సన్నిహితుల సమక్షంలో వరుణ్-త్రిష నిశ్చితార్థం | Actress Trisha Krishnan engaged | Sakshi
Sakshi News home page

సన్నిహితుల సమక్షంలో వరుణ్-త్రిష నిశ్చితార్థం

Published Fri, Jan 23 2015 3:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

సన్నిహితుల సమక్షంలో వరుణ్-త్రిష నిశ్చితార్థం

సన్నిహితుల సమక్షంలో వరుణ్-త్రిష నిశ్చితార్థం

చెన్నె: దక్షిణాది నటి త్రిష నిశ్చితార్థం యువ నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ తో  శుక్రవారం జరిగింది. వరుణ్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులు, చిత్రపరిశ్రమకు చెందిన సన్నిహితులు హాజరయ్యారు. కాబోయే భార్యకు వరుణ్ ఈ సందర్భంగా విలువైన కానుకలు ఇచ్చినట్టు సమాచారం.

ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేసిన ప్రత్యేక చీరలో త్రిష మెరిసింది. ఎన్ ఏసీ జ్యూయెలర్స్ ఆభరణాలు ధరించింది. వరుణ్ తెలుపు రంగు దోతి ధరించాడు. వివాహ తేదీ ఇంకా నిర్ణయించలేదు. కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలో దంపతులు కాబోతున్నారు. త్రిష నటించిన 'ఎన్నై అరిందాల్' తమిళ చిత్రం ఈ నెల 29న విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement