'కొచ్చడయాన్ నా కెరీర్ లోనే మైలురాయి' | Fashion designer Neeta Lulla conceptualised Rajnikanth's look for 'Kochadaiiyaan' | Sakshi
Sakshi News home page

'కొచ్చడయాన్ నా కెరీర్ లోనే మైలురాయి'

Published Tue, Sep 17 2013 4:52 PM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

'కొచ్చడయాన్ నా కెరీర్ లోనే మైలురాయి'

'కొచ్చడయాన్ నా కెరీర్ లోనే మైలురాయి'

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొచ్చడయాన్ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్ రూపొందిస్తున్నారు. భారత దేశంలోనే తొలిసారిగా ఫోటో రియలిస్టిక్ ఫెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజిని ఈ చిత్రం కోసం వాడుకుంటున్నారు. అయితే కొచ్చడయాన్ చిత్రంలో రజనీకాంత్ లుక్ ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లూలా రూపొందించారు. 
 
ఆయుధాలు ధరించిన రజనీ లుక్ అభిమానులపై అత్యంత ప్రభావం చూపడమే కాకుండా.. గొప్ప అంచనాలను కూడా పెంచింది. అభిమానుల్లో గొప్ప అంచనాల్ని పెంచడం రజనీ లుక్ వెనుక నీతా ఎనలేని కృషి జరిపిందని చిత్ర యూనిట్ సభ్యుల అభిప్రాయం. రజనీ ధరించిన క్యాస్టూమ్స్, ఆయుధాలకు విశేష ప్రాచుర్యం లభించింది. 
 
ఇటీవల నీతా ఓ ఇంటర్య్యూలో 'కొచ్చడయాన్ కు పనిచేయడం గొప్ప అవకాశం. అంతేకాక తన కెరీర్ లో కొచ్చడయాన్ ఓ మైలురాయిగా నిలుస్తుంది. పోటో రియలిస్టిక్ మోషన్ టెక్నాలజీతో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది' అని నీతా లూలా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement