సౌత్ ఇండియా హాట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది నమిత. తాజాగా ఆమె భర్త వీరేంద్ర చౌదరి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. 2017లో తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వ్యాపారవేత్తగ కొనసాగుతున్న వీరేంద్ర దాదాపు 41 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు తమిళనాడు సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
(ఇదీ చదవండి: మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ కామెంట్లు)
2016లో తిరుచ్చిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కలుసుకుని అన్నాడీఎంకేలో చేరారు నమిత. 2017లో వీరేంద్ర చౌదరిని ఆమె పెళ్లి చేసుకున్నారు. జయలలిత మరణానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై 2019లో ఆమె బీజేపీలో చేరారు.పార్టీలో చేరిన 8 నెలల్లోనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. అలా ఈ ఏడాదిలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఇప్పుడు నమిత రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ తరపున జోరుగా తమిళనాడులో ప్రచారం చేస్తోంది.
అదే సమయంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ స్థితిలో నమిత భర్త మోసం కేసులో ఇరుక్కున్నాడు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ ( MSME) ప్రమోషన్ కౌన్సిల్, తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్‌లు రూ.41 లక్షలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని సేలంకు చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ కేసులో ముత్తురామన్, దుష్యంత్ యాదవ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదే MSME లో తమిళనాడుకు అధ్యక్షుడిగా ఉన్న నమిత భర్తను కూడా విచారించాలని పోలీసులు భావించారు. ఈమేరకు విచారణకు హాజరుకావాలని నమిత భర్తకు కూడా సమన్లు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆయన కనిపించకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతారనే వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment