
దర్శకుడు సుందర్ సి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పట్టాం పూచ్చి. ఇందులో ప్రతి నాయకుడిగా జయ్ నటించడం విశేషం. ఈ క్రేజీ చిత్రాన్ని అవ్నీ టెలీ మీడియా పతాకంపై నటి కుష్భు సుందర్ నిర్మిస్తున్నారు. నటి హనీరోస్, ఇమాన్ అన్నాచ్చి, బేబీ మనస్వి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బద్రి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
కృష్ణస్వామి చాయాగ్రహణను, నవనీత్ సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం గీత రచయిత ముకుందన్ రామన్ రాసిన పట్టాం పూచ్చి అనే పల్లవితో సాగే తొలి పాటను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేశారు. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ..1980లో జరిగే సైకో థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. తాజాగా విడుదల చేసిన పట్టాం పూచ్చి పాటకు మంచి ఆదర ణ లభిస్తోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment