
పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు జైలుకే !
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు ఊచలు
ఇద్దరినీ కేసుల్లో బుక్ చేస్తాం : ఏసీపీ హితేంద్ర హెచ్చరిక
బెంగళూరు (బనశంకరి) : మైనర్లు తాగి వాహనాలు నడిపినా... ప్రమాదాలకు పాల్పడినా వారి తల్లిదండ్రులు జైలుకు వెళ్లడం ఖాయమని నగర ఏసీపీ హితేంద్ర హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అత్యధికంగా మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతుండటంతో వాటి నివారణకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. మైనర్లు తెలిసీ తెలియని వయసులో మద్యం తాగి వాహనాలను వేగంగా నడుపుతూ అమాయలకును బలి తీసుకుంటున్నారని, మైనర్లు తాగి వాహనాలు న డిపితే శిక్ష ఏకంగా వారి తల్లిదండ్రులకు తప్పదని హెచ్చరించారు. ఇద్దరినీ కేసులో బుక్ చేస్తామని హితేంద్ర అన్నారు. మైనర్ల చేతికి వాహనాలు ఇచ్చే ముందు జాగ్రత వహించాలన్నారు.
గతంలో మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లెసైన్స్‌ను ఆరు నెలలు లేదా పూర్తి స్థాయిలో రద్దు చే సేవారన్నారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదన్నారు. లెసైన్స్ ఇంటిలో మరిచిపోయాను అని చెప్పే వారికి కూడా శిక్ష తప్పదు’ అని అన్నారు. నగర పోలీసులు అర్ధరాత్రి వేళ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నా కేవలం మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాతో సరిపెడుతున్నారన్నారు. గత నెలలో 4 వేల లెసైన్స్‌లు స్వాధీనం చేసుకున్నామని, వాటి రద్దుకు సిఫార్సు చేశామన్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదన్నారు. దీంతో కఠిన చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ్త