Varun Manian
-
పెళ్లెందుకు రద్దు చేసుకున్నానంటే...
పెళ్లెందుకు రద్దు చేసుకున్నానంటే..! అంటూ సుదీర్ఘ కాలం తరువాత నటి త్రిష నోరు విప్పారు. గతేడాది ఈ అమ్మడి పెళ్లి సంగతులు పుంఖానుపుంఖాలుగా ప్రచారమయ్యాయి. వాటిలో కలకలం రేపిన అంశాలే అధికం అని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే త్రిష సినీ వయసు 17 ఏళ్లు అని చెప్పకతప్పదు.1999లో నటి సిమ్రాన్ కథానాయకిగా నటించిన జోడి చిత్రంలో ఆమెకు స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించారు. ఆ తరువాత సుమారు మూడేళ్లకు లేసా లేసా చిత్రంలో కథానాయకిగా అవకాశం సంపాదించారు. ఆపై వరుసగా అవకాశాలు తలుపు తట్టడంతో కెరీర్ పరంగా ఎలాంటి బెంగ పెట్టుకోవలసిన అవసరం త్రిషకు రాలేదు. విశ్వనటుడు కమలహాసన్, విజయ్, అజిత్, శింబు నుంచి గణేశ్ వెంకట్రామన్ వరకూ వరుస పెట్టి నటించేస్తున్నారు. అదే విధంగా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునల నుంచి సిద్ధార్ధ్‌ల వరకూ జత కట్టేశారు. నాయకిగా దశాబ్దంన్నరకు చేరువవుతున్న త్రిష నేటికీ కథానాయకిగానే రాణించడం విశేషమే అవుతుంది. ఇటీవల ధనుష్‌తో కలిసి కొడి చిత్రంలో నటించారు. అందులో రాజకీయనాయకురాలిగా ప్రేమికుడిని అంతం చేసే ప్రతినాయకిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటున్నారు. కాగా ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం మోహినిలో నటిస్తున్నారు. తదుపరి విక్రమ్‌తో సామి 2లో రొమాన్స చేయడానికి సిద్ధం అవుతున్నారు. అదే విధంగా యువ నటుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఇలా నటిగా ఎవర్గ్రీన్ నాయకిగా వెలిగిపోతున్న త్రిష వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. టాలీవుడ్ యువ నటుడు రానాతో చెట్టాపట్టాల్ అంటూ త్రిష గురించి పెద్ద దుమారమే చెలరేగింది. అయితే రానాతో తనది మంచి స్నేహబంధమే అని ఈ చెన్నై చిన్నది స్పష్టం చేయడంతో ఆ దుమారానికి తెర పడింది. కాగా గత ఏడాది జనవరిలో వ్యాపార వేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్‌తో త్రిష పెళ్లి నిశ్చయమైంది.వారి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక వివాహమే తరువాయి అన్నకున్న తరుణంలో త్రిష, వరుణ్‌మణియన్‌ల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. పెళ్లి రద్దయింది. దీనికి కారణాలంటూ అనధికారంగా పలు విషయాలు మీడియాలో హల్చల్ చేసినా, నటి త్రిష మాత్రం స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.అయితే మళ్లీ నటించడం ప్రారంభించారు. అలాంటిది ఇన్నాళ్లకు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న త్రిషను తన వివాహం గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తాను ఇంతకు ముందు పెళ్లిని ఎందుకు రద్దు చేసుకున్నానంటే ..! సినిమానే తన జీవితం. సినిమాను వదిలి ఉండలేను. అంతగా సినిమాను ఇష్టపడుతున్నాను. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను అని అన్నారు. వివాహానంతరం కూడా సినిమాకు దూరంగా ఉండలేను. ఒక వేళ పెళ్లికి తరువాత సినిమాకు దూరం అవ్వాల్సి వస్తే అన్న ప్రశ్న తనలో తలెత్తింది. సినిమాను వదిలి ఉండడం తన వల్ల కాదని భావంచడంతో పెళ్లి రద్దు చేసుకున్నాను అని బదులిచ్చారు. ఇప్పటికీ తనకు కథానాయకిగా అవకాశాలు వస్తున్నాయని భవిష్యత్తులో హీరోయిన్ అవకాశాలు రాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా కొనసాగుతానని త్రిష పేర్కొన్నారు. -
నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు
నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరిని ఎంచుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్నారు సంచలన తార త్రిష. ఈమె పెళ్లి వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్‌తో నిశ్చయమై పెళ్లి పీటలెక్కడమే తరువాయి అనుకున్న సమయంలో అనూహ్యంగా పెళ్లి రద్దయిన విషయం తెలిసిందే. ఈ విషయం సినీరంగానంతా కలకలం పుట్టించినా త్రిష, ఆమె కుటుంబం మాత్రం గుంబనంగా ఉండిపోయారు.ఆ తరువాత చాన్నాళ్లకు త్రిష తల్లి మౌనం వీడారు.కొందరు కుటుంబ పెద్దలే వివాహ రద్దుకు కారణం అంటూ ముక్త సరిగా ముగించారు. అలాంటిది తాజాగా వరుణ్‌మణియన్‌తో తన వివాహ రద్దుకు చాలా మంది కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం గురించి త్రిష ఏమంటున్నారో చూద్దాం వరుణ్‌మణియన్ తో నా పెళ్లి పెద్దలు నిశ్చయించినదే. వారి కోరికతో నేను అంగీకరించాను. అయితే వాటితో పాటే కొన్ని నిబంధనలు విధించారు. అందుకే పెళ్లి రద్దు చేసుకున్నాం. అయితే ఈ రద్దు వెనుక చాలా మంది ఉన్నారు. నాకు వివాహ సంప్రదాయంపై నమ్మకం ఉంది. అలాగే సంస్కృతి, సంప్రదాయాలపైనా గౌరవం ఉంది. ఇంకా చెప్పాలంటే నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకర్ని ఎంచుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. అని అంటున్న త్రిష ప్రస్తుతం కేరీర్ పరంగా మంచి పీక్‌లో ఉన్నారు. జయంరవి సరసన నటించిన భూలోకం విడుదల కావలసి ఉండగా, ఆయనతో నటించిన మరో చిత్రం అప్పాటక్కర్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కమల్ సరసన తూంగానగరంతో పాటు భోగీ అనే ఒక తెలుగు చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. -
నా భవిష్యత్తు దేవుడికే వదిలేశా
అనుభవాలు పెద్ద పాఠాలే నేర్పుతాయంటారు. చాలా కాలంగా పెళ్లిని దాటవేస్తూ వచ్చిన నటి త్రిష ఎట్టకేలకు ఆ మధ్య పెళ్లికి సిద్ధం అయ్యారు. నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్పాండియన్తో ఏడు అడుగులు నడవడానికి నిశ్చయం కూడా అయ్యింది. పెళ్లిపీటల మీద పెళ్లిల్లే ఆగిపోతున్నాయి. నిశ్చితార్థం ఒక లె క్కా అన్నంతగా నటి త్రిష, వరుణ్‌పాండియన్‌ల వివాహ నిశ్చితార్థం అక్కడితోనే ఆగిపోయింది. ఇక మాంగల్యం తంతునానానే తరువాయి. అనుకున్న త్రిష, వరుణ్‌పాండియన్‌ల పెళ్లి ఆగిపోవడానికి గురించి వరుణ్‌మణియన్ వర్గం ఇప్పటికీ నోరు విప్పకపోయినా త్రిష తల్లి మాత్రం ఇటీవల పెళ్లికొడుకు కుటుంబ సభ్యుల కారణంగానే పెళ్లిఆగిపోయిందని వివరించారు. త్రిష ఇన్నాళ్లకు ఈ విషయం గురించి తన మనసులోని మాటను బయటపడ్డారు. నా పెళ్లి నిలిచిపోయిన విషయం నిజమే. ఇది ఊహించని విషయమే మనల్ని దాటి ఒక విషయం జరిగినప్పుడు దాని ఒప్పుకుని తీరాల్సిందే. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే. గత విషయాల గురించి చర్చించినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక ముందు ఏమి జరగనుందనేదే వేచి చూడాలి. నా భవిష్యత్ ఏమిటన్నది భగవంతునికే వదిలేశా. నేను ఆ దేవుని బిడ్డను. ఆయన నన్ను బాగానే చూసుకుంటాడు. దైవ నిర్ణయం ఏమిటో దాన్ని నేను అనుసరిస్తాను. అంటూ ఆస్తికత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కమలహాసన్ సరసన ద్విభాషా చిత్రం తూంగావనం చిత్రంలో నటించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ చిత్రం తనకు 50వ చిత్రం కావాలని త్రిష ఆశపడుతున్నారు. ఈమె నటించిన 47 చిత్రాలు తెరపైకి వచ్చాయి. వాటిలో తమిళం, తెలుగు, కన్నడం, హిందీ చిత్రాలు ఉన్నాయట. ఒక్క మలయాళంలో మాత్రం నటించలేదు. త్రిష నటించిన భూలోకం, అప్పాటక్కర్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. రెండు చిత్రాల్లో ఏ చిత్రం విడుదలలో ఆలస్యం జరిగినా తదుపరి నటించనున్న అరణ్మణై -2గాని, తన మేనేజర్ నిర్మిస్తున్న చిత్రాన్ని విడుదలయ్యేలా చేసి తూంగావనం చిత్రాన్ని 50వ చిత్రం కావాలని త్రిష కోరుకుం టున్నారట. -
ఔను... త్రిష పెళ్లి ఆగిపోయింది!
తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం మూడు నెలల ముచ్చటగా ముగిసింది. ఈ ఏడాది జనవరిలో కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెళ్లి తేదీ ప్రకటించలేదు. నిశ్చితార్థం తర్వాత వరుణ్, త్రిష విహారయాత్రకు కూడా వెళ్లారు. అయితే, ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్లు విడిపోయారనే వార్త కొద్దిరోజులుగా హల్చల్ చేస్తోంది. ‘ఔను.. పెళ్లి ఆగిపోయింది’ అని త్రిష తల్లి ఉమాకృష్ణన్ తమిళ పత్రికలవారికి గురువారం తెలియజేశారు. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ మణియన్ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం వల్లే విభేదాలు నెలకొన్నాయనే వార్త ప్రచారం అయ్యింది. ఆ వార్త నిజం కాదని ఉమ పేర్కొన్నారు. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ కుటుంబ సభ్యులకు ఇష్టమేననీ, వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదనీ ఆమె చెప్పారు. కుటుంబ పెద్దల నిర్ణయమే పెళ్లి రద్దు కావడానికి కారణమనీ, కానీ ఆ పెద్దల గురించి చెప్పి... వాళ్లను నొప్పించలేననీ ఆమె అన్నారు. ప్రస్తుతం త్రిష దృష్టంతా సినిమాలపైనే అని ఉమాకృష్ణన్ స్పష్టం చేశారు. ఇదిలా వుండగా, ‘బయట వస్తున్న ఊహాగానాలు విచిత్రంగా ఉన్నాయి. దయచేసి వాటికి ఫుల్స్టాప్ పెట్టండి. నేనిప్పుడు సింగిల్‌గా, హ్యాపీగా ఉన్నాను’ అని గురువారం రాత్రి త్రిష స్వయంగా ట్వీట్ చేశారు. -
కాబోయే దంపతుల్లో కలతలా?
ఇద్దరు సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమం కూడా జరుపుకుని నాలుగు నెలలు దాటినా వివాహ తేదీని నిర్ణయించుకోకపోవడంతో ఆ జంటపై సహజంగానే రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం నటి త్రిష, వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్మనియన్ల గురించి అలాంటి ప్రచారమే కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమల ప్రముఖ కథానాయకి నటి త్రిష. ఈ రంగంలో పుష్కరకాలం పూర్తి చేసుకున్న హీరోయిన్ ఆమె. యువ సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్‌మణియన్. వీరిద్దరి మధ్య ప్రేమ అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. అంతే ఆశ్చర్యంగా వివాహ నిశ్చితార్థం వరకు వెళ్లింది. ఆ వేడుక సందర్భంగా చిత్ర ప్రముఖులకు నక్షత్ర హోటల్లో బ్రహ్మాండమైన పార్టీని ఇచ్చారీ జంట. ఇక ఇరువర్గాల కుటుంబీకులు కలిసి పెళ్లికి మంచి ముహుర్తం నిర్ణయిస్తారని చెప్పారు. వరుణ్‌మణియన్, త్రిష వివాహ నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగింది. మార్చిలో వివాహం తంతు జరుగుతుందనే ప్రచారం జరిగింది. దీంతో త్రిష నటనకు స్వస్తి చెబుతారని, కాదు ఆమె వివాహానంతరం నటనను కొనసాగిస్తారంటూ పలు రకాల ప్రచారాలు దుమ్మురేపాయి. అయితే వీరి నిశ్చితార్థం జరిగి నాలుగు నెలలు అయ్యింది. ఇప్పటి వరకు పెళ్లి తేదీ ఖరారు కాలేదుకదా ఊసే లేదు. మనస్పర్థలా: ఇలాంటి పరిస్థితిలో త్రిష, వరుణ్ మణియన్‌ల గురించి చాలా వదంతులు ప్రచారంలో కొచ్చాయి. అందులో త్రిష, వరుణ్‌మణియన్‌ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయన్నది ఒకటి. వీరిద్దరు సోషల్ నెట్‌వర్క్సులో తరచూ తమ అభిప్రాయాలను పంచుకునేవారు. అలాంటిది గత నెల నుంచి ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం లేదట. మరో విషయం ఏమిటంటే నిశ్చితార్థంలో వరుణ్‌మణియన్ తొడిగిన ఉంగరం త్రిషే వేలికిప్పుడు కనిపించడం లేదట. మరో విషయం వరుణ్‌మనియన్ నిర్మించనున్న తాజా చిత్రంలో మొదట నటించడానికి అంగీకరించిన త్రిష ఆ తరువాత ఆ చిత్రం నుంచి వైదొలిగారనే ప్రచారం హోరెత్తింది. ఇలాంటి పరిస్థితిలో వరుణ్‌మణియన్, త్రిషల మధ్య అభిప్రాయబేధాలు పొడచూపిన విషయం నిజమేనని వారి సన్నిహిత వర్గాల సమాచారం. అవకాశాలు వెల్లువ : త్రిషకు వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థానికి ముందు పెద్దగా చిత్రాలు లేవు. అంతకుముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత త్రిష నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదలైన హిట్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. మేనేజర్ గిరిధర్ నిర్మిస్తున్నారు. త్రిష చిత్రాలు మీద చిత్రాలు అంగీకరించడంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం రాసింది. అయితే ఈ వ్యవహారం గురించి ఇటు త్రిషగాని, అటు వరుణ్‌మణియన్‌గాని నోరు మెదపక పోవడం గమనార్హం. -
జయ్‌తో ఓకే
యువ నటుడు జయ్‌తో జత కట్టడానికి నటి త్రిష సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సుశాంత్ ప్రసాద్ గోవిందరాజ్‌తో కలిసి ఆమెకు కాబోయే భర్త వరుణ్ మణియన్ నిర్మించనున్నారు. మొదట ఈ చిత్రం నుంచి త్రిష వైదొలగినట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ చిత్రంలో జయ్, త్రిష హీరోహీరోయిన్లని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. విశాల్ హీరోగా తీరాద విళైయాట్టు పిళ్లై, సమర్ చిత్రాలను తెరకెక్కించిన తిరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్రిష ఇటు హోమ్లీ పాత్రల్ని అటు గ్లామర్ పాత్రల్ని సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎన్నై అరిందాల్ చిత్రంలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రం ఆమె ఆలా అందంగా కూడా కనిపించారనే అభినదనలు అందుకుంటున్నారు. త్రిష గ్రామీణ పాత్రల్లో నటించి చాలా కాలమైంది. తిరు దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో చిన్న టౌన్‌కు చెందిన యువతిగా నటనకు అవకాశం వున్న పాత్రలో నటించనున్నారట. అప్పట్లో విక్రమ్ సరసన సామి చిత్రంలో ఇన్నోసెంట్ యువతిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. అలాంటి విభిన్న పాత్రలో త్రిష నటించనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్ మార్చిలో చెన్నై కుంభకోణంలో జరుగుతుందన్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. -
త్రిష కాబోయే భర్తకు హత్యాబెదిరింపులు
నటి త్రిష కాబోయే భర్తకు హత్యాబెదిరింపులు రావడంతో ఆమె భయాందోళనలకు గురవుతున్నారు. త్రిష, వరుణ్‌మణియన్‌ల నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వరుణ్ మణియన్ ప్రముఖ వ్యాపారవేత్త. సినీ నిర్మాత. ఈ ప్రేమ జంట వివాహ నిశ్చితార్థం జరిగిన తరువాత వరుణ్మణియన్ను త్వరలో జరగనున్న ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును కొనుగోలు చేయమని త్రిష కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని వరున్మణియన్ కొట్టిపారేశారు. ఇలాం టి పరిస్థితిలో ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తే అంతు చూస్తామని ఆయనకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయట. దీంతో వరుణ్‌మణియన్ ఆదివారం స్థానిక తేనాంపేటలో గల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను బెదిరిస్తున్న ఆగంతులెవరో తెలుసుకుని వారిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
జయ్ హీరోగా వరుణ్‌మణియన్ చిత్రం
త్రిష, వరుణ్‌మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో పెళ్లి తంతు కూడా జరగనుంది. కాబట్టి వారు వధూవరుల కిందే లెక్క. ఇకపోతే వరుణ్‌మణియన్ ఇంతకుముందు వాయై మూడి పేసవుం, కావ్యతలైవన్ మొదలగు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా నటుడు జయ్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తన రేడియన్ మీడియా సంస్థ సుశాంత్ ప్రసాద్, గోవిందరాజ్‌ల ఫిలిం డిపార్టుమెంట్ సంస్థ కలిసి నిర్మించనున్నాయి. నాన్‌సిగప్పు మనిదన్ చిత్రం ఫేమ్ తిరు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తొలుత త్రిష హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆమె వివాహానికి సిద్ధమవడంతో చిత్రం నుంచి వైదొలిగినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఏదైమైనా చిత్ర హీరోయిన్ ఎంపిక జరుగుతోందని చెబుతున్న చిత్ర దర్శకుడు ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం మార్చిలో సెట్‌పైకి రానుందని తెలిపారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణాన్ని అందించనున్న ఈ చిత్ర షూటింగ్‌ను చెన్నై, కుంభకోణం నేపథ్యం ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జయ్, సంగీత దర్శకుడు తమన్ల కలయికలో రూపొందించనున్న ఈ చిత్రం తన కెరీర్‌కు చాలా ముఖ్యమైందని దర్శకుడు తిరు అన్నారు. -
వరుణ్-త్రిష నిశ్చితార్థం
-
సన్నిహితుల సమక్షంలో వరుణ్-త్రిష నిశ్చితార్థం
చెన్నె: దక్షిణాది నటి త్రిష నిశ్చితార్థం యువ నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ తో శుక్రవారం జరిగింది. వరుణ్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులు, చిత్రపరిశ్రమకు చెందిన సన్నిహితులు హాజరయ్యారు. కాబోయే భార్యకు వరుణ్ ఈ సందర్భంగా విలువైన కానుకలు ఇచ్చినట్టు సమాచారం. ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేసిన ప్రత్యేక చీరలో త్రిష మెరిసింది. ఎన్ ఏసీ జ్యూయెలర్స్ ఆభరణాలు ధరించింది. వరుణ్ తెలుపు రంగు దోతి ధరించాడు. వివాహ తేదీ ఇంకా నిర్ణయించలేదు. కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలో దంపతులు కాబోతున్నారు. త్రిష నటించిన 'ఎన్నై అరిందాల్' తమిళ చిత్రం ఈ నెల 29న విడుదలకానుంది. -
త్రిషకు అదే పెద్ద కానుక
త్రిషకు అదే పెద్ద కానుక అంటున్నారు ఆమెకు కాబోయే జీవిత భాగస్వామి వరుణ్ మణియన్. ఇపుడు కోలీవుడ్‌లో చర్చ అంతా త్రిష గురించే సాగుతోంది. ఎందుకంటే ఆమెకు పెళ్లి కళ వచ్చేసింది. యువ నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్‌మణియన్, త్రిష పెళ్లిపీటలెక్కుతున్న విషయం తెలిసిందే. వరుణ్, త్రిష వివాహ నిశ్చితార్థం రేపు నగరంలో ఒకనక్షత్ర హోటల్లో జరగనుంది. ఈ వేడుకకు ఇరువర్గాల కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారని కాబోయే వధూవరులు ఇప్పటికే వెల్లడించారు. 24న సినీ ప్రముఖులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు. వివాహం చేసుకోనున్న నేపథ్యంలో త్రిష నటనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. ఈమె నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం ఈ నెల 29న తెరపైకి రానుంది. ప్రస్తుతం త్రిష వివాహ వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ తమ నిశ్చితార్థం కుటుంబ వేడుకగా జరుపుకోనున్నట్లు తెలిపారు. దీనికి తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన అతి కొద్దిమంది ప్రముఖులనే ఆహ్వానించినట్లు వెల్లడించారు. తన నిశ్చితార్థం వేడుకకు చీరలను తాను అంబాసిడర్‌గా పని చేసిన సంస్థల్లోనే కొనుగోలు చేసినట్టు తెలిపారు. వరుణ్‌మణియన్ తనకు కాబోయే భార్య త్రిషకు వజ్రపుటుంగరాన్ని ముంబయి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి కానుకగా అందించారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు రోల్స్‌రాయ్స్ కంపెనీకి చెందిన అత్యాధునిక కారును కూడా బహుమతిగా అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి వరుణ్‌మణియన్ స్పందిస్తూ తమ నిశ్చితార్థాన్ని పురస్కరించుకుని వేలాది మూగజీవులకు ఆహారం వసతి, వైద్య సేవలు లాంటివి అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని కానుకలకంటే ఇదే త్రిషకు పెద్ద బహుమతి అవుతుందని చెప్పారు. -
ఆ గిఫ్ట్ చాలా ఖరీదు గురూ..!
అందాల తార త్రిష నిశ్చితార్థం ఈ నెల 23న వరుణ్ మణియన్‌తో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుణ్ 7 కోట్ల విలువైన రోల్స్ రాయస్ కారును త్రిషకు బహూకరిస్తారట! నిశ్చితార్థానికే ఏడు కోట్ల ఖరీదైన బహుమతి అంటే... ఇక పెళ్లికి ఏమిటో? -
ఈ నెల 23న త్రిష ఎంగేజ్మెంట్
-
నిశ్చితార్థం నిజమే
నటి త్రిష మరోసారి తన చాతుర్యం ప్రదర్శించారు. ఈ చెన్నై చిన్నదానికి ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్‌తో నిశ్చితార్థం జరిగిందని మీడియా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వరుణ్‌మణియన్‌తో త్రిష సన్నిహితంగా వున్న ఫొటోలతో సహా, ఆధారాలు చూపుతూ పత్రికలు, సోషల్ నెట్వర్క్స్ ప్రచారం చేశాయి. అయినా ఈ ప్రచారంలో నిజం లేదని త్రిష, ఆమె తల్లి ఉమ నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అయితే త్రిషకు మాత్రం రావలసిన రెండు చిత్రాలు వెనక్కు వెళ్లిపోయూరుు. ప్రస్తుతం అజిత్ సరసన నటించిన ఎన్నై అరిందాల్, జయం రవితో నటించిన భూలోకం చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే అంగీకరించిన ఒకటి, రెండు చిత్రాల మినహా త్రిషకు కొత్త అవకాశాలేవీ కను చూపు మేరలో లేవు. దీంతో అమ్మడు పెళ్లికి సిద్ధం అయినట్లున్నారు. ఎవరేమనుకుంటే నా కేంటి అని తెగించి బాయ్‌ఫ్రెండ్ వరుణ్‌మణియన్‌తో పాటు స్నేహితులతో కలిసి పర్సనల్ టూర్ అంటూ ఇటీవల ఢిల్లీకి చెక్కేశారు. అక్కడ అందమైన ప్రదేశాలను బాయ్‌ఫ్రెండ్‌తో చుట్టేసి యమజాలీగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు ప్రేమికులకు చిహ్నం అయిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను వరుణ్ మణియన్‌తో కలిసి సందర్శించారు. ఈ విహారయాత్రకు త్రిష బృందాన్ని ప్రత్యేక విమానంలో వరుణ్ తీసుకె ళ్లటం విశేషం. దీనికి ఖర్చు కొన్ని లక్షల్లో ఉంటుందట. తన ప్రేమ, నిశ్చితార్థం గురించి ప్రచారం జరిగిపోయింది కాబట్టి ఎలాగు కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు లేవని భావించారో ఏమో త్రిష ఈ విహార యాత్రలో తన బాయ్‌ఫ్రెండ్, స్నేహితులతో దిగిన ఫొటోలను, తానే స్వయంగా ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ ఫొటో ఒక పక్క మీడియాలో సంచలనం కలిగిస్తుంటే త్రిష తల్లి ఉమ మాత్రం నెమ్మదిగా తన కూతురు తాజ్‌మహల్‌ను సందర్శించడానికి ఆగ్రా వెళ్లిన విషయం నిజమేనని అంగీకరించారు. త్రిషతోపాటు ఆమె స్నేహితురాలు వెళ్లారని, తమకు ఇక్కడ చాలా పనులుండటం వలన వెళ్లలేకపోయానని తెలిపారు. అయితే త్రిష పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరుగుతోందని, కానీ ఈ ఏడాది త్రిష పెళ్లి ఉండదని, భగవంతుడు దయతలిస్తే వచ్చే ఏడాది త్రిష వివాహం జరుగుతుంద ంటున్నారు. ఇంతకీ ఆమెకిక్కడ అంతగా ఊపిరాడనంత పనులేమిటో బహుశా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారేమోనని కోలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. -
అతనితో కలిసి తాజ్‌మహల్‌కు!
‘‘నేను ఇష్టపడేవాళ్లతో కలిసి ఢిల్లీ వెళ్లా...’’ అంటూ ఇటీవల త్రిష ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక.. అప్పట్నుంచీ త్రిష ఇష్టపడేవాళ్లెవరు? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె ఇష్టపడేవాళ్ల జాబితాలో అతను ఉండే ఉంటాడనే చర్చ కూడా జరిగింది. అతగాడెవరో కాదు.. ‘వరుణ్ మణియన్’. ఇటీవల వరుణ్‌తో త్రిష నిశ్చితార్థం జరిగిందనీ, వచ్చే ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనీ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలో నిజం లేదని త్రిష పేర్కొన్నారు. దాంతో అది సద్దుమణిగింది. కానీ, ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. ఎందుకంటే... త్రిషతో ఢిల్లీ వెళ్లినవాళ్లల్లో వరుణ్ కూడా ఉన్నారు. మొత్తం నలుగురైదుగురు స్నేహితులతో కలిసి త్రిష ఢిల్లీలోని తాజ్‌మహల్‌ని సందర్శించారు. ఆ నలుగురైదుగురులో వరుణ్ మినహా అందరూ అమ్మాయిలే. వాళ్లతో కలిసి త్రిష తాజ్ ముందు డాన్స్ చేశారు. వాటితో పాటు.. తాజ్ ప్రయాణంలో భాగంగా దిగిన ఫొటోలను కూడా బయటపెట్టారు. వాటిలో వరుణ్ మణియన్‌ని చూసినవాళ్లు.. త్రిషతో ఇతగాడు ఎందుకెళ్లాడబ్బా? అని మాట్లాడుకుంటున్నారు. -
త్రిషకు కోపం వచ్చింది
నటి త్రిషకు కోపం వచ్చింది. త్రిష అందాన్ని మాత్రమే ఆస్వాదించే ప్రేక్షకులకు ఆమెకు కోపం వస్తే ఎలా భగ్గుమంటారో తెలియదు. ఇంతకుముందెప్పుడూ ప్రదర్శించనటువంటి ఆగ్రహాన్ని ఈ చెన్నై చిన్నది ఇప్పుడే ప్రదర్శించారు. దీనికి కారణం లేకపోలేదు. నిర్మాత వరుణ్‌మణియన్‌తో నిశ్చితార్థం త్వరలోనే పెళ్లికి సిద్ధం అవుతున్నారంటూ ఇటీవల మీడియా ప్రచారం హోరెత్తిస్తోంది. ఇప్పటి వరకు ఒక టాలీవుడ్ నటుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన త్రిష తాజాగా వరుణ్‌మణియన్ ప్రేమలో పడ్డారనే ప్రచారం మారుమోగిపోతోంది. ఈ వ్యవహారం గురించి త్రిష, ఆమె తల్లి ఉమ ఖండించినా లాభం లేకపోయింది. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో త్రిష కథానాయికల్ని ప్రేక్షకులు ప్రత్యేకంగా చూస్తున్నారన్నారు. నిజానికి అలాంటి ప్రత్యేకత లేవీ తమకు లేవన్నారు. తాము సాధారణ మనుషులమేనన్నారు. అందరిలానే తమకు మనసు ఉంటుందని, ప్రేమ, పెళ్లి లాంటి ఆశలుంటాయన్నారు. ఇతరుల మాదిరిగానే తాము జీవించాలని ఆశిస్తున్నామన్నారు. తమకు ఇష్టాఇష్టాలు ఉంటాయని ఈ విషయాన్ని అర్థం చేసుకుని తమను గౌరవించాలని కోరుకుంటున్నానన్నారు. తమ వ్యక్తిగత జీవితాల గురించి తప్పుగా చిత్రీకరిస్తూ కలకలం సృష్టించకండి అంటూ బాధతో కూడిన ఆవేదనను, ఆగ్రహాన్ని త్రిష వ్యక్తం చేశారు. -
వరుణ్‌కు థ్యాంక్స్
నిర్మాత వరుణ్మణియన్కు నటి త్రిష థ్యాంక్స్ చెప్పారు. దీంతో వీరిద్దరిపై మీడియా మరోసారి ఫోకస్ చేసింది. ఈ వరుణమణియన్ ఎవరో కాదు త్రిషను వివాహం చేసుకోబోతున్నారని నిశ్చితార్థం జరిగిందని ఇటీవల ప్రచారం హోరెత్తింది. ఆ వార్తలో వరుడే ఈ వరుణ్‌మణియన్. ఈ ప్రచారం జరిగిన తరువాత త్రిష ధనుష్ సరసన నటించే చిత్రం నుంచి, జయ్‌కు జంటగా నటించనున్న చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం త్రిషకు కొత్త చిత్రాలేమీ చేతిలో లేవు. జయంరవితో నటించిన భూలోకం, అజిత్‌తో రొమాన్స్ చేసిన ఎన్నైఅరిందాల్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. తెలుగులో బాలకృష్ణ సరసన నటిస్తున్న చిత్రంతోపాటు రమ్ అనే మరో చిత్రం మాత్రం ఉన్నాయి. దీంతో త్రిష తన నిశ్చితార్థం వార్తను ఎంతగా ఖండించినా ఫలితం లేదు. ఇందుకు బలమైన కారణం లేకపోలేదు. వరుణ్‌మణియన్ సమర్పణలో దర్శకుడు వసంతబాలన్ దర్శకత్వం వహించిన చిత్రం తలైవన్. సిద్ధార్థ్, వేదిక తదితరులు నటించిన చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం గురించి త్రిష తన ట్విట్టర్లో పేర్కొంటూ చిత్ర యూనిట్ నైపుణ్యానికి నిదర్శనం కావ్యతలైవన్. చాలా మంచి ప్రయత్నం. సినీ ప్రియులు తప్పక చూడవలసిన చిత్రం. ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన వరుణ్మణియన్కు ధన్యవాదాలు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. చిత్ర దర్శకుడి గురించి మాత్రం ఒక్క మాట పేర్కొనకపోవడం త్రిషకు వరుణ్మణియన్కు మధ్య వున్న సాన్నిహిత్యాన్ని తెలియచేస్తోందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. -
ఫొటో దిగితే...నిశ్చితార్థం అయినట్టేనా?
‘‘పెళ్లంటే నాకిష్టమే. కానీ, అది మనసుకి సంబంధించినది. మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష పేర్కొన్నారు. తమిళ నిర్మాత వరుణ్ మణియన్, త్రిషల నిశ్చితార్థం జరిగిందనే వార్త ఇటీవల ప్రచారమైన విషయం తెలిసిందే. అలాంటిదేం జరగలేదని త్రిష చెబుతూ -‘‘పెళ్లి అనేది జీవితంలో అతి ముఖ్యమైన ఎపిసోడ్. ఒకవేళ నాకు నిశ్చితార్థం జరిగితే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం నాకేంటి? అది దాచాల్సిన విషయమేం కాదు కదా. అలాంటిది హఠాత్తుగా నిశ్చితార్థం కానిచ్చేసి, పెళ్లి చేసుకోవాలని ఎందుకనుకుంటాను? ముందు నా పెళ్లి గురించి నా నిర్మాతల దగ్గర చెబుతాను. అలాగే, నాతో పాటు పని చేస్తున్నవాళ్లకి చెబుతాను’’ అన్నారు. వరుణ్ మణియన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారట కదా? అనే ప్రశ్నకు -‘‘ఇది నాకు, వరుణ్‌కి సంబంధించిన విషయం మాత్రమే కాదు. రెండు కుటుంబాలకు చెందినది. అందుకని ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఫ్రెండ్‌తో కలిసి ఫొటో దిగినంత మాత్రాన నిశ్చితార్థం అయినట్టేనా? నాకు వరుణ్ మంచి స్నేహితుడు. ప్రస్తుతం నేను చెప్పగలిగేది ఇంతే’’ అన్నారు. -
త్రిషకు దిల్ ఉందా?
సంచలనాలకు కేంద్ర బిందువుగా పేరొందిన నటి రాయ్‌లక్ష్మి. ఈ భామకు దూకుడెక్కువ అని కోలీవుడ్ వర్గాలంటుంటాయి కూడా. చాలా కాలం తరువాత అరణ్మణై చిత్రంతో విజయాన్ని చూసిన రాయ్‌లక్ష్మి మరోసారి తన దూకుడును ప్రవర్తించారు. నటి త్రిష, నిర్మాత పారిశ్రామికవేత్త వరుణ్‌మణియన్ పెళ్లాడనున్నట్లు వీరి వివాహ నిశ్చితార్థం కూడా ఇటీవల త్రిష ఇంట్లో రహస్యంగా జరిగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే అది అసత్య ప్రచారం అంటూ త్రిష, ఆమె తల్లి ఉమా ఖండించడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై నటి రాయ్‌లక్ష్మి తన ట్విట్టర్లో కామెంట్ చేస్తూ త్రిషకు పరోక్షంగా చురకలు వేశారు. ఎవరికైనా నిజాన్ని అంగీకరించడానికి దిల్ ఉండాలన్నారు. అది లేని కొందరు జరిగిన నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ట్విట్టర్లో పోస్టు చేయడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. దీంతో త్రిష వివాహ నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమేననిపిస్తోంది. మరి రాయ్‌లక్ష్మి వ్యాఖ్యలకు త్రిష ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
త్రిష ఎంగేజ్మెంట్ అయిపోయిందా?
నటి త్రిషకు పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. వరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత వరుణ్ మణియన్. వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి. ఇది సోమవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ చేస్తున్న ప్రచారం. నిజం చెప్పాలంటే గత ఏడాదికి పైగా త్రిష వివాహం గురించి మీడియాలో రకరకాల ప్రచారం కలకలం కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ నటుడు రానాతో ప్రేమ, రహస్య వివాహం జరిగిపోయిందంటూ వదంతులు జోరుగా సాగాయి. అయితే ఇటీవల రానాకు త్రిషకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అంతేకాదు ప్రేమ విఫలం అవడంతో నటి త్రిష అసహనంతో ఉన్నారని, దీంతో అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి రకరకాల ప్రచారం మధ్య సోమవారం త్రిష, వరుణ్ మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిందనే న్యూస్ కోలీవుడ్‌లో మరింత చర్చనీయాంశంగా మారింది. 'లేసా లేసా' చిత్రం ద్వారా హీరోయిన్గా రంగ ప్రవేశం చేసిన త్రిష ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రముఖ కథానాయికి స్థాయికి చేరారు. టాప్ హీరోయిన్ గా దశాబ్ద కాలాన్ని దాటేసిన త్రిషకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి ఆమె తల్లి వచ్చారని, వరుడి వేటలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా త్రిష వరుణ్ మణియన్ సన్నిహితంగా ఉన్న ఫొటో ఇంటర్నెట్లో ప్రచారమై కోలీవుడ్‌నే ఆశ్చర్యపరిచింది. వీరి వివాహ నిశ్చితార్థం రెండు రోజుల ముందు జరిగిందని వచ్చే ఏడాది మార్చిలో త్రిష, వరుణ్ మణియన్‌ల వివాహం జరగనుందని ప్రచారం జోరందుకుంది. అదంతా ఉత్తిదే అయితే ఇదంతా అసత్యప్రచారం అని త్రిష తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాంటిదేమైనా జరిగితే ముందుగా మీకే చెబుతానని ఈ బ్యూటీ అభిమానులనుద్దేశించి ట్విట్టర్లో పోస్టు చేశారు. అదే విధంగా త్రిష తల్లి ఉమ కూడా నిశ్చితార్థం ప్రచారాన్ని ఖండించారు. త్రిష పెళ్లి ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రచారం గురించి వరుణ్ మణియన్ గానీ, ఆయన కుటుంబం గానీ ఖండించకపోవడం గమనార్హం. పెళ్లి నిజమే! పరిశ్రమలోని ఒక వర్గం టాక్ మరోలా వినిపిస్తోంది. నటి త్రిష వరుణ్ మణియన్‌ల నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమేనని ఈ విషయాన్ని త్రిష, ఆమె తల్లి ఉమ దాచడానికి కారణం ఉందని అంటున్నారు. అదేమిటంటే త్రిష ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారని పెళ్లి విషయం తెలిస్తే ఆ చిత్రాల వ్యాపారానికి పెద్ద దెబ్బే తగులుతుందని అందువలన ఈ పెళ్లి నిశ్చితార్థం విషయాన్ని మరికొద్ది రోజులు రహస్యంగా ఉంచాలనే భావనలో వున్నట్లు కోడంబాక్కం టాక్. -
ఇంతకీ అయినట్టా? కానట్టా?
రెండు రోజులుగా తమిళ సినీ మీడియాలో, ఆన్లైన్ వేదికల్లో ఎక్కడ చూసినా త్రిష నామస్మరణే. వ్యాపారవేత్త, తమిళ చిత్రాల నిర్మాత అయిన వరుణ్ మణియన్‌తో త్రిషకు పెళ్ళి కుదిరిందన్న వార్తే దీనికి కారణం. నిజానికి, నటుడు రానా, త్రిషల మధ్య ప్రేమ వ్యవహారం చాలాకాలం వార్తల్లో నిలిచినా, ఆ అనుబంధం తెగిపోయిందనీ, వరుణ్‌తో ఉన్న చిరకాల స్నేహం బలపడిందనీ కోడంబాకమ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కొన్నాళ్ళుగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరూ కలిసున్న ఫోటోలు కూడా నెట్లో షికార్లు చేస్తున్నాయి. అయితే, తమ మధ్య బంధాన్ని కథానాయిక త్రిష అధికారికంగా అంగీకరించనూ లేదు. అలాగని తోసిపుచ్చనూ లేదు. ఈ నేపథ్యంలో త్రిష నిశ్చితార్థం కబురు నిజమేనని అందరూ భావించారు. చివరకు ఏమనుకున్నారో ఏమో త్రిష ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని నిశ్చితార్థం కబుర్లన్నీ అబద్ధమంటూ వివరణ నిచ్చారు. ‘‘నాకు నిశ్చితార్థం జరగలేదు. నిశ్చితార్థం జరిగినప్పుడు నేనే ముందుగా ఆ వార్త చెబుతాను’’ అని ఈ చెన్నై సుందరి ట్వీట్ చేశారు. అయితే, త్రిష ట్వీట్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. నటి రాయ్ లక్ష్మి అయితే త్రిష తన వ్యక్తిగత జీవిత వాస్తవాలను తోసిపుచ్చే బదులు నిజం ఒప్పుకోవాలంటూ ట్వీట్ చేశారు. ‘‘ఎవరైనా సరే తమ వ్యక్తిగత జీవితం గురించి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నిజాన్ని ఒప్పుకోకుండా అబద్ధాలు చెప్పడం ఎందుకు?’’ అని ఆమె అన్నారు. రాయ్ లక్ష్మి మాటలు చూస్తుంటే, త్రిషకు నిజంగా నిశ్చితార్థం అయినట్లే ఉంది. మరి, త్రిష అధికారికంగా ఆ కబురు ఎప్పుడు చెబుతారో?