బిటీష్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు కోచ్చడయూన్
కోచ్చడయాన్ చిత్రం బ్రిటీష్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో, త్రీడీ ఫార్మెట్‌లో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడయాన్, రాణా, సేనాలుగా త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి ఆయన రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే వెండి తెరపై అద్భుతాలు సృష్టించిన ఆమె దర్శక నైపుణ్యానికి చిత్ర ప్రముఖులు అభినందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించిన తొలి తమిళ చిత్రం ఇది.
ప్రపంచ వ్యాప్తంగా ఆరు (తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబ్, బోజ్‌పురి)భాషల్లో నాలుగు వేల థియేటర్లలో 3డి, 2డి ఫార్మెట్‌లలో ఇటీవల విడుదలయిన కోచ్చడయూన్ విశేష ఆదరణను పొందుతోంది. ముఖ్యంగా 3డి ఫార్మెట్‌లో చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. కోచ్చడయాన్ చిత్రాన్ని యూఎస్ తొలి ప్రముఖ హాలీవుడ్ స్టూడియో స్పెషల్ ఎఫెక్ట్ నిపుణులు ఇది ఇండియాలో రూపొందిన చిత్రమా? అంటూ ఆశ్చర్యపోతున్నారని నిర్మాతలు పేర్కొన్నారు. కోచ్చడయాన్ చిత్రం దక్షిణాదిలో మూడవ వారంలో కూడా 350 థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అలాగే చిత్రాన్ని ఈ నెలాఖరున బ్రిటీష్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ప్రదర్శించడానికి ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే కోచ్చడయాన్‌ను జపాన్‌లో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.