తుతం జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో మెట్ట, తరి పొలాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరిసాగు చేస్తారు. ప్రతి ఖరీఫ్‌లో సుమారు 70 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తూ రాష్ట్రంలోనే.. అత్యధికంగా వరిధాన్యం పండిస్తూ రికార్డు స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు లక్ష్యంకు మించి ధాన్యం విక్రయిస్తున్నారు. మా తాతముత్తాల నుంచే.. సప్తసముద్రాల్లో ఒకటైన శంకరసముద్రం మా గ్రామ సమీపంలో ఉండటం సంతోషంగా ఉంది. మా తాత, ముత్తాల కాలం నుంచి ఈ శంకరసముద్రం కింద మేం వ్యవసాయం చేస్తున్నాం. వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం ఈ చెరువు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి 2007లో పనులు ప్రారంభించారు. శంకరసముద్రంలో మా గ్రామం ముంపునకు గురైంది. ఏళ్లు గడుస్తున్న నేటికీ పనులు పూర్తి కాకపోవడంతో గ్రామస్తులందరం నిరాశతో ఉన్నాం. – బాలయ్య, రైతు, కానాయపల్లి సాగు, తాగునీరు అందిస్తోంది పెబ్బేరు శివారులో ఉన్న మహాభూపాల్ చెరువును రాజుల కాలంలో నిర్మించారు. ప్రతి సంవత్సరం ఈ చెరువు వర్షాలతోనే నిండదంలో పశువులకు, గ్రామ ప్రజలకు తాగునీరు, అవసరాలకు వాడుకోవడంతోపాటు చెరువు కింద రైతులు 2 వేల ఎకరాల్లో వరిసాగు చేసి నీళ్లను వాడుకుంటున్నారు. ఆ రోజుల్లో చెరువు చూడాల్సిన వారు రైతు కమిటీ సభ్యులను నీరేంటులుగా నియమించడంతో నీటి వృథా చేయకుండా వాడుకునేవారు. ప్రస్తుతం జూరాల కాల్వ చెరువు పక్కల ఆనుకొని పోవడంతో పుష్కలంగా నీళ్లు వచ్చాయి. దీంతో చెరువులను చూసుకునే దిక్కులేకుండా పోయింది. – బాల్‌రాం, రైతు, పెబ్బేరు -
‘హిందూ విలయంగా నామకరణం చేశాం’
కశ్మీర్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) సంచలన ప్రకటన చేసింది. భారత్‌లో తాము ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేశామంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. దానికి ‘హిందూ విలయం’గా పేరు పెట్టినట్లు ఐసిస్ పేర్కొంది. ఈ విషయాన్ని ఉగ్రవాద సంస్థకు చెందిన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కశ్మీర్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన తర్వాత ఐసిస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాక షోపియాన్ జిల్లాలోని అమ్షిపొరాలో తాము జరిపిన దాడిలో భారత ఆర్మీకి బాగానే ప్రాణ నష్టం జరిగిందని ఐసిస్ పేర్కొంది. ఐసిస్ చేసిన ప్రావిన్స్ ఏర్పాటు ప్రకటనను ఎస్ఐటీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కట్జ్ కొట్టిపారేశారు. ఈ సంస్థ ఇస్లామిక్ ఉగ్రవాదులను ట్రాక్ చేసే పనిలో ఉంటుంది. అసలు దాని ఉనికే లేని వేళ.. ఐసిస్ ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేసినట్టు చెప్పడం పూర్తిగా అసంబద్ధమని ఎస్ఐటీఈ పేర్కొంది. ఇక శుక్రవారం నాటి ఎన్కౌంటర్లో మృతి చెందిన సోఫి కశ్మీర్‌లోని పలు ఉగ్రవాద గ్రూపుల్లో దశాబ్దకాలంగా యాక్టివ్‌గా ఉన్నాడు. శ్రీనగర్ కేంద్రంగా నడిచే ఓ మేగజైన్‌కు సోఫి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐసిస్ సానుభూతిపరుడినని పేర్కొన్నట్టు మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. సోఫి ఈ ప్రాంతంలో భద్రతా దళాలపై జరిగిన పలు గ్రనేడ్ దాడుల్లో పాల్గొన్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. శుక్రవారం నాటి ఎన్కౌంటర్లో తమవైపు నుంచి ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదని అధికారి స్పష్టం చేశారు. కశ్మీర్లో మిగిలి ఉన్న ఐసిస్ సానుభూతి పరుడు అతడొక్కడేనని, తాజా ఎన్కౌంటర్లో అతడు కూడా హతమయ్యాడని అధికారులు తెలిపారు. -
మండల అభివృద్ధికి కృషిచేయాలి
దేవరకొండ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆదేశించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నందున వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంచినీటి కొరత ఏర్పడినా ప్రణాళికాబద్ధంగా మంచినీటి సమస్య పరిష్కారానికి కషి చేస్తామన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ డాక్టర్ దూదిపాల వేణుధర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులున్నారు. -
ర్యాట్ స్క్వాడ్!
డాగ్‌స్క్వాడ్ మాదిరిగా వాసన చూసి మందుపాతరలను కనిపెట్టే మూషికమిది. గురువారం కంబోడియాలోని సీమ్ ప్రావిన్స్‌లో మందుపాతరలు క్రియారహితంగా ఉన్న ఓ ప్రాంతంలో మూషికంతో కంబోడియన్ మైన్ యాక్షన్ సెంటర్ సిబ్బంది అన్వేషిస్తున్న దృశ్యమిది. బెల్జియంకు చెందిన ఓ సంస్థ ఈ గాంబియన్ ఎలుకల్ని కంబోడియా నుంచి టాంజానియా వర కూ అనేక చోట్ల మందుపాతరలు కనిపెట్టేందుకు రంగంలోకి దించింది.