నిశ్చితార్థం నిజమే | Trisha Krishnan Varun Manian engagement true | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం నిజమే

Published Wed, Dec 10 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

నిశ్చితార్థం నిజమే

నిశ్చితార్థం నిజమే

 నటి త్రిష మరోసారి తన చాతుర్యం ప్రదర్శించారు. ఈ చెన్నై చిన్నదానికి ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్‌తో నిశ్చితార్థం జరిగిందని మీడియా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వరుణ్‌మణియన్‌తో త్రిష సన్నిహితంగా వున్న ఫొటోలతో సహా, ఆధారాలు చూపుతూ పత్రికలు, సోషల్ నెట్‌వర్క్స్ ప్రచారం చేశాయి. అయినా ఈ ప్రచారంలో నిజం లేదని త్రిష, ఆమె తల్లి ఉమ నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అయితే త్రిషకు మాత్రం రావలసిన రెండు చిత్రాలు వెనక్కు వెళ్లిపోయూరుు. ప్రస్తుతం అజిత్ సరసన నటించిన ఎన్నై అరిందాల్, జయం రవితో నటించిన భూలోకం చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
 
 ఇకపోతే ఇప్పటికే అంగీకరించిన ఒకటి, రెండు చిత్రాల మినహా త్రిషకు కొత్త అవకాశాలేవీ కను చూపు మేరలో లేవు. దీంతో అమ్మడు పెళ్లికి సిద్ధం అయినట్లున్నారు. ఎవరేమనుకుంటే నా కేంటి అని తెగించి బాయ్‌ఫ్రెండ్ వరుణ్‌మణియన్‌తో పాటు స్నేహితులతో కలిసి పర్సనల్ టూర్ అంటూ ఇటీవల ఢిల్లీకి చెక్కేశారు. అక్కడ అందమైన ప్రదేశాలను బాయ్‌ఫ్రెండ్‌తో చుట్టేసి యమజాలీగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు ప్రేమికులకు చిహ్నం అయిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను వరుణ్ మణియన్‌తో కలిసి సందర్శించారు. ఈ విహారయాత్రకు త్రిష బృందాన్ని ప్రత్యేక విమానంలో వరుణ్ తీసుకె ళ్లటం విశేషం. దీనికి ఖర్చు కొన్ని లక్షల్లో ఉంటుందట.
 
 తన ప్రేమ, నిశ్చితార్థం గురించి ప్రచారం జరిగిపోయింది కాబట్టి ఎలాగు కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు లేవని భావించారో ఏమో త్రిష ఈ విహార యాత్రలో తన బాయ్‌ఫ్రెండ్, స్నేహితులతో దిగిన ఫొటోలను, తానే స్వయంగా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటో ఒక పక్క మీడియాలో సంచలనం కలిగిస్తుంటే త్రిష తల్లి ఉమ మాత్రం నెమ్మదిగా తన కూతురు తాజ్‌మహల్‌ను సందర్శించడానికి ఆగ్రా వెళ్లిన విషయం నిజమేనని అంగీకరించారు. త్రిషతోపాటు ఆమె స్నేహితురాలు వెళ్లారని, తమకు ఇక్కడ చాలా పనులుండటం వలన వెళ్లలేకపోయానని తెలిపారు. అయితే త్రిష పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరుగుతోందని, కానీ ఈ ఏడాది త్రిష పెళ్లి ఉండదని, భగవంతుడు దయతలిస్తే వచ్చే ఏడాది త్రిష వివాహం జరుగుతుంద ంటున్నారు. ఇంతకీ ఆమెకిక్కడ అంతగా ఊపిరాడనంత పనులేమిటో బహుశా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారేమోనని కోలీవుడ్ గుసగుసలాడుకుంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement