Heroine oriented film
-
ఆగస్టు 15న తెరపైకి కీర్తి సురేష్ రఘుతాత
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్ కథానాయకిగా పరిచయమైన కొద్ది కాలంలోనే మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రకు ప్రాణం పోసి జాతీయ అవార్డును గెలుచుకున్న నటి ఈమె. తెలుగు తమిళం భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటిస్తున్న కీర్తి సురేష్ మరోపక్క ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లోను నటిస్తూ రాణిస్తుండటం విశేషం. అలా తాజాగా ఈమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం రఘుతాత. రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోం భలే ఫిలిమ్స్ పతాకంపై సుమన్ కుమార్ దర్శకత్వంలో విజయ్ కిరకిందర్ నిర్మిస్తున్నారు. శ్యాన్ రోల్డన్ సంగీతం, యామిని జ్ఞానమూర్తి చాయగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ ఇది హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెత్తిస్తున్న కథాచిత్రం అనే ప్రచారం జరుగుతోందని అది వాస్తవం కాదని హిందీ భాషపై ఒత్తిడిని వ్యతిరేకిస్తూ రూపొందించిన వినోదంతో కూడిన కుటుంబ కాథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అనంతరం నటి కీర్తి సురేష్ మీడియాతో ముచ్చటిస్తూ దర్శకుడు చెప్పిన కథ విన్న తర్వాత ఈ చిత్రానికి తాను న్యాయం చేయగలనా? అనే సందేహం కలిగిందన్నారు. అయితే దర్శకుడు ఇచ్చిన ధైర్యంతో ఇందులో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. దర్శకుడు చెప్పినట్లు ఇది హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా రఘుతాత ఉంటుందన్నారు. తాను చదివింది కేంద్ర విద్యాలయం పాఠశాలలో అని, అక్కడ కూడా ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం భాషల్లో మాత్రమే బోధనలు ఉండేవని చెప్పారు. కాగా తాను మహానటి చిత్రం తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆ తర్వాత యోగ వంటివి చేయడంతో ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు రాజకీయాల్లోకి రావచ్చు, రాకపోవచ్చు అంటూ తెలివిగా బదులిచ్చారు. అలాగే ప్రేమ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం గురించి స్పందిస్తూ పెళ్లి కాదు కానీ ఒక విషయం మాత్రం జరుగుతోందని, దాని గురించి త్వరలోనే వెల్లడిస్తానని నటి కీర్తి సురేష్ పేర్కొన్నారు. -
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నయన
లేడీ సూపర్‌స్టార్ నయనతార చిత్రం అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దర్బార్, బిగిల్ చిత్రాల సక్సెస్‌తో తన క్రేజ్‌ను ఇంకా పెంచుకుంది. మరోసారి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో అన్నాత్తా చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా కథానాయకికి ప్రాముఖ్యత కలిగిన మూక్కుత్తి అమ్మన్ అనే భక్తిరస కథా చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కాగా తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ను నిర్మాతగా రౌడీ పిక్చర్స్ పతాకంపై వెట్రికన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం కావడం విశేషం. సాధారణంగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో హీరోయిన్లకు సపోర్టింగ్ ఒక హీరో ఉంటుంటాడు. అలా మాయ చిత్రంలో నయనతారతో నటుడు ఆరి నటించారు. అదేవిధంగా ఈ నెట్రికన్ చిత్రంలోనూ అజ్మల్ నటిస్తున్నాడు. అంజాదే, కో, ఇరవుక్కు ఆయిరం కన్గళ్ వంటి చిత్రాల్లో తనదైన స్టైల్లో నటించి మెప్పించారు. అంతే కాదు తెలుగులోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా రాణిస్తున్నాడు. కాగా అజ్మల్ ఇప్పుడు నయనతారతో కలిసి నెట్రికన్ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించారు. ఈ చిత్రంలో అజ్మల్ పాత్ర కథను మలుపు తిప్పే చాలా కీలకంగా ఉంటుందట. సస్పెన్స్, థ్రిల్లర్‌తో కూడిన మిస్టరీ కథాంశంతో కూడిన చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం నెట్రికన్. అవళ్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు మిలింద్‌రావ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయ్యిందని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా దీనికి గిరీశ్ సంగీతాన్ని, కార్తీక్ గణేశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నవీన్ సుందరమూర్తి మాటలను అందిస్తున్న ఈ చిత్రానికి కుబేద్రన్. వీకే సహ నిర్మాతగానూ, జీ.మురుగభూపతి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవడంతో నయనతార త్వరలో ఆమె ప్రియుడు విఘ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించనున్న కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే ముక్కోణపు ప్రేమ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతుందన్నమాట. విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్న ఇందులో సమంత మరో నాయకిగా నటించనుంది. -
ఏకాంతం కోరుకుంటా..
ఏకాంతాన్ని కోరుకుంటానని అంటోంది చెన్నై చిన్నది త్రిష. గతంలో ప్రేమ, పెళ్లి అనే రూమర్స్ ఈ అమ్మడిపై చాలా ప్రచారమయ్యాయి. నిర్మాత వరుణ్‌మణియన్‌తో పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిన ప్రేమ వ్యవహారం. అయితే వ్యక్తిగత సంఘటలేమీ త్రిష నట కేరీర్‌పై ప్రభావం చూపలేదు. మూడు పదుల వయసును అధిగమించిన ఈ బ్యూటీ నటిగా దశాబ్దంన్నర దాటేసింది. అయినా హీరోయిన్గా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వాటిలో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు ఉండడం విశేషమే. ఈ సందర్భంగా స్నేహితులు, మనస్తాపం వంటి విషయాల గురించి త్రిష ఒక భేటీలో పేర్కొంటూ.. జీవితంలో అనునిత్యం చాలా మందిని కలుసుకుంటుంటాం. ‘నా ఎదురుగా వచ్చే చాలా మంది చెయ్యి పైకి ఎత్తి హాయ్ అంటూ పలకరిస్తుంటారు. వారిలో కొంతమందితో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారిలో కొందరు స్నేహితులుగా మారతారు. అయితే ఎంత స్నేహితులైనా వ్యక్తిగత విషయాలన్నీ వారితో పంచుకోలేం. అందుకే ప్రతి రోజు ఒకసారి మనకు మనమే హలో చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు మనమే స్నేహితులం. అదే విధంగా ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నా వరకూ ఏదైనా మనస్తాపం కలిగినప్పుడు ఏకాంతం కోరుకుంటాను. ఆ సమయంలో అసలు ఎందుకు సమస్య వచ్చింది? అని నన్ను నేనే ఆత్మపరిశీలన చేసుకుంటాను. ప్రేమాభిమానాలు కురిపించే కుటుంబం, మంచి స్నేహితులు ఉండవచ్చు. అయితే నాకు నేనే అండ అని అంటోంది’ హీరోయిన్ త్రిష. -
అవును పురుషాధిక్యమే!
తమిళసినిమా: అవును ఇక్కడ పురుషాధిక్యమే కొనసాగుతోందని నటి శ్రియ వక్కాణించారు. సినీ పరిశ్రమలో పురుషాధిక్యంపై కొందరు కథానాయికలు అప్పుడప్పుడూ గొంతెత్తుతుంటారు. అయితే వారిలో బిజీ హీరోయిన్ల కంటే సీనియర్ హీరోయిన్లే తన అనుభవంలో భాగంగా పురుషాధిక్యంపై తమ అక్కసును వెళగక్కుతుంటారు. అలాంటి వారిలో నటి శ్రియ చేరారు. గత దశాబ్దంన్నరగా దక్షిణాదిలో నటిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీ ఇటీవల రష్యాకు చెందిన బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా, చాలా సింపుల్‌గా పెళ్లి చేసేసుకున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో, అప్పుడప్పుడూ హిందీలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామకు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. అదే విధంగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు ఒకటి రెండు చేసినా అవి పెద్దగా సక్సెస్ అవకపోవంతో ఆవిధంగా శ్రియ రాణించలేకపోయారు. ఇకపోతే కోలీవుడ్‌లో శింబుతో నటించిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం తరువాత ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. అరవింద్‌స్వామికి ప్రతినాయకిగా నటించిన నరకాసురన్ చిత్రం ఒక్కటే విడుదల కావలసి ఉంది. ఇక తెలుగులోనూ అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వాలని భావించిన శ్రియ పెళ్లి చేసుకున్నారు. అనంతరం రష్యాలో సెటిల్ అవనున్నట్లు ప్రచారం జరిగినా మళ్లీ నటించడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో ఒక చిత్రం కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చారు. సమీప కాలంలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రియ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఒక చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. తనకు ఇప్పటికి చాలా అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అయితే కథలు నచ్చకపోవడం నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అన్ని చిత్రాల్లోనూ పురుషాధిక్యం ఎక్కువ అని అన్నారు. కథానాయిక పాత్రల పరిధి తక్కువగానే ఉంటుందని, అదీ చిత్రం పూర్తి అయ్యేసరికి ఇంకా తగ్గిపోతోందని ఆరోపించారు. మరో విషయం ఏమిటంటే తనకు తమిళంలో కంటే తెలుగులోనే మంచి కథా పాత్రలు లభిస్తున్నాయని శ్రియ పేర్కొన్నారు. -
‘హీరో’యిన్
భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎంత కామనో.. తెలుగు సినిమా హీరోల చుట్టూ తిరగడం అంతే కామన్. కానీ ఈ ఫార్ములాను బ్రేక్ చేసిన తారలు కూడా మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. హీరోల చుట్టూ పరిగెడుతున్న కథా కథనాలు ఒక్క సినిమాతో తమవైపుకు తిప్పుకొని చూపించారు కొంత మంది తారలు. అలాంటి మహిళామణులు మనకు ప్రతి జనరేషన్‌లోనూ కనిపిస్తారు. ఎప్పుడూ కథానాయకుల చుట్టూ తిరిగే తెలుగు సినిమా కథ అప్పుడప్పుడు హీరోయిన్ల వైపు కూడా తిరుగుతుంది. కమర్షియల్ సినిమాలో హీరోయిన్ అంటే నాలుగు పాటలు, మరో నాలుగు సీన్స్‌కు మాత్రమే అంటూ అంటూ ఫిక్స్ అయిపోయిన రైటర్లు హీరోయిన్‌కి హీరో రేంజ్ కాన్వాసు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం హీరోతో ఆడి పాడే హీరోయిన్లు తామే లీడ్ రోల్స్‌గా మారి కథ నడిపిస్తే.. ఆ ఆలోచనతో సినిమాలు తెరకెక్కించిన దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. హీరోయిన్లకు హీరోయిజం చూపించే ట్రెండ్ కొత్తగా వచ్చిందేం కాదు.. సినిమా పుట్టిన దగ్గరనుంచి ఈ ట్రెండ్ ఉంది. భానుమతి, అంజలీ దేవిల నుంచి సూర్యకాంతం లాంటి నటీమణుల వరకు ఎందరో.. ఎన్నో అద్భుత చిత్రాల్లో లీడ్ రోల్స్ లో నటించారు. ఆయా సినిమాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటి భానుమతి. మల్టీ టాలెంటెడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ మహానటి ఎన్నో అద్భుత చిత్రాల్లో అంతా తానే అయి సినిమాలను విజయతీరాలకు చేర్చారు. భానుమతి తరువాత అదే స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మరోనటి సూర్యకాంతం. హీరోయిన్ క్యారెక్టర్ చేయకపోయిన సినిమా అంతా తన చూట్టూ నడిచే ఎన్నో సినిమాలతో లేడీ క్యారెక్టర్‌కు హీరోయిజాన్ని ఆపాదించింది. అలాంటి ఓ సూపర్ హిట్ చిత్రమే గుండమ్మ కథ. కలర్ సినిమాలు వెండితెర మీదకు వస్తున్న రోజుల్లో కూడా ఎంతో మంది హీరోయిన్లు లేడిఓరియంటెడ్ సినిమాలతో వెండితెరకు కొత్త అందాలను తీసుకువచ్చారు. అందం అభినయంతో పాటు కాస్త డైనమిజాన్ని కూడా చూపించారు. అందాల తారలుగా పేరు తెచ్చుకున్న జయప్రద, శారద, భానుప్రియ, జయసుధ లాంటి వారు కూడా లేడీ ఓరియంటెండ్ సినిమాలతో మెప్పించారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా తన అందంతో భారతీయ సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన శ్రీదేవి కూడా అప్పుడప్పుడు గ్లామర్ ఇమేజ్ను పక్కన పెట్టి ఛాలెంజింగ్ రోల్స్‌తో సత్తా చాటింది. కెరీర్ తొలినాళ్లలోనే పదహరేళ్ల వయసు, వసంత కోకిల లాంటి విభిన్న చిత్రాలతో అలరించారు. హీరోయిన్ అంటే హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించిన మరో నటి విజయశాంతి. చాలా కాలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన విజయశాంతి, తరువాత లేడీ ఓరియంటెండ్ సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రతిఘటన, భారతనారి, కర్తవ్యం, రేపటి పౌరులు, ఒసెయ్ రాములమ్మ లాంటి సినిమాలు ఘనవిజయం సాధించటంతో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఈ జనరేషన్ లోనూ లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసిన నటీమణులకు కొదవేం లేదు. అనుష్క, నయనతార లాంటి తారలు యాక్షన్, థ్రిల్లర్ తరహా సినిమాలతో లేడీ ఓరియంటెండ్ సినిమాల హవాను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా అప్పుడప్పుడు మహిళలకు పెద్ద పీట వేస్తూ సినిమాలు రూపొందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. -
మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నయన
తమిళసినిమా: నటి నయనతార మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. మాయ చిత్రంతో నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకున్న నటి నయనతార. అప్పటి వరకూ కమర్శియల్ చిత్రాల నాయకిగా రాణించిన ఈ సంచలన నటి మాయ చిత్రంతో చిత్ర కథను తన భుజాన వేసుకుని విజయ తీరానికి చేర్చే స్థాయికి చేరారు. ఆ తరువాత నటించిన డోరా చిత్రం నిరాశపరచినా, నయనతారకు దాని ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదు. ప్రేమ వివాదాల్లో ఒడుదుడుకులను ఎలాగైతే వాటిని అధిగమించారో, నటిగానూ అపజయాలను దాటి విజయాల బాట పట్టారు. ప్రస్తుతం అరమ్, కొలైయుధీర్ కాలం, ఇమైకా నోడిగళ్, నేర్‌వళి వంటి హీరోయిన్ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు మరోపక్క హీరోలతో కమర్షియల్ చిత్రాలను నటిస్తూ తెగ బిజీగా ఉన్నారు. ఈ శుక్రవారం శివకార్తికేయన్‌తో జత కట్టిన వేలైక్కారన్ చిత్రం విడుదల కావలసి ఉన్నా, నిర్మాణ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో ఆ చిత్రం వెనక్కు వెళ్లింది. అయితే త్వరలో ఇమైకా నోడిగళ్, ఆరమ్ చిత్రాలు తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఇకపోతే తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న నయనతార తాజాగా మరో హీరోయిన్ సెంట్రిక్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. కుట్రం 23 వంటి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన అరివళగన్ దర్శకత్వంలో నయనతార నటించనున్నారన్నది తాజా సమాచారం. ఇందులో సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రను పోషించనున్నారట. ఈ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిసింది. అయితే చిత్ర వివరాలను త్వరలోనే అధికారికపూర్వకంగా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.