కొచ్చడయాన్ వాయిదా ఎందుకు? | Why was Rajinikanth's Kochadaiyaan postponed! | Sakshi
Sakshi News home page

కొచ్చడయాన్ వాయిదా ఎందుకు?

May 9 2014 9:40 AM | Updated on Sep 2 2017 7:08 AM

కొచ్చడయాన్ వాయిదా ఎందుకు?

కొచ్చడయాన్ వాయిదా ఎందుకు?

కొచ్చడయాన్ చిత్రం విడుదల వాయిదా పడటానికి కారణాలేమిటన్న ప్రశ్నకు పలు అంశాలు వ్యక్తం అవుతున్నాయి.

కొచ్చడయాన్ చిత్రం విడుదల వాయిదా పడటానికి కారణాలేమిటన్న ప్రశ్నకు పలు అంశాలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం కొచ్చడయాన్. ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపిక పదుకునే హీరోయిన్‌గా నటించారు. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం పలు విశేషాల నెలవు అని పేర్కొనవచ్చు.

ఈ చిత్రాన్ని అవతార్, టిన్‌టిన్ వంటి హాలీవుడ్ చిత్రాల తరహాలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్‌లో రూపొందించాలని దర్శకురాలు సౌందర్య భావించారు.  టీవీలో వచ్చే కార్టూన్ చిత్రాల మాదిరిగా కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలనుకున్నారు. అయితే ఆమె ఊహించినట్లుగా ఇదంతా అంత సులభంగా జరగలేదు. చిత్ర బడ్జెట్ తడిసి మోపెడవడంతో చిత్రానికి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మోషన్ క్యాప్చరింగ్‌ను ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోదారి లేకపోవడంతో అలానే చిత్రాన్ని పూర్తి చేశారు.

ఇలాంటి పరిస్థితిలో మరో సమస్య వచ్చి పడింది. ఈ చిత్ర నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు పాత బాకీ చెల్లించాల్సి ఉంది. అది సెటిల్ చేస్తేనే కొచ్చడయాన్ చిత్రాన్ని విడుదల చేస్తామని పట్టుపట్టారు. ఈ సమస్య చర్చల ద్వారా ఒక కొలిక్కి రావడంతో చిత్రాన్ని తొమ్మిదో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది.

అలాంటి పరిస్థితిలో అనూహ్యంగా కొచ్చడయాన్ చిత్ర విడుదలకు వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీనికి కారణం నిర్మాతల రుణ సమస్య పరిష్కారం కాకపోవడమేనని కోలీవుడ్ టాక్.  మరోవైపు ఈ చిత్రాన్ని మే 23వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement