Latha Rajanekanth
-
ఆమె ప్రేమే నన్ను మార్చింది!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఏ వేడుకలో పాల్గొన్నా సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడతారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడిన దాఖలాలు దాదాపు లేవు. అలాంటిది ఇటీవల తన వ్యక్తిగత అలవాట్ల గురించి, తన భార్య లత కారణంగా తాను మారిన విషయం గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘నేను బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో మద్యం సేవించేవాడిని. ధూమపానం బాగా అలవాటు. మాంసాహారం కూడా కాస్త ఎక్కువగానే తీసుకునేవాడిని. మద్యం–మాంసాహారం–సిగరెట్.. ఈ మూడూ మంచి కాంబినేషన్. అయితే ఈ చెడు అలవాట్లు ఉంటే 60 ఏళ్లకు పైన బతకరు. ఈ అలవాట్లు ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని, కొంతకాలం తర్వాత ఇవి మన అనారోగ్యానికి కారణమవుతాయని అనిపించింది. నా భార్య లత వల్లే నా చెడు అలవాట్లకు నేను దూరం కాగలిగాను. ఆమె తన ప్రేమతో నన్ను మార్చింది. లత ప్రేమ వల్లే ఇప్పుడు వీటికి దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాను. 73ఏళ్లలోనూ నేనింత ఆరోగ్యంగా ఉండటానికి కారణం తనే. అందుకే నా భార్య లతకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్ (లత బావ, నటుడు, రచయిత వైజీ మహేంద్రన్‌ని ఉద్దేశించి)కూ రుణపడి ఉంటాను’’ అని చెప్పుకొచ్చారు రజనీకాంత్. వైజీ మహేంద్రన్ రూ΄÷ందించిన ‘చారుకేశి’ నాటికకు సంబంధించిన వేడుకలో పాల్గొన్న రజనీ తన అలవాట్ల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
అప్పా.. అమ్మా.. శుభాకాంక్షలు
‘‘ఆమె అందర్నీ తన కుటుంబంలా భావించింది. ఆయన ఆమె కుటుంబాన్ని తన కుటుంబం అనుకున్నాడు. ఇద్దరూ కలసి ఒక మంచి కుటుంబం ఏర్పడటానికి కారణం అయ్యారు’’ అని తన తల్లిదండ్రులు రజనీకాంత్, లత గురించి ఐశ్వర్య అన్నారు. ఫిబ్రవరి 28 రజనీ–లత నలభయ్యో వివాహ వార్షికోత్సవం. 1981లో ఈ ఇద్దరి పెళ్లి జరిగింది. నలభయ్యో వార్షికోత్సవం సందర్భంగా రజనీ–లతల పెద్ద కుమార్తె ఐశ్వర్యా ధనుష్ ఇన్ స్టాగ్రామ్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘ఒక విజయవంతమైన వైవాహిక జీవితానికి గల కారణాలను మా అమ్మానాన్న జీవితాలను చూసి తెలుసుకున్నాను. జీవితం అనే ప్రతి మలుపులోనూ మా గ్రాండ్ పేరెంట్స్ దేవదూతల్లా ఈ ఇద్దర్నీ కాపాడుకుంటూ వస్తున్నారని నా నామ్మకం. మ్యారేజ్ అంటే ఒకరి బాధ్యతను ఒకరు మోయడం అనే విషయాన్ని అమ్మానాన్నని చూసి తెలుసుకున్నాను. ఒక బంధం బలపడటానికి భార్యాభర్త మధ్య ఉండే స్నేహం కారణమవుతుందనే విషయం అర్థమైంది. వ్యక్తులుగా ఎదిగే ప్రతి దశలోనూ జీవితం తాలూకు ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ, జీవితానికి అర్థం తెలుసుకుంటూ ఉంటాం’’ అంటూ అప్పా (నాన్న).. అమ్మా... మీ ఇద్దరికీ సూపర్ డూపర్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’’ అన్నారు ఐశ్వర్య. -
బ్యాక్ టు హోమ్
రజనీకాంత్ సూపర్ స్టార్. అందరి కళ్లూ ఆయన మీదే ఉంటాయి. అందుకే ఆయన సతీమణి లత ‘ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి’ అంటూ దిష్టి తీసి, ఇంటి లోపలికి ఆహ్వానించారు. ఇటీవల జస్ట్ మెడికల్ చెకప్ కోసం యూఎస్ వెళ్లిన రజనీకాంత్ తిరిగి ఇంటికొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు దిష్టి తీశారు లత. ఈ సంగతి ఇలా ఉంచి సినిమాలను టచ్ చేస్తే... ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ధనుష్ నిర్మించిన ‘కాలా’ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఈ నెల 9న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకను వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించనున్న సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. -
ఇతరులపై బురద చల్లొద్దు!
దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ టవర్స్ దగ్గర బుర్జ్ పార్క్ ప్రాంగణమంతా శుక్రవారం రాత్రి ఐదు నిమిషాల పాటు ప్రేక్షకుల ఈలలు, చప్పట్లతో మార్మోగింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన రోబోటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘2.0’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోందక్కడ. సుమారు పన్నెండు వేలమంది వీక్షకుల్లో కొందరికి రజనీకాంత్ ఏం చెప్పారో అర్థం కాలేదు. కాసేపటి తర్వాత పక్కవాళ్లను అడిగితే... జరిగిన సంగతి వివరించారు. మేటర్ ఏంటంటే... ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’– సూపర్‌స్టార్ తెలుగులో డైలాగ్ చెప్పారు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘2.0’ పాటల్ని శుక్రవారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ మొత్తం మూడు పాటలకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే.. మూడింటిలో సినిమాలో ఒక్కటే ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ... మూడు భాషల పాటల్నీ ఇదే కార్యక్రమంలో విడుదల చేశారు. తెలుగు ఆడియోకి హీరో రానా, తమిళ్‌కి ఆర్.జె. బాలాజీ, హిందీకి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకలో మిగతా ఇద్దరూ రజనీని ప్రశ్నలు అడగ్గా... ‘నేను ప్రశ్నలు అడిగేంతవాణ్ణి కాదు సార్. తెలుగువాళ్ల కోసం తెలుగులో ఒక్క డైలాగ్ చెప్పండి. మీరు ఏ డైలాగ్ చెప్పినా అందంగానే ఉంటుంది’ అని రానా కోరారు. అప్పుడు ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ డైలాగ్ చెప్పారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘భగవంతుడి కృప–కరుణ, ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే ఇన్నేళ్లు నటుడిగా కొనసాగాను. కెరీర్ స్టార్టింగ్‌లో డబ్బు, పేరు, ప్రఖ్యాతులు సంతోషాన్నిస్తాయి. ఓ స్థాయికి వచ్చిన తర్వాత అవేవీ సంతోషాన్ని ఇవ్వవు. కానీ, వాటిని కావాలనుకుంటాం. అవి లేకుంటే దురదృష్టంగా భావిస్తాం. ఇలాంటివి తలచుకుంటే నవ్వొస్తుంది. ఇక, నా అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే... ఎవరి సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా, సోషల్ మీడియాలో ఆ సినిమాపై చెడు ప్రచారం చేయొద్దు. ఇతరులపై బురద చల్లొద్దు. ఇతరులపై బ్యాడ్ పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాను ఉపయోగించవద్దు. నేటి యువతరం మన సంస్కృతి, సంప్రదాయాలను ఆస్వాదించాలి. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాలను మరువడం విచారకరం’’ అన్నారు. ‘2.0’లో విలన్‌గా నటించిన హిందీ హీరో అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో ఇతరుల ప్రతిభను గౌరవిస్తూ, అందరితో కలసి సమిష్టిగా వర్క్ చేస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. నేనెప్పుడూ ఇటువంటి గొప్ప, పెద్ద సినిమాలో నటించే చాన్స్ వస్తుందని ఊహించలేదు. రజనీతో నటించే ఈ చాన్స్ ఇచ్చిన శంకర్ సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ– ‘‘డిల్లీలో 40 డిగ్రీల టెంపరేచర్లో 12 కిలోల సూట్ వేసుకుని రజనీ సార్ ఎంతో ఉత్సాహంగా నటించారు. అలాగే, ఓ సీన్ కోసం నాలుగు గంటలు భూమిలో పూడ్చిన బాక్సులో ఉన్నారు. ఆయన ఎనర్జీ మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమా కోసం ఆయన పడిన శ్రమ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ఆయనెప్పుడూ ప్రయోగాలకు సిద్ధమే’’ అన్నారు.‘‘నా భర్తను చూస్తుంటే గర్వంగా ఉంది. ‘2.0’ కోసం ఆయన పడిన కష్టానికీ, చూపించిన అంకితభావానికీ సెల్యూట్’’ అన్నారు రజనీ సతీమణి లత. ఈ వేడుకలో ‘2.0’ హీరోయిన్ అమీ జాక్సన్, తెలుగు నిర్మాత డి. సురేశ్‌బాబు, రజనీ కుటుంబ సభ్యులు ధనుష్, ఐశ్వర్య, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. -
లింగాను పట్టుకున్న కొచ్చాడియన్
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ లింగ వివాదానికి ముగింపు ఇలా పలికాడో లేదో అలా మరో వివాదం చుట్టుముట్టింది. ఎడి బ్యూరో కంపెనీ రజనీకాంత్ భార్య లత రజనీకాంత్ తమను మోసం చేశారని ఆరోపిస్తోంది. కొచ్చాడియన్ విడుదలకు ఇబ్బందుల్లో ఉన్నపుడు తాము ఆదుకున్నామని సంస్థ అధినేత అభిర్ చంద్ నహార్ చెబుతున్నారు. లతా రజనీకాంత్ హామీ ఇచ్చిన మీదటనే కొచ్చాడియన్ నిర్మాణ సంస్థ మీడియావన్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్‌కు పదికోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చామంటున్నారు. అంతేకాదు కొచ్చాడియన్ సినిమా తమిళనాడు హక్కులను తనకు తెలియకుండా రెట్టింపు రేటుకు అమ్ముకున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. రజనీకాంత్ కల్పించుకొని తనకు న్యాయం చేయాలని నహర్ కోరుతున్నారు. అయితే మీడియావన్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ ముఖ్య అధికారి జయకుమార్ ఈ ఆరోపణలను ఖండించారు. ఫైనాన్స్ చేసిన మొత్తంలో ఇప్పటికే తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించామనీ, అభిర్ చంద్ అధిక వడ్డీ డిమాండ్ చేస్తున్నాడని.. ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామనీ అన్నారు. పైగా వారికి సంబంధం లేని డిస్ట్రిబ్యూషన్ హక్కులను అడగడం విడ్డరంగా ఉందన్నారు.