త్రిషకు అదే పెద్ద కానుక | Trisha Boyfriend discloses Engagement Gift | Sakshi
Sakshi News home page

త్రిషకు అదే పెద్ద కానుక

Published Thu, Jan 22 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

త్రిషకు అదే పెద్ద కానుక

త్రిషకు అదే పెద్ద కానుక

  త్రిషకు అదే పెద్ద కానుక అంటున్నారు ఆమెకు కాబోయే జీవిత భాగస్వామి వరుణ్ మణియన్. ఇపుడు కోలీవుడ్‌లో చర్చ అంతా త్రిష గురించే సాగుతోంది. ఎందుకంటే ఆమెకు పెళ్లి కళ వచ్చేసింది. యువ నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్‌మణియన్, త్రిష పెళ్లిపీటలెక్కుతున్న విషయం తెలిసిందే. వరుణ్, త్రిష వివాహ నిశ్చితార్థం రేపు నగరంలో ఒకనక్షత్ర హోటల్లో జరగనుంది.
 
 ఈ వేడుకకు ఇరువర్గాల కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారని కాబోయే వధూవరులు ఇప్పటికే వెల్లడించారు. 24న సినీ ప్రముఖులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు. వివాహం చేసుకోనున్న నేపథ్యంలో త్రిష నటనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. ఈమె నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం ఈ నెల 29న తెరపైకి రానుంది. ప్రస్తుతం త్రిష వివాహ వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ తమ నిశ్చితార్థం కుటుంబ వేడుకగా జరుపుకోనున్నట్లు తెలిపారు. దీనికి తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన అతి కొద్దిమంది ప్రముఖులనే ఆహ్వానించినట్లు వెల్లడించారు.
 
 తన నిశ్చితార్థం వేడుకకు చీరలను తాను అంబాసిడర్‌గా పని చేసిన సంస్థల్లోనే కొనుగోలు చేసినట్టు తెలిపారు. వరుణ్‌మణియన్ తనకు కాబోయే భార్య త్రిషకు వజ్రపుటుంగరాన్ని ముంబయి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి కానుకగా అందించారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు రోల్స్‌రాయ్స్ కంపెనీకి చెందిన అత్యాధునిక కారును కూడా బహుమతిగా అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి వరుణ్‌మణియన్ స్పందిస్తూ తమ నిశ్చితార్థాన్ని పురస్కరించుకుని వేలాది మూగజీవులకు ఆహారం వసతి, వైద్య సేవలు లాంటివి అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని కానుకలకంటే ఇదే త్రిషకు పెద్ద బహుమతి అవుతుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement