British film
-
సెక్స్ క్రైమ్స్.. జైల్లోనే ప్రాణాలు వదిలాడు
సాక్షి, సినిమా : హాలీవుడ్లో ఇప్పుడు లైంగిక ఆరోపణల పర్వాల పరంపర కొనసాగుతోంది. వెయిన్స్టన్ హార్వే వ్యవహారంతో మొదలైనప్పటికీ.. అంతకు ముందు కూడా ఇలాంటి ఉదంతాలు చాలానే బయటపడ్డాయి. పబ్లిసిస్ట్ మాక్స్ క్లిఫోర్డ్ అయితే ఏకంగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. బడా బడా స్టార్లకు పబ్లిసిస్ట్గా వ్యవహరించిన మాక్స్ లైంగిక వేధింపుల ఉదంతం బ్రిటీష్ చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపింది. 40 ఏళ్ల క్రితం ఆయన పలువురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఛాన్సుల పేరిట వారిని లొంగదీసుకున్నాడని.. అందులో పలువురు అగ్రశ్రేణి నటీమణులు కూడా ఉన్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఆపరేషన్ యూట్రీ పేరిట ఈ కేసు విచారణ కొనసాగింది. సుమారు 10 ఏళ్లపాటు కొనసాగిన దర్యాప్తులో పలువురు స్టార్లను విచారించిన పోలీసులు కోర్టుకు నివేదికను సమర్పించారు. తర్వాత కోర్టుకు ఆ నివేదికను పోలీసులు సమర్పించారు. చివరకు వాదనలు విన్న కోర్టు 2014లో ఆయనకు 8 ఏళ్ల జైలు శిక్ష విధించారు. తాను నిర్దోషినని.. ఆ ఆరోపణలు కల్పితాలని ఆయన చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. దీంతో ఆయన లిట్టలెహే జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. శుక్రవారం ఆయన ఓసారి కళ్లు తిరిగి పడిపోయారని.. తిరిగి ఆదివారం కూడా అలాగే పడిపోగా ఆస్పత్రికి తరలిస్తుండగా.. చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యలో గుండెపోటుతో మరణించారని ఆయన కుమార్తె వెల్లడించారు. -
బిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్కు కోచ్చడయూన్
కోచ్చడయాన్ చిత్రం బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో, త్రీడీ ఫార్మెట్లో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడయాన్, రాణా, సేనాలుగా త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి ఆయన రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే వెండి తెరపై అద్భుతాలు సృష్టించిన ఆమె దర్శక నైపుణ్యానికి చిత్ర ప్రముఖులు అభినందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటించిన తొలి తమిళ చిత్రం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఆరు (తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబ్, బోజ్పురి)భాషల్లో నాలుగు వేల థియేటర్లలో 3డి, 2డి ఫార్మెట్లలో ఇటీవల విడుదలయిన కోచ్చడయూన్ విశేష ఆదరణను పొందుతోంది. ముఖ్యంగా 3డి ఫార్మెట్లో చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. కోచ్చడయాన్ చిత్రాన్ని యూఎస్ తొలి ప్రముఖ హాలీవుడ్ స్టూడియో స్పెషల్ ఎఫెక్ట్ నిపుణులు ఇది ఇండియాలో రూపొందిన చిత్రమా? అంటూ ఆశ్చర్యపోతున్నారని నిర్మాతలు పేర్కొన్నారు. కోచ్చడయాన్ చిత్రం దక్షిణాదిలో మూడవ వారంలో కూడా 350 థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అలాగే చిత్రాన్ని ఈ నెలాఖరున బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ప్రదర్శించడానికి ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే కోచ్చడయాన్ను జపాన్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.