mine collapse
-
9 రోజుల పాటు గనుల్లో చిక్కుకున్న కార్మికులు...కాఫీ ఫౌడర్, నీళ్లే ఆహారంగా...
దక్షిణ కొరియాకి చెందిన మైనింగ్ కార్మికులు బొంగ్వాలోని జింక్ గని కూలిపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఈ మేరకు తొమ్మిది రోజుల పాటు అక్కడే ప్రాణాల కోసం పోరాడారు. అక్కడ గనుల నుంచి వస్తున్న నీరు, తమ వద్ద ఉన్న కాఫీ పౌడర్‌తో తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఆపన్న సాయం కోసం ధీనంగా ఎదురు చూశారు ఆ ఇద్దరు. ఈ క్రమంలో ఇద్దు వ్యక్తులు గనుల్లో చిక్కుకుపోయారంటూ దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కి లేఖలు రాశారు అధికారులు. ఆ కార్మికులు సుమారు 190 మీటర్ల భూగర్భంలో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారుల చొరవతో ఆ వ్యక్తులను సురక్షితంగా బయటకు తీశారు. ఆ ఇద్దరు అక్టోబర్ 26న గని కూలిపోవడంతో భూగర్భంలో చిక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఒకరికి 62 ఏళ్లు మరొకరికి 56 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు కండరాల నొప్పితో భాదపడుతున్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియాలో సియోల్‌లో ఉన్న హాలోవిన్ గని ఇప్పటి వరకు 156 మందిని బలిగొందని అధికారులు చెబుతున్నారు. (చదవండి: హిరోషిమా అణుబాంబు విషయమై పుతిన్ కీలక వ్యాఖ్యలు... షాక్‌లో ఫ్రాన్స్) -
సింగరేణిలో ప్రమాదం.. బొగ్గు గని పైకప్పు కూలి 8 మంది గల్లంతు?
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని పైకప్పు కూలడంతో రాళ్ళ కింద ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో నలుగురిని సహాయక సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరో నలుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మీస వీరయ్య అనే కార్మికుడికి తీవ్ర గాయాలవ్వగా గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. చదవండి: అంగన్వాడీ ఆయా ప్రభుత్వ నౌకరా!.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన వృద్ధురాలు గాయపడిన మీస వీరయ్య -
జార్ఖండ్‌లో కూలిన బొగ్గు గని
11 మంది మృతి జార్ఖండ్: జార్ఖండ్‌లోని గోదా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లాల్మాటియా ప్రాంతంలోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) బొగ్గుగనిలో గురువారం రాత్రి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో 11 మంది మరణిం చారు. 60 మందికిపైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ధన్‌బాద్, పట్నాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాయి. గనుల్లో ఉన్న శిథిలాలను తొలగిస్తున్నాయి. క్షతగాత్రుల ను ఉర్జానగర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గని లోపల ఎంత మంది చిక్కుకున్నారు అనే దానిపై స్పష్టత రాలేదని కేంద్ర విద్యుత్, బొగ్గుగనుల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.ప్రమాద సమయంలో దాదాపు 10–12 యంత్రాలు గనిలో పనిచేస్తున్నాయని ఎస్పీ హిరాలాల్ చౌహాన్ తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సానుభూతిని తెలియ జేశారు. తాను జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్‌తో మాట్లాడినట్టు ట్విటర్లో పేర్కొన్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గోయల్ కృషి చేస్తున్నారన్నారు. మృతుల కుటుం బాల కు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 వేల చొప్పున పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారాన్ని ఈసీఎల్ ప్రకటించింది. -
గనిలో ఘోర ప్రమాదం...చిక్కుకున్నకార్మికులు