
దక్షిణ కొరియాకి చెందిన మైనింగ్ కార్మికులు బొంగ్వాలోని జింక్ గని కూలిపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఈ మేరకు తొమ్మిది రోజుల పాటు అక్కడే ప్రాణాల కోసం పోరాడారు. అక్కడ గనుల నుంచి వస్తున్న నీరు, తమ వద్ద ఉన్న కాఫీ పౌడర్‌తో తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఆపన్న సాయం కోసం ధీనంగా ఎదురు చూశారు ఆ ఇద్దరు. ఈ క్రమంలో ఇద్దు వ్యక్తులు గనుల్లో చిక్కుకుపోయారంటూ దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కి లేఖలు రాశారు అధికారులు.
ఆ కార్మికులు సుమారు 190 మీటర్ల భూగర్భంలో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారుల చొరవతో ఆ వ్యక్తులను సురక్షితంగా బయటకు తీశారు. ఆ ఇద్దరు అక్టోబర్ 26న గని కూలిపోవడంతో భూగర్భంలో చిక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఒకరికి 62 ఏళ్లు మరొకరికి 56 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు కండరాల నొప్పితో భాదపడుతున్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియాలో సియోల్‌లో ఉన్న హాలోవిన్ గని ఇప్పటి వరకు 156 మందిని బలిగొందని అధికారులు చెబుతున్నారు.
(చదవండి: హిరోషిమా అణుబాంబు విషయమై పుతిన్ కీలక వ్యాఖ్యలు... షాక్‌లో ఫ్రాన్స్)
Comments
Please login to add a commentAdd a comment