హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో నయన | Ajmal Will Be Seen In A Film With Nayanthara | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో నయన

Published Wed, Mar 18 2020 8:08 AM | Last Updated on Wed, Mar 18 2020 8:30 AM

Ajmal Will Be Seen In A Film With Nayanthara - Sakshi

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార చిత్రం అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దర్బార్, బిగిల్‌ చిత్రాల సక్సెస్‌తో తన క్రేజ్‌ను ఇంకా పెంచుకుంది. మరోసారి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో అన్నాత్తా చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా కథానాయకికి ప్రాముఖ్యత కలిగిన మూక్కుత్తి అమ్మన్‌ అనే భక్తిరస కథా చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కాగా తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ను నిర్మాతగా రౌడీ పిక్చర్స్‌ పతాకంపై వెట్రికన్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం కావడం విశేషం.

సాధారణంగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లో హీరోయిన్లకు సపోర్టింగ్‌ ఒక హీరో ఉంటుంటాడు. అలా మాయ చిత్రంలో నయనతారతో నటుడు ఆరి నటించారు. అదేవిధంగా ఈ నెట్రికన్‌ చిత్రంలోనూ అజ్మల్‌ నటిస్తున్నాడు. అంజాదే, కో, ఇరవుక్కు ఆయిరం కన్గళ్‌ వంటి చిత్రాల్లో తనదైన స్టైల్‌లో నటించి మెప్పించారు. అంతే కాదు తెలుగులోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా రాణిస్తున్నాడు. కాగా అజ్మల్‌ ఇప్పుడు నయనతారతో కలిసి నెట్రికన్‌ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించారు. ఈ చిత్రంలో అజ్మల్‌ పాత్ర కథను మలుపు తిప్పే చాలా కీలకంగా ఉంటుందట. సస్పెన్స్, థ్రిల్లర్‌తో కూడిన మిస్టరీ కథాంశంతో కూడిన చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం నెట్రికన్‌.

అవళ్‌ వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే 80 శాతం పూర్తి అయ్యిందని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా దీనికి గిరీశ్‌ సంగీతాన్ని, కార్తీక్‌ గణేశ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నవీన్‌ సుందరమూర్తి మాటలను అందిస్తున్న ఈ చిత్రానికి కుబేద్రన్‌. వీకే సహ నిర్మాతగానూ, జీ.మురుగభూపతి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకోవడంతో నయనతార త్వరలో ఆమె ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వం వహించనున్న కాత్తు వాక్కుల రెండు కాదల్‌ అనే ముక్కోణపు ప్రేమ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతుందన్నమాట. విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్న ఇందులో సమంత మరో నాయకిగా నటించనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement