సెక్స్ క్రైమ్స్‌.. జైల్లోనే ప్రాణాలు వదిలాడు | British Publicist Max Clifford dies during sex crimes sentence | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 11 2017 11:49 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

British Publicist Max Clifford dies during sex crimes sentence - Sakshi

సాక్షి, సినిమా : హాలీవుడ్‌లో ఇప్పుడు లైంగిక ఆరోపణల పర్వాల పరంపర కొనసాగుతోంది. వెయిన్‌స్టన్‌ హార్వే వ్యవహారంతో మొదలైనప్పటికీ.. అంతకు ముందు కూడా ఇలాంటి ఉదంతాలు చాలానే బయటపడ్డాయి. పబ్లిసిస్ట్‌ మాక్స్‌ క్లిఫోర్డ్‌ అయితే ఏకంగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 

బడా బడా స్టార్లకు పబ్లిసిస్ట్‌గా వ్యవహరించిన మాక్స్‌ లైంగిక వేధింపుల ఉదంతం బ్రిటీష్‌ చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపింది.  40 ఏళ్ల క్రితం ఆయన పలువురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు. ఛాన్సుల పేరిట వారిని లొంగదీసుకున్నాడని.. అందులో పలువురు అగ్రశ్రేణి నటీమణులు కూడా ఉన్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఆపరేషన్‌ యూట్రీ పేరిట ఈ కేసు విచారణ కొనసాగింది. సుమారు 10 ఏళ్లపాటు కొనసాగిన దర్యాప్తులో పలువురు స్టార్లను విచారించిన పోలీసులు కోర్టుకు నివేదికను సమర్పించారు.  తర్వాత కోర్టుకు ఆ నివేదికను పోలీసులు సమర్పించారు. 

చివరకు వాదనలు విన్న కోర్టు 2014లో ఆయనకు 8 ఏళ్ల జైలు శిక్ష విధించారు. తాను నిర్దోషినని.. ఆ ఆరోపణలు కల్పితాలని ఆయన చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు.  దీంతో ఆయన లిట్టలెహే జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. శుక్రవారం ఆయన ఓసారి కళ్లు తిరిగి పడిపోయారని.. తిరిగి ఆదివారం కూడా అలాగే పడిపోగా ఆస్పత్రికి తరలిస్తుండగా.. చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యలో గుండెపోటుతో మరణించారని ఆయన కుమార్తె వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement