త్రిషకు దిల్ ఉందా? | Is Raai Laxmi taking a dig at Trisha? | Sakshi
Sakshi News home page

త్రిషకు దిల్ ఉందా?

Published Fri, Nov 21 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

త్రిషకు దిల్ ఉందా?

త్రిషకు దిల్ ఉందా?

 సంచలనాలకు కేంద్ర బిందువుగా పేరొందిన నటి రాయ్‌లక్ష్మి. ఈ భామకు దూకుడెక్కువ అని కోలీవుడ్ వర్గాలంటుంటాయి కూడా. చాలా కాలం తరువాత అరణ్మణై చిత్రంతో విజయాన్ని చూసిన రాయ్‌లక్ష్మి మరోసారి తన దూకుడును ప్రవర్తించారు. నటి త్రిష, నిర్మాత పారిశ్రామికవేత్త వరుణ్‌మణియన్ పెళ్లాడనున్నట్లు వీరి వివాహ నిశ్చితార్థం కూడా ఇటీవల త్రిష ఇంట్లో రహస్యంగా జరిగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే అది అసత్య ప్రచారం అంటూ త్రిష, ఆమె తల్లి ఉమా ఖండించడం తెలిసిందే.
 
 అయితే ఈ వ్యవహారంపై నటి రాయ్‌లక్ష్మి తన ట్విట్టర్‌లో కామెంట్ చేస్తూ త్రిషకు పరోక్షంగా చురకలు వేశారు. ఎవరికైనా నిజాన్ని అంగీకరించడానికి దిల్ ఉండాలన్నారు. అది లేని కొందరు జరిగిన నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ట్విట్టర్‌లో పోస్టు చేయడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. దీంతో త్రిష వివాహ నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమేననిపిస్తోంది. మరి రాయ్‌లక్ష్మి వ్యాఖ్యలకు త్రిష ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement