
జయ్ హీరోగా వరుణ్‌మణియన్ చిత్రం
త్రిష, వరుణ్‌మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో పెళ్లి తంతు కూడా జరగనుంది. కాబట్టి వారు వధూవరుల కిందే లెక్క. ఇకపోతే వరుణ్‌మణియన్ ఇంతకుముందు వాయై మూడి పేసవుం, కావ్యతలైవన్ మొదలగు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా నటుడు జయ్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తన రేడియన్ మీడియా సంస్థ సుశాంత్ ప్రసాద్, గోవిందరాజ్‌ల ఫిలిం డిపార్టుమెంట్ సంస్థ కలిసి నిర్మించనున్నాయి. నాన్‌సిగప్పు మనిదన్ చిత్రం ఫేమ్ తిరు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తొలుత త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది.
ఆ తరువాత ఆమె వివాహానికి సిద్ధమవడంతో చిత్రం నుంచి వైదొలిగినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఏదైమైనా చిత్ర హీరోయిన్ ఎంపిక జరుగుతోందని చెబుతున్న చిత్ర దర్శకుడు ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం మార్చిలో సెట్‌పైకి రానుందని తెలిపారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణాన్ని అందించనున్న ఈ చిత్ర షూటింగ్‌ను చెన్నై, కుంభకోణం నేపథ్యం ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జయ్, సంగీత దర్శకుడు తమన్‌ల కలయికలో రూపొందించనున్న ఈ చిత్రం తన కెరీర్‌కు చాలా ముఖ్యమైందని దర్శకుడు తిరు అన్నారు.