
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్‌జీ-3 పరిధిలోని ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని పైకప్పు కూలడంతో రాళ్ళ కింద ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో నలుగురిని సహాయక సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరో నలుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మీస వీరయ్య అనే కార్మికుడికి తీవ్ర గాయాలవ్వగా గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు.
చదవండి: అంగన్‌వాడీ ఆయా ప్రభుత్వ నౌకరా!.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన వృద్ధురాలు
గాయపడిన మీస వీరయ్య