జయ్‌తో ఓకే | Trisha Krishnan signs fiance Varun Manian’s next production | Sakshi
Sakshi News home page

జయ్‌తో ఓకే

Published Sun, Feb 8 2015 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

జయ్‌తో ఓకే

జయ్‌తో ఓకే

యువ నటుడు జయ్‌తో జత కట్టడానికి నటి త్రిష సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సుశాంత్ ప్రసాద్ గోవిందరాజ్‌తో కలిసి ఆమెకు కాబోయే భర్త వరుణ్ మణియన్ నిర్మించనున్నారు. మొదట ఈ చిత్రం నుంచి త్రిష వైదొలగినట్లు ప్రచారం జరిగింది.  కానీ ఈ చిత్రంలో జయ్, త్రిష హీరోహీరోయిన్లని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. విశాల్ హీరోగా తీరాద విళైయాట్టు పిళ్లై, సమర్ చిత్రాలను తెరకెక్కించిన తిరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్రిష ఇటు హోమ్లీ పాత్రల్ని అటు గ్లామర్ పాత్రల్ని సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎన్నై అరిందాల్ చిత్రంలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటున్నారు.
 
 ఈ చిత్రం ఆమె ఆలా అందంగా కూడా కనిపించారనే అభినదనలు అందుకుంటున్నారు. త్రిష గ్రామీణ పాత్రల్లో నటించి చాలా కాలమైంది. తిరు దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో చిన్న టౌన్‌కు చెందిన యువతిగా నటనకు అవకాశం వున్న పాత్రలో నటించనున్నారట. అప్పట్లో విక్రమ్ సరసన సామి చిత్రంలో ఇన్నోసెంట్ యువతిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. అలాంటి విభిన్న పాత్రలో త్రిష నటించనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్ మార్చిలో చెన్నై కుంభకోణంలో జరుగుతుందన్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం అందించనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement