Neeta Lulla
-
క్వీన్ ఐశ్వర్య ‘ఐకానిక్ లెహంగా' ఆస్కార్ మ్యూజియానికి
అద్భుతమైన ఒక డిజైనర్ లెహంగా మరో అద్భుతాన్ని సాధించడం ఎక్కడైనా విన్నారా? నీతా లుల్లా రూపొందించిన లెహంగా అలాంటి ప్రత్యేకతను సంతరించుకుంది. బాలీవుడ్ జోధా అక్బర్ మూవీలో, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai) పాత్ర కోసం నీతా లుల్లా డిజైన్ చేశారు. దీన్ని ఇపుడు ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా చూడగలిగేలా ప్రతిష్టాత్మక ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరింది. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) అకాడమీ మ్యూజియం కలర్ ఇన్ మోషన్ ఎగ్జిబిషన్లో సినిమాలో క్వీన్ ఐశ్వర్య ధరించిన దుస్తులే కాకుండా ఆమె ఆభరణాలు కూడా బొమ్మపై రూపొందించారు. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది.దీంతో ఈ లెహెంగాను రూపొందించిన నీతా లుల్లా నైపుణ్యం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.A lehenga fit for a queen, designed for the silver screen.In JODHA AKBAR (2008), Aishwarya Rai Bachchan’s red wedding lehenga is a feast for the eyes: vibrant zardozi embroidery, centuries-old craftsmanship, and a hidden gem—quite literally. Look closely and you’ll spot a… pic.twitter.com/UfUYxTeP22— The Academy (@TheAcademy) December 24, 2024 > ఐకానిక్ రెడ్ లెహెంగా,నగల విశేషాలివేజర్దోజీ ఎంబ్రాయిడరీ , శతాబ్దాల నాటి హస్తకళా నైపుణ్యం ఈ లెహెంగాలో దాగి ఉంది. ఇదే విషయాన్ని అకాడమీ తన పోస్ట్‌లో పేర్కొంటూ, ప్రశంసింయింది. నటి ధరించిన ఆభరణాలు మరింత ఆకర్షణగా ఉన్నాయి. ఆమె ధరించిన నెక్లెస్ మధ్యలో నీలం రాళ్లతో భారతదేశ జాతీయ పక్షి నెమలి మరో ఎట్రాక్షన్.జోధా అక్బర్ (Jodha Akbar) "రాణికి సరిపోయే లెహంగా, వెండితెరపై ఎంతోమందిని ఆకర్షించింది ఇకపై ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరనుంది అని అకాడమీ తెలిపింది. కాగా 2008లో అశుతోష్ గోవార్కర్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘జోధా అక్బర్’. ఐశ్వర్య 'జోధా బాయి' పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరోగా హృతిక్ రోషన్ నటించారు. వీరి రాయల్ లుక్‌కోసం రాజస్తానీ, మొఘల సంస్కృతుల మేళవింపుతో అసలు సిసలు బంగారం, విలువైన రాళ్లతో మొత్తం 400 కిలోల ఆభరణాలను తయారు చేయించారన. ఇందులో 200 కిలోల ఐశ్వర్య ప్రాతకోసం. ఈ మొత్తం ఆభరణాల తయారీకి 70 మంది కళాకారులు రెండేళ్ల పాటు శ్రమించారని చెబుతారు. -
నో డూప్.. ఆల్ రియల్!
చారిత్రక అంశాలతో సినిమాల రూపకల్పన కత్తిమీద సామే. ప్రతి సన్నివేశం ఆ కాలాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. అది మాత్రమే కాదు, నటీనటుల వేషధారణ కూడా అప్పటిలా ఉండాలి. చారిత్రాత్మక కథతో రూపొందుతున్న బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతక ర్ణి’ కోసం దర్శకుడు క్రిష్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేస్తుంటడం విశేషం. కాస్ట్యూమ్స్ తయారీ కోసం శాతవాహనుల కాలం నాటి వే షధారణను నీతా లుల్లా అధ్యయనం చేశారు. అప్పటి సంస్కృతిని అనుసరిస్తూనే రాజసం ఉట్టిపడేలా దుస్తులను డిజైన్ చేస్తున్నారు. నీతా లుల్లా మాట్లాడుతూ - ‘‘చాలా పరిశోధన తర్వాత ప్రతి క్యారెక్టర్‌కు తగిన దుస్తులు సిద్ధం చేస్తున్నాం. రాజుల నుంచి యుద్ధ వీరుల వరకు అందరి దుస్తులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా’’ అన్నారు. ‘దేవదాసు’, ‘జోథా అక్బర్’ వంటి హిందీ చిత్రాలతో పాటు తెలుగు చిత్రం ‘రుద్రమదేవి’కి నీతా లుల్లా అద్భుతమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో బాలకృష్ణ, కబీర్ బేడీ తదితరులు పాల్గొంటున్నారు. డూప్ లేకుండా బాలకృష్ణ క్లైమాక్స్ పోరాటాలు చేయడం యూనిట్‌కు ఉత్సాహాన్నిస్తోంది. ఈ నెల 20 వరకూ అక్కడ చిత్రీకరణ జరుగుతుంది. -
వరుణ్-త్రిష నిశ్చితార్థం
-
సన్నిహితుల సమక్షంలో వరుణ్-త్రిష నిశ్చితార్థం
చెన్నె: దక్షిణాది నటి త్రిష నిశ్చితార్థం యువ నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ తో శుక్రవారం జరిగింది. వరుణ్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులు, చిత్రపరిశ్రమకు చెందిన సన్నిహితులు హాజరయ్యారు. కాబోయే భార్యకు వరుణ్ ఈ సందర్భంగా విలువైన కానుకలు ఇచ్చినట్టు సమాచారం. ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేసిన ప్రత్యేక చీరలో త్రిష మెరిసింది. ఎన్ ఏసీ జ్యూయెలర్స్ ఆభరణాలు ధరించింది. వరుణ్ తెలుపు రంగు దోతి ధరించాడు. వివాహ తేదీ ఇంకా నిర్ణయించలేదు. కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలో దంపతులు కాబోతున్నారు. త్రిష నటించిన 'ఎన్నై అరిందాల్' తమిళ చిత్రం ఈ నెల 29న విడుదలకానుంది. -
సిటీ.. షో స్పెషల్
చిట్‌చాట్ బాలీవుడ్లో ఫ్యాషన్ డిజైనర్‌గా రెండు దశాబ్దాలుగా రాణిస్తున్న నీతా లుల్లా, ‘బ్లెండర్స్ప్రైడ్ ఫ్యాషన్ టూర్-2014’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ‘రుద్రమదేవి’ చిత్రానికి డిజైనర్‌గా పనిచేసిన ఆమె పుట్టింది ముంబైలోనే అయినా, పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇక్కడే చదువు సంధ్యలు సాగించిన నీతా లుల్లా తెలుగులో గలగలా మాట్లాడుతూ, నగరంతో అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. అది ఆమె మాటల్లోనే.. హైదరాబాద్‌లోనే నా చదువు సంధ్యలన్నీ సాగాయి. మొదట్లో ఒక కొరియోగ్రాఫర్ దగ్గర కొద్దికాలం పనిచేశాను. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ప్రయోగాలపై ఆసక్తి ఉండటంతో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి మళ్లాను. రెండు దశాబ్దాలుగా బాలీవుడ్లో కొనసాగుతున్నాను. ఇప్పటికి 400కి పైగా సినిమాలకు డిజైనింగ్ చేశాను. ఫలక్‌నుమా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం.. చదువుకునే రోజుల్లో నాకిష్టమైన ఈ రెండుచోట్లకు తరచూ వెళ్లేదాన్ని. వీటినే స్ఫూర్తిగా తీసుకుని చాలా డిజైన్లు రూపొందించాను. ఫలక్‌నుమా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టగానే నేనే ఒక ప్రిన్సెస్ అనే ఫీలింగ్ వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఫ్యాషన్ షో కోసం 1950ల నాటి ఫ్యాషన్స్ స్ఫూర్తితో డిజైనింగ్ చేశాను. ఢిల్లీ, ముంబై, చెన్నై తరహాలోనే హైదరాబాద్‌లోనూ ఫ్యాషన్ రంగం శరవేగంగా విస్తరించే అవకాశాలున్నాయి. ఇక్కడి డిజైనర్లు ఎక్కడైనా రాణించగలరనేందుకు నేనే ఉదాహరణ. మనిషి రూపురేఖల్ని బట్టి నేను డ్రెస్ డిజైన్ చేస్తాను. నేను డిజైన్ చేసిన డ్రెస్‌లో వాళ్ల అంతస్సౌందర్యాన్ని ఇనుమడింపజేయడమే నా లక్ష్యం. ఇక్కడి నవాబీ ఫుడ్ చాలా ఇష్టం హైదరాబాద్ ఫ్లేవర్ ఉన్న నవాబీ ఫుడ్ అంటే నాకు తగని ఇష్టం. ఇక్కడ చదువుకునే రోజుల్లోనే తెలుగు బాగా నేర్చుకున్నాను. ఇక్కడి హామ్స్టెక్ ఫ్యాషన్ కాలేజీ విద్యార్థులకు డిజైనింగ్ పాఠాలు బోధిస్తున్నా. నలుగురు హ్యామ్స్టెక్ స్టూడెంట్స్‌ను రుద్రమదేవి సినిమా కోసం అసిస్టెంట్స్‌గా పెట్టుకున్నాను. ఫ్యాషన్ అభిమానులందరికీ నేను డిజైన్ చేసిన దుస్తులు చేరాలనేదే నా ఆశయం. ఎన్నిచోట్ల ఫ్యాషన్ షోస్‌లో పాల్గొన్నా, నాకు హైదరాబాద్‌లో షో చేయడమంటే చాలా స్పెషల్. ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం, ఇక్కడి ప్రజల ఆదరణ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నా డిజైన్లను ప్రదర్శించడానికి కూడా లక్ష్మి మంచు, శ్రీదేవి నెక్కెంటి, కవితారెడ్డి తదితర హైదరాబాదీ మహిళలనే ఎన్నుకున్నాను. ..:: సిరి -
ఇండియన్ బ్రైడల్ ఐడల్ ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫైనల్
ముంబైలో జరిగిన ఇండియన్ బ్రైడల్ ఐడల్ ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫైనల్లో మోడల్స్ వెరైటీ డ్రస్సులతో కనువిందు చేశారు. ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, రోహిత్ బాల్ రూపొందించిన ఫ్యాషన్స్‌లో మోడల్స్ మెరిశారు. బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా, ప్రాచీ దేశాయ్, గీతా బస్రా, ఇషా గుప్తా, అతిథిరావు హైద్రి, సోఫీ చౌదరి క్యాట్ వ్యాక్లతో అదరగొట్టారు. Courtesy: HOTURE IMAGES -
కోచడయాన్ ఓ సవాల్
ఇరవైఆరేళ్ల కెరీర్.. మూడువందల సినిమాలు. బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా ట్రాక్ రికార్డ్ ఇది. ఉత్తమ డిజైనర్‌గా నాలుగు జాతీయ అవార్డులు, పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్నారామె. పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో ఎంతోమంది స్టార్స్‌కు కాస్ట్యూమ్స్ డిజైన్స్ చేశారు. ఎంతమందికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినా ‘కోచడయాన్’లో రజనీకాంత్‌కి డిజైన్ చేయడం ఓ సవాల్‌గా తీసుకున్నానని నీతా పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ప్రధాన తారాగణానికి ఆమే డిజైన్ చేశారు. రాజుల కాలం నాటి సినిమా కావడంతో దుస్తుల పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి రావడం సహజం. అందుకే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే ముందు స్కెచ్ గీసుకున్నారు నీతు. ఒక్కో పాత్రకు 150 రకాల స్కెచ్‌లు గీసి, వాటిలోంచి 20 నుంచి 25 కాస్ట్యూమ్స్‌ని సెలక్ట్ చేసుకుని, వాటిని డిజైన్ చేశారు. కేవలం స్కెచ్ వర్క్‌కే ఎనిమిది నెలలు పట్టిందని సమాచారం. ముఖ్యంగా పోరాట యోధుడిగా రజనీ గెటప్‌కి మాత్రమే 25 స్కెచ్‌లు వేశారట. ఈ చిత్రానికి పని చేయడం పట్ల నీతూ తన మనోభావాలను చెబుతూ -‘‘ఈ చిత్రం నా కెరీర్‌కి ఓ మైలు రాయి అని చెప్పొచ్చు. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి... ఈ సినిమా మోషన్ కాప్చర్ టెక్నాలజీ విధానంతో రూపొందినది కావడం. మరొకటి.. రజనీకాంత్‌కి డిజైన్ చేయడం. ఈ స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అంత సులువు కాదనిపించింది. నా కెరీర్లో ఈ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అన్నారు. రజనీ తనయ సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. -
'కొచ్చడయాన్ నా కెరీర్ లోనే మైలురాయి'
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొచ్చడయాన్ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్ రూపొందిస్తున్నారు. భారత దేశంలోనే తొలిసారిగా ఫోటో రియలిస్టిక్ ఫెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజిని ఈ చిత్రం కోసం వాడుకుంటున్నారు. అయితే కొచ్చడయాన్ చిత్రంలో రజనీకాంత్ లుక్ ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లూలా రూపొందించారు. ఆయుధాలు ధరించిన రజనీ లుక్ అభిమానులపై అత్యంత ప్రభావం చూపడమే కాకుండా.. గొప్ప అంచనాలను కూడా పెంచింది. అభిమానుల్లో గొప్ప అంచనాల్ని పెంచడం రజనీ లుక్ వెనుక నీతా ఎనలేని కృషి జరిపిందని చిత్ర యూనిట్ సభ్యుల అభిప్రాయం. రజనీ ధరించిన క్యాస్టూమ్స్, ఆయుధాలకు విశేష ప్రాచుర్యం లభించింది. ఇటీవల నీతా ఓ ఇంటర్య్యూలో 'కొచ్చడయాన్ కు పనిచేయడం గొప్ప అవకాశం. అంతేకాక తన కెరీర్ లో కొచ్చడయాన్ ఓ మైలురాయిగా నిలుస్తుంది. పోటో రియలిస్టిక్ మోషన్ టెక్నాలజీతో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది' అని నీతా లూలా తెలిపారు.