
హీరోయిన్ త్రిష
ఏకాంతాన్ని కోరుకుంటానని అంటోంది చెన్నై చిన్నది త్రిష. గతంలో ప్రేమ, పెళ్లి అనే రూమర్స్ ఈ అమ్మడిపై చాలా ప్రచారమయ్యాయి. నిర్మాత వరుణ్‌మణియన్‌తో పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిన ప్రేమ వ్యవహారం. అయితే వ్యక్తిగత సంఘటలేమీ త్రిష నట కేరీర్‌పై ప్రభావం చూపలేదు. మూడు పదుల వయసును అధిగమించిన ఈ బ్యూటీ నటిగా దశాబ్దంన్నర దాటేసింది. అయినా హీరోయిన్‌గా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వాటిలో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు ఉండడం విశేషమే.
ఈ సందర్భంగా స్నేహితులు, మనస్తాపం వంటి విషయాల గురించి త్రిష ఒక భేటీలో పేర్కొంటూ.. జీవితంలో అనునిత్యం చాలా మందిని కలుసుకుంటుంటాం. ‘నా ఎదురుగా వచ్చే చాలా మంది చెయ్యి పైకి ఎత్తి హాయ్ అంటూ పలకరిస్తుంటారు. వారిలో కొంతమందితో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారిలో కొందరు స్నేహితులుగా మారతారు. అయితే ఎంత స్నేహితులైనా వ్యక్తిగత విషయాలన్నీ వారితో పంచుకోలేం.
అందుకే ప్రతి రోజు ఒకసారి మనకు మనమే హలో చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు మనమే స్నేహితులం. అదే విధంగా ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నా వరకూ ఏదైనా మనస్తాపం కలిగినప్పుడు ఏకాంతం కోరుకుంటాను. ఆ సమయంలో అసలు ఎందుకు సమస్య వచ్చింది? అని నన్ను నేనే ఆత్మపరిశీలన చేసుకుంటాను. ప్రేమాభిమానాలు కురిపించే కుటుంబం, మంచి స్నేహితులు ఉండవచ్చు. అయితే నాకు నేనే అండ అని అంటోంది’ హీరోయిన్ త్రిష.
Comments
Please login to add a commentAdd a comment