
త్రిష కాబోయే భర్తకు హత్యాబెదిరింపులు
నటి త్రిష కాబోయే భర్తకు హత్యాబెదిరింపులు రావడంతో ఆమె భయాందోళనలకు గురవుతున్నారు. త్రిష, వరుణ్‌మణియన్‌ల నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వరుణ్ మణియన్ ప్రముఖ వ్యాపారవేత్త. సినీ నిర్మాత. ఈ ప్రేమ జంట వివాహ నిశ్చితార్థం జరిగిన తరువాత వరుణ్‌మణియన్‌ను త్వరలో జరగనున్న ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును కొనుగోలు చేయమని త్రిష కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని వరున్‌మణియన్ కొట్టిపారేశారు. ఇలాం టి పరిస్థితిలో ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తే అంతు చూస్తామని ఆయనకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయట. దీంతో వరుణ్‌మణియన్ ఆదివారం స్థానిక తేనాంపేటలో గల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను బెదిరిస్తున్న ఆగంతులెవరో తెలుసుకుని వారిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.