తొలి ప్రేమ మరువలేనిది | my first love story Unforgettable says trisha | Sakshi
Sakshi News home page

తొలి ప్రేమ మరువలేనిది

Published Sun, Oct 18 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

తొలి ప్రేమ మరువలేనిది

తొలి ప్రేమ మరువలేనిది

ఎవరికయినా తొలి ప్రేమ మరువలేనిదని నటి త్రిష అంటున్నారు. ఒకటికి రెండు సార్లు ప్రేమలో ఓడిపోయిన ఈ భామ తొలి ప్రేమ గురించి మాట్లాడుతున్నారేంటని ఆశ్చర్యపోతున్నారా? మరి ఆమె చెప్పే తొలి ప్రేమ కహానీ ఏమిటో చూసేస్తే పోలా. వ్యాపార వేత్త వరుణ్‌మనియన్‌తో త్రిష ప్రేమ పెళ్లి పీటలు ఎక్కకపోయినా నటిగా అవకాశాలు మాత్రం బాగా పెరిగాయి. సో త్రిష ఆవిధంగా హ్యాపీ అన్నమాట. ప్రస్తుతం కమలహాసన్‌కు జంట గా నటిస్తున్న తూంగావనం చిత్రాన్ని పూర్తిచేసి తన మేనేజర్ నిర్మిస్తున్న లేడీ ఓరియన్‌టెడ్ చిత్రం నయకిలో నటిస్తున్నారు.
 
  మరో పక్క సుందర్.సి దర్శకత్వంలో అరణ్మణై-2 లోనూ నటిస్తున్నారు. కాగా నాయకి చిత్రం తనకు స్పెషల్ అంటున్న త్రిష ఆ చిత్రం కోసం కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. అందులో ఒకటి అందం. అందుకోసం ఈతను నమ్ముకున్నారట. ఇదేమిటి అందానికి మెరుగులు దిద్దుకోవడానికి స్విమ్మింగ్ ఒకట్టే సరిపోతుందా? అంటే ఈత కంటే మంచి ఎక్సర్‌సైజ్ ఏముంది? అంటూ దీర్గాలు తీశారు. ఇంకా ఈమె మాట్లాడుతూ ఏ మనిషి అయినా తొలి ప్రేమను మరిచి పోలేరన్నారు.
 
 అది మానవ ప్రేమో, లేక వస్తువులపై ప్రేమో, దుస్తులపై ప్రేమో కావచ్చునన్నారు. తన వరకూ చెప్పాలంటే తన తొలి ప్రేమ ఈతేనన్నారు. ఆరంభంలో నిత్యం స్విమ్ చేసే దానినని తెలిపారు. ఆ తరువాత నటనపై దృష్టి సారించడంతో ఈతకు దూరమయ్యానని అన్నారు. అలాంటిది ఇటీవల మళ్లీ స్విమ్మింగ్ చేయడం మొదలెట్టానని చెప్పారు. అందాన్ని కాపాడుకోవడానికి స్విమ్ కంటే బెటర్ వేరే లేదని త్రిష అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement