
వరుణ్‌కు థ్యాంక్స్
నిర్మాత వరుణ్‌మణియన్‌కు నటి త్రిష థ్యాంక్స్ చెప్పారు. దీంతో వీరిద్దరిపై మీడియా మరోసారి ఫోకస్ చేసింది. ఈ వరుణమణియన్ ఎవరో కాదు త్రిషను వివాహం చేసుకోబోతున్నారని నిశ్చితార్థం జరిగిందని ఇటీవల ప్రచారం హోరెత్తింది. ఆ వార్తలో వరుడే ఈ వరుణ్‌మణియన్. ఈ ప్రచారం జరిగిన తరువాత త్రిష ధనుష్ సరసన నటించే చిత్రం నుంచి, జయ్‌కు జంటగా నటించనున్న చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం త్రిషకు కొత్త చిత్రాలేమీ చేతిలో లేవు. జయంరవితో నటించిన భూలోకం, అజిత్‌తో రొమాన్స్ చేసిన ఎన్నైఅరిందాల్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. తెలుగులో బాలకృష్ణ సరసన నటిస్తున్న చిత్రంతోపాటు రమ్ అనే మరో చిత్రం మాత్రం ఉన్నాయి. దీంతో త్రిష తన నిశ్చితార్థం వార్తను ఎంతగా ఖండించినా ఫలితం లేదు.
ఇందుకు బలమైన కారణం లేకపోలేదు. వరుణ్‌మణియన్ సమర్పణలో దర్శకుడు వసంతబాలన్ దర్శకత్వం వహించిన చిత్రం తలైవన్. సిద్ధార్థ్, వేదిక తదితరులు నటించిన చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం గురించి త్రిష తన ట్విట్టర్‌లో పేర్కొంటూ చిత్ర యూనిట్ నైపుణ్యానికి నిదర్శనం కావ్యతలైవన్. చాలా మంచి ప్రయత్నం. సినీ ప్రియులు తప్పక చూడవలసిన చిత్రం. ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన వరుణ్‌మణియన్‌కు ధన్యవాదాలు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. చిత్ర దర్శకుడి గురించి మాత్రం ఒక్క మాట పేర్కొనకపోవడం త్రిషకు వరుణ్‌మణియన్‌కు మధ్య వున్న సాన్నిహిత్యాన్ని తెలియచేస్తోందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.