చెన్నైలో కొచ్చడయాన్ ఫీవర్, 13 వేల టికెట్లు అమ్మకం!
చెన్నైలో కొచ్చడయాన్ ఫీవర్, 13 వేల టికెట్లు అమ్మకం!
Published Wed, May 7 2014 3:31 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM
చెన్నై: చెన్నై నగరానికి 'కొచ్చడయాన్' ఫీవర్ పట్టుకుంది. తమిళనాడులో ఈ చిత్రం విజయవంతం కావాలని అభిమానులు ఆలయాలను దర్శించుకోవడంతోపాటు, భారీ కటౌట్లతో చైన్నైని హోరెత్తిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కొచ్చడయాన్' విడుదలకు ముందు కార్యక్రమాలు పెళ్లి వేడుకలను తలపిస్తున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికే మల్టిప్లెక్స్ లో 13 వేల టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి.
భారత దేశంలో తొలి ఫోటో రియలిస్టిక్ 3D యానిమేటెడ్ మోషన్ కాప్చర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తమిళనాడులో మొత్తం 477 థియేటర్లలో విడుదలవుతుండగా, పది దేశాల్లో 6 వేల స్క్రీన్లలో ప్రదర్శనకు సిద్దమవుతోంది. అమెరికాలో 185 స్క్రీన్లలో విడుదలవుతోంది అని చిత్ర నిర్వహకులు తెలిపారు.
ఈ చిత్రాన్ని చూడటానికి రజనీకాంత్ అభిమానులు చెన్నై నుంచి పక్క గ్రామాలకు తరలివెళ్లినట్టు సమాచారం. ఇప్పటికే అభిమానులు తొలి ఆటను చూడటానికి టిక్కెట్లను కొనుగోలు చేసి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వారాంతానికి టికెట్లన్ని అమ్మకం జరిగాయని మల్టిప్లెక్స్ యాజమాన్యం తెలిపారు.
దీపికా పదుకోనె, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, ఆది పినిశెట్టి, నాజర్, శోభన తదితరులు నటించిన ఈ చితం మే 9 తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement