ఔను... త్రిష పెళ్లి ఆగిపోయింది! | Trisha Varun Manian Marriage Cancelled ? | Sakshi
Sakshi News home page

ఔను... త్రిష పెళ్లి ఆగిపోయింది!

Published Fri, May 8 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

ఔను... త్రిష పెళ్లి ఆగిపోయింది!

ఔను... త్రిష పెళ్లి ఆగిపోయింది!

తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం మూడు నెలల ముచ్చటగా ముగిసింది. ఈ ఏడాది జనవరిలో కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెళ్లి తేదీ ప్రకటించలేదు. నిశ్చితార్థం తర్వాత వరుణ్, త్రిష విహారయాత్రకు కూడా వెళ్లారు. అయితే, ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్లు విడిపోయారనే వార్త కొద్దిరోజులుగా హల్‌చల్ చేస్తోంది. ‘ఔను.. పెళ్లి ఆగిపోయింది’ అని త్రిష తల్లి ఉమాకృష్ణన్ తమిళ పత్రికలవారికి గురువారం తెలియజేశారు.
 
 త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ మణియన్ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం వల్లే విభేదాలు నెలకొన్నాయనే వార్త ప్రచారం అయ్యింది. ఆ వార్త నిజం కాదని ఉమ పేర్కొన్నారు. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ కుటుంబ సభ్యులకు ఇష్టమేననీ, వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదనీ ఆమె చెప్పారు. కుటుంబ పెద్దల నిర్ణయమే పెళ్లి రద్దు కావడానికి కారణమనీ, కానీ ఆ పెద్దల గురించి చెప్పి... వాళ్లను నొప్పించలేననీ ఆమె అన్నారు. ప్రస్తుతం త్రిష దృష్టంతా సినిమాలపైనే అని ఉమాకృష్ణన్ స్పష్టం చేశారు. ఇదిలా వుండగా, ‘బయట వస్తున్న ఊహాగానాలు విచిత్రంగా ఉన్నాయి. దయచేసి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టండి. నేనిప్పుడు సింగిల్‌గా, హ్యాపీగా ఉన్నాను’ అని గురువారం రాత్రి త్రిష స్వయంగా ట్వీట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement