
సాక్షి, చెన్నై: ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు.. కొంతకాలం చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇద్దరి వ్యవహారం ఇంట్లో తెలిసింది. అయితే వారివురు అన్నాచెల్లెలు అవడంతో పెద్దలు తీవ్రంగా మందలించారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుచ్చి జీయపురం, కీళ కారియపట్టికి చెందిన అశోక్ కుమార్ కుమార్ ప్రవీణ్(17) ప్లస్ టూ చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమించాడు. వీరిద్దరూ ఒకే కులానికి చెందిన వారు.. పైగా వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు.
అయితే వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరిని మందలించారు. దీంతో మనస్థానం చెందిన ఇద్దరు బుధవారం మామూలుగానే స్కూలుకు వెళ్లారు. అక్కడ నుంచి తిరుచ్చి రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదని, చనిపోయి ప్రేమను కాపాడుకుంటామని వారు నోట్‌లో రాసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment