'కొచ్చడయాన్' విడుదల 23కు వాయిదా
చెన్నై: రజనీకాంత్ సినిమా 'కొచ్చడయాన్' విడుదల రెండు వారాల పాటు వాయిదా పడింది. ఈనెల 23న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సాంకేతిక కారణాలతో సినిమా విడుదల వాయిదా వేసినట్టు నిర్మాతలు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ఈనెల 9న 'కొచ్చడయాన్' ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. అయతే చెన్నైలో ఇప్పటికే మల్టిప్లెక్స్ ధియేటర్లలో 13 వేల టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ ఈ సినిమాను నిర్మించింది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. భారత దేశంలో తొలి ఫోటో రియలిస్టిక్ 3D యానిమేటెడ్ మోషన్ కాప్చర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఫీవర్ పట్టుకుంది. తమిళనాడులో ఈ చిత్రం విజయవంతం కావాలని అభిమానులు ఆలయాలను దర్శించుకోవడంతోపాటు, భారీ కటౌట్లతో చైన్నైని హోరెత్తిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కొచ్చడయాన్' విడుదలకు ముందు కార్యక్రమాలు పెళ్లి వేడుకలను తలపిస్తున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికే మల్టిప్లెక్స్ లో 13 వేల టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి.