డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా వద్ద సొరంగంలో గత నెలలో 17 రోజుల పాటు చిక్కుబడిపోయిన 41 మంది కార్మికు లను రక్షించడంలో కీలకమైన 12 మంది ర్యాట్–హోల్’ గని కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ‘‘అన్ని రకాల యంత్రాలు విఫలమైన వేళ.. మేం ఎలాంటి షరతులు పెట్టకుండా ప్రాణాలనొడ్డి మార్గం తయారు చేశాం.
సొరంగం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా వెలుపలికి తెచ్చాం. ఇందుకుగాను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేవలం రూ.50 వేల చొప్పున చెక్కులిచ్చింది. మాకీ ప్రతిఫలం సరిపోదని చెప్పాం. అధికారుల నుంచి, ఇప్పటికీ జవాబులేదు. ఈ చెక్కులు మాకొద్దు. మేమందరం వాపసు చేస్తాం’’ అని మైనర్లలో ఒకరైన వకీల్ హసన్ పీటీఐకి తెలిపాడు. ప్రభుత్వం తమకు శాశ్వత ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment