నా భవిష్యత్తు దేవుడికే వదిలేశా | my future given off God says Actress Trisha | Sakshi
Sakshi News home page

నా భవిష్యత్తు దేవుడికే వదిలేశా

Published Mon, Jun 1 2015 7:56 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

నా భవిష్యత్తు దేవుడికే వదిలేశా

నా భవిష్యత్తు దేవుడికే వదిలేశా

అనుభవాలు పెద్ద పాఠాలే నేర్పుతాయంటారు. చాలా కాలంగా పెళ్లిని దాటవేస్తూ వచ్చిన నటి త్రిష ఎట్టకేలకు ఆ మధ్య పెళ్లికి సిద్ధం అయ్యారు. నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌పాండియన్‌తో ఏడు అడుగులు నడవడానికి నిశ్చయం కూడా అయ్యింది. పెళ్లిపీటల మీద పెళ్లిల్లే ఆగిపోతున్నాయి. నిశ్చితార్థం ఒక లె క్కా అన్నంతగా నటి త్రిష, వరుణ్‌పాండియన్‌ల వివాహ నిశ్చితార్థం అక్కడితోనే ఆగిపోయింది. ఇక మాంగల్యం తంతునానానే తరువాయి. అనుకున్న త్రిష, వరుణ్‌పాండియన్‌ల పెళ్లి ఆగిపోవడానికి గురించి వరుణ్‌మణియన్ వర్గం ఇప్పటికీ నోరు విప్పకపోయినా త్రిష తల్లి మాత్రం ఇటీవల పెళ్లికొడుకు కుటుంబ సభ్యుల కారణంగానే పెళ్లిఆగిపోయిందని వివరించారు.
 
  త్రిష ఇన్నాళ్లకు ఈ విషయం గురించి తన మనసులోని మాటను బయటపడ్డారు. నా పెళ్లి నిలిచిపోయిన విషయం నిజమే. ఇది ఊహించని విషయమే మనల్ని దాటి ఒక విషయం జరిగినప్పుడు దాని ఒప్పుకుని తీరాల్సిందే. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే. గత విషయాల గురించి చర్చించినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక ముందు ఏమి జరగనుందనేదే వేచి చూడాలి. నా భవిష్యత్ ఏమిటన్నది భగవంతునికే వదిలేశా. నేను ఆ దేవుని బిడ్డను. ఆయన నన్ను బాగానే చూసుకుంటాడు. దైవ నిర్ణయం ఏమిటో దాన్ని నేను అనుసరిస్తాను.
 
 అంటూ ఆస్తికత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కమలహాసన్ సరసన ద్విభాషా చిత్రం తూంగావనం  చిత్రంలో నటించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ చిత్రం తనకు 50వ చిత్రం కావాలని త్రిష ఆశపడుతున్నారు. ఈమె నటించిన 47 చిత్రాలు తెరపైకి వచ్చాయి. వాటిలో తమిళం, తెలుగు, కన్నడం, హిందీ చిత్రాలు ఉన్నాయట. ఒక్క మలయాళంలో మాత్రం నటించలేదు. త్రిష నటించిన భూలోకం, అప్పాటక్కర్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. రెండు చిత్రాల్లో ఏ చిత్రం విడుదలలో ఆలస్యం జరిగినా తదుపరి నటించనున్న అరణ్మణై -2గాని, తన మేనేజర్ నిర్మిస్తున్న చిత్రాన్ని విడుదలయ్యేలా చేసి తూంగావనం చిత్రాన్ని 50వ చిత్రం కావాలని త్రిష కోరుకుం టున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement