అమెరికాలో ఫ్లూతో 15 వేలమంది మృతి! | US records nearly 15000 deaths due to flu | Sakshi
Sakshi News home page

America: అమెరికాలో ఫ్లూతో 15 వేలమంది మృతి!

Published Tue, Feb 13 2024 1:02 PM | Last Updated on Tue, Feb 13 2024 3:34 PM

Nearly 15 Thousand Deaths due to Flu in America - Sakshi

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గల సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, ఈ సీజన్‌లో ఇప్పటివరకు అమెరికాలో సుమారు రెండు లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు 15 వేల మరణాలు సంభవించాయి.

ఫిబ్రవరిలో ఇన్‌ఫ్లుయెంజా బారినపడిన చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో మొత్తం 74 మంది చిన్నారులు ఇన్‌ఫ్లుయెంజాతో ఆసుపత్రిలో చేరారు. గడిచిన వారంలో 11 వేలకు పైగా భాధితులు ఆసుపత్రిలో చేరినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇన్‌ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆరు నెలలలోపు చిన్నారులకు వార్షిక ఫ్లూ వ్యాక్సిన్‌ వేయించాలని అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement