Aranmanai -2
-
రూటు మార్చిన త్రిష
ఇవాళ గ్లామర్ పేరుతో కుటుంబ సమేతంగా చూడడానికి సిగ్గు పడే విధంగా అసలు దుస్తులు ధరించారా? అని సందేహం కలిగేలా హీరోయిన్లు నటించడానికి వెనుకాడడం లేదు. అయితే ఈ విషయంలో వారిని మాత్రమే తప్పు పట్టడానికి వీలులేదు. వ్యాపారాత్మక దృక్పథంలో దర్శక నిర్మాతల ఒత్తిడి ఉంటుందని చెప్పక తప్పదు. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే నటి త్రిష గ్లామరస్ పాత్రల్లో విజృంభించి నటించిన సందర్భాలున్నాయి.అయితే ఇటీవల ఈ చెన్నై చిన్నది తన ధోరణిని మార్చుకున్నారట. ఆ మధ్య నటించిన అరణ్మణై-2 చిత్రంలో హన్సిక,పూనం బాజ్వాలతో పోటీ పడి అందాలారబోశారు. దీంతో అలాంటి అవకాశాలు మరిన్ని తలుపు తట్టడంతో ఇక లాభం లేదనుకుని తన రూటు మార్చారట. అయితే అంతకు ముందే తూంగావనం లాంటి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసు చూరగొన్నారు. అందువల్ల ఇకపై అతి గ్లామర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రస్తుతం త్రిష నాయకి అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈ బ్యూటీ నాటి నటీమణులు కాంచన, వాణిశ్రీలను గుర్తుకు తెచ్చేలా మెడ నుంచి కాలు వరకూ దుస్తులు ధరించి నటిస్తున్నారు. శ్రుతి మించిన గ్లామర్ పాత్రలు చేయడం ఇష్టం లేకే తన రూటును మార్చుకున్నట్లు త్రిష పేర్కొన్నారు. అంతే కాదు ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రలు అయితేనే నటించడానికి అంగీకరిస్తానని త్రిష చెబుతున్నట్లు సమాచారం. -
ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు
ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అయితే... అంటున్న త్రిషను ఎవర్గ్రీన్ ప్రైమ్‌టైమ్ కథానాయిక అనిపేర్కొనవచ్చు. కారణం అందరికీ తెలిసింది.మూడు పదుల వయసు దాటిన ఈ ప్రౌఢ నిత్య సంచలన నటి. నటీమణుల్లో అధిక వదంతులకు కేంద్రబిందువు ఎవరన్న విషయంలో నయనతార, త్రిష పేర్లు పోటీ పడతాయనడంలో అతిశయోక్తి ఉండదేమో. విశేషం ఏమిటంటే వారిద్దరు ఒకప్పుడు బద్దశత్రువులైతే ఇప్పుడు ప్రియమైన నేస్తాలు. 13 ఏళ్ల నట జీవితంలో ఐదు పదుల చిత్రాల సంఖ్యను అవలీలగా అధిగమిస్తున్న నేటికీ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతుండడం సాదారణ విషయం కాదు.ఈ హారర్‌కు మారిన ఈ చెన్నై చిన్నది నటించిన తాజా చిత్రం అరణ్మణై-2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా త్రిషతో చిన్న చిట్‌చాట్. ప్ర: మీకూ దెయ్యంగా మారాలని ఆశ పుట్టినట్లుందే? జ: తొలిసారిగా అరణ్మణై-2 చిత్రంలో దెయ్యంగా నటించాను. అరణ్మణై చిత్రం నాకు బాగా నచ్చింది. దానికి సీక్వెల్ చిత్ర కథ దర్శకుడు సుందర్.సీ చెప్పినప్పుడు అందులో నటించే అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. కుష్బూ నాకు మంచి స్నేహితురాలు. అరణ్మణై-2లో నటించడానికి ఇదొకకారణం. ఇందులో నటించే అవకాశం రావడం ఘనతగా భావిస్తున్నాను. సిద్ధార్ధ్, హన్సిక, సూరి తదితర కొత్త టీమ్‌తో నటించడం సంతోషకరం. ప్ర: సెకెండ్ ఇన్నింగ్‌లోనూ బిజీగా నటించడం గురించి? జ: నేను సినిమాలోకి వచ్చి 13 ఏళ్లుఅయ్యిందన్నది నమ్మలేకపోతున్నాను. అధిక చిత్రాలు చేయాలి, ప్రముఖ నటులతో నటించాలీ అనే మొదట్లో భావించాను. అయితే ఆ అనుభవం ఇప్పుడు మంచి కథాపాత్రలపై దృష్టి సారించాలని చెబుతోంది. ఇప్పుడు సెలెక్టెడ్ చిత్రాలే చేస్తూ రాశి గల నటిగా రాణిస్తున్నాను. ప్ర: నాన్న మరణం, ఆగిపోయిన పెళ్లి లాంటి బాధాకరమైన సంఘటనలకు కుంగిపోకుండా వాటిని అధిగమించడం గురించి? జ: నిజం చెబుతున్నా. మా కుటుంబంలో అందరూ ధైర్యవంతులే. ఎలాంటి విషయాన్నైనా ఈజీగా తీసుకుంటాం. నాకు మార్గదర్శిగా అమ్మ ఉన్నారు. జీర్ణించుకోలేని చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కొన్ని రోజులు ఏకాంతంగా మౌనంగా ఉంటాను. ఆ తరువాత పనికి సిద్ధం అవుతాను. ఇదే నా కేరెక్టర్. ప్ర: కొడి చిత్రంలో ధనుష్‌కు జంటగా నటించడం గురించి? జ: మీకో విషయం తెలుసా? ఆడుగళం చిత్రం తొలుత నేనే కథానాయికని.ధనుష్‌తో కొన్ని సన్నివేశాల్లో నటించాను కూడా. ఆ సమయంలో హిదీ చిత్రంలో నటించాల్సి రావడంతో కాల్షీట్స్ సమస్య కారణంగా ఆడుగళం చిత్రం నుంచి వైదొలిగాను. ఆ తరువాత ఇన్నాళ్లకు కొడి చిత్రంలో ధనుష్‌తో నటిస్తుండడం సంతోషంగా ఉంది. ఇందులో మరో నాయికగా షామిలి నటిస్తున్నారు. ప్ర: మీ యవ్వన రహస్యం? జ: రహస్యం అంటూ ఏమీలేదు. అన్నీ ఫుల్‌గా లాగించేస్తాను. ఆర్య చెప్పినట్లు రెండు ప్లేట్లు బిరియాని కూడా తినేస్తాను. అయితే ఎంత తిన్నానో అన్ని రోజులు తినడం మానేస్తాను. పళ్ల రసం మాత్రమే తీసుకుంటాను. ప్ర: ఇన్నేళ్ల నట జీవితంలో కథాపాత్ర కోసం పారితోషికం విషయంలో పట్టువిడుపుల సంఘటనలు ఉన్నాయా? జ: అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.ఇం కా చెప్పాలంటే తొలుత పారితోషికం గురించి మా ట్లాడను. కథే ముఖ్యం. అది బాగా నచ్చితే పారితోషికం తగ్గించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్ర: నయనతారతో కలిసి నటించనున్నారటగా? జ: అలాంటిదేమీ లేదు. మీడియా వాళ్లు కొందరు అలా ప్రచారం చేశారు. నిజంగా అలాంటిదేదైనా ఉంటే సోషల్ మీడియాలో నేనే పోస్ట్ చేసేదాన్ని. నేను నయనతార మంచి స్నేహితులమే. సరైన కథ అమరితే ఇద్దరం కలిసి నటిస్తాం. ప్ర: నటుడు ఆర్య ఇటీవల ఒక కార్యక్రమంలో త్రిష నాకు చెల్లెలు మాదిరి అన్నారే? జ: ఆర్య అలా అన్నారా? నిజంగానే ఆర్య చాలా మంచి వ్యక్తి. ఆయనతో ఎలాంటి విషయమైనా పంచుకోవచ్చు. హీరోయిన్లకు మంచి మిత్రుడు. ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్లినా భోజనం చేయవచ్చు. ఆయన్ని ఎక్కడికైనా పిలుచుకుపోవచ్చు. ఇక నన్ను చెల్లెలు అనడమే కామెడీ. ఈ విషయం గురించి ఆర్యను అడిగే తీరుతాను. ప్ర: ఈ మధ్య పార్టీలకు వెళ్లడం తగ్గించినట్లున్నారే? జ: క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీలు అంటేనే నేను పాల్గొంటాను. అలాంటిది ఎక్కువగా పార్టీలకు వెళతానే ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడు స్నేహితురాళ్లం ఒక చోట కలుసుకుంటాం. ఇది సాధారణంగా అందరూ చేసే పనే. అయితే సినిమా వాళ్ల విషయంలో దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. ప్ర: మళ్లీ రానాతో ప్రేమాయణం అన్న ప్రచారం గురించి? జ: అందరితో మసలుకున్నట్లే రానాతోనూ ఉంటాను. మా మధ్య స్నేహం తప్ప మరేమీలేదు. ఈ విషయం గురించి పత్రికల వాళ్లే రాస్తున్నారు. అలాంటిది ప్రేమా అని అడగడంలో అర్థం లేదు. ప్ర: సరే.. పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: బిజీగా ఉన్నప్పుడు నేనే కాదు ఏ నటి పెళ్లి గురించి నిర్ణయం తీసుకోదు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు 30, 40 ఏళ్ల వయసన్నది పెద్ద విషయమే కాదు. ఇక నాకు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు. మనసుకు నచ్చిన వాడు లభించాలి. రాణీముఖర్జీ, ఐశ్వర్యారాయ్‌లాంటి వారు లేట్‌గానే పెళ్లి చేసుకున్నారు. నటి ప్రియాంక ఇప్పటికీ దుమ్మురేపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి లభించడం అంత సులభం కాదు. సమయం వచ్చినప్పుడు పెళ్లి విషయం ఆలోచిస్తాను. -
తొలి ప్రేమ మరువలేనిది
ఎవరికయినా తొలి ప్రేమ మరువలేనిదని నటి త్రిష అంటున్నారు. ఒకటికి రెండు సార్లు ప్రేమలో ఓడిపోయిన ఈ భామ తొలి ప్రేమ గురించి మాట్లాడుతున్నారేంటని ఆశ్చర్యపోతున్నారా? మరి ఆమె చెప్పే తొలి ప్రేమ కహానీ ఏమిటో చూసేస్తే పోలా. వ్యాపార వేత్త వరుణ్మనియన్తో త్రిష ప్రేమ పెళ్లి పీటలు ఎక్కకపోయినా నటిగా అవకాశాలు మాత్రం బాగా పెరిగాయి. సో త్రిష ఆవిధంగా హ్యాపీ అన్నమాట. ప్రస్తుతం కమలహాసన్‌కు జంట గా నటిస్తున్న తూంగావనం చిత్రాన్ని పూర్తిచేసి తన మేనేజర్ నిర్మిస్తున్న లేడీ ఓరియన్‌టెడ్ చిత్రం నయకిలో నటిస్తున్నారు. మరో పక్క సుందర్.సి దర్శకత్వంలో అరణ్మణై-2 లోనూ నటిస్తున్నారు. కాగా నాయకి చిత్రం తనకు స్పెషల్ అంటున్న త్రిష ఆ చిత్రం కోసం కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. అందులో ఒకటి అందం. అందుకోసం ఈతను నమ్ముకున్నారట. ఇదేమిటి అందానికి మెరుగులు దిద్దుకోవడానికి స్విమ్మింగ్ ఒకట్టే సరిపోతుందా? అంటే ఈత కంటే మంచి ఎక్సర్సైజ్ ఏముంది? అంటూ దీర్గాలు తీశారు. ఇంకా ఈమె మాట్లాడుతూ ఏ మనిషి అయినా తొలి ప్రేమను మరిచి పోలేరన్నారు. అది మానవ ప్రేమో, లేక వస్తువులపై ప్రేమో, దుస్తులపై ప్రేమో కావచ్చునన్నారు. తన వరకూ చెప్పాలంటే తన తొలి ప్రేమ ఈతేనన్నారు. ఆరంభంలో నిత్యం స్విమ్ చేసే దానినని తెలిపారు. ఆ తరువాత నటనపై దృష్టి సారించడంతో ఈతకు దూరమయ్యానని అన్నారు. అలాంటిది ఇటీవల మళ్లీ స్విమ్మింగ్ చేయడం మొదలెట్టానని చెప్పారు. అందాన్ని కాపాడుకోవడానికి స్విమ్ కంటే బెటర్ వేరే లేదని త్రిష అన్నారు. -
నా భవిష్యత్తు దేవుడికే వదిలేశా
అనుభవాలు పెద్ద పాఠాలే నేర్పుతాయంటారు. చాలా కాలంగా పెళ్లిని దాటవేస్తూ వచ్చిన నటి త్రిష ఎట్టకేలకు ఆ మధ్య పెళ్లికి సిద్ధం అయ్యారు. నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్పాండియన్తో ఏడు అడుగులు నడవడానికి నిశ్చయం కూడా అయ్యింది. పెళ్లిపీటల మీద పెళ్లిల్లే ఆగిపోతున్నాయి. నిశ్చితార్థం ఒక లె క్కా అన్నంతగా నటి త్రిష, వరుణ్‌పాండియన్‌ల వివాహ నిశ్చితార్థం అక్కడితోనే ఆగిపోయింది. ఇక మాంగల్యం తంతునానానే తరువాయి. అనుకున్న త్రిష, వరుణ్‌పాండియన్‌ల పెళ్లి ఆగిపోవడానికి గురించి వరుణ్‌మణియన్ వర్గం ఇప్పటికీ నోరు విప్పకపోయినా త్రిష తల్లి మాత్రం ఇటీవల పెళ్లికొడుకు కుటుంబ సభ్యుల కారణంగానే పెళ్లిఆగిపోయిందని వివరించారు. త్రిష ఇన్నాళ్లకు ఈ విషయం గురించి తన మనసులోని మాటను బయటపడ్డారు. నా పెళ్లి నిలిచిపోయిన విషయం నిజమే. ఇది ఊహించని విషయమే మనల్ని దాటి ఒక విషయం జరిగినప్పుడు దాని ఒప్పుకుని తీరాల్సిందే. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే. గత విషయాల గురించి చర్చించినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక ముందు ఏమి జరగనుందనేదే వేచి చూడాలి. నా భవిష్యత్ ఏమిటన్నది భగవంతునికే వదిలేశా. నేను ఆ దేవుని బిడ్డను. ఆయన నన్ను బాగానే చూసుకుంటాడు. దైవ నిర్ణయం ఏమిటో దాన్ని నేను అనుసరిస్తాను. అంటూ ఆస్తికత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కమలహాసన్ సరసన ద్విభాషా చిత్రం తూంగావనం చిత్రంలో నటించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ చిత్రం తనకు 50వ చిత్రం కావాలని త్రిష ఆశపడుతున్నారు. ఈమె నటించిన 47 చిత్రాలు తెరపైకి వచ్చాయి. వాటిలో తమిళం, తెలుగు, కన్నడం, హిందీ చిత్రాలు ఉన్నాయట. ఒక్క మలయాళంలో మాత్రం నటించలేదు. త్రిష నటించిన భూలోకం, అప్పాటక్కర్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. రెండు చిత్రాల్లో ఏ చిత్రం విడుదలలో ఆలస్యం జరిగినా తదుపరి నటించనున్న అరణ్మణై -2గాని, తన మేనేజర్ నిర్మిస్తున్న చిత్రాన్ని విడుదలయ్యేలా చేసి తూంగావనం చిత్రాన్ని 50వ చిత్రం కావాలని త్రిష కోరుకుం టున్నారట.