
అంతర్జాతీయ క్రికెట్‌లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మార్క్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు, సెంచరీ బాదినప్పుడు ఎవరైనా సంబరాలు చేసుకుంటుంటారు. కానీ, పుష్ప సినిమా విడుదల తర్వాత ట్రెండ్ మారిపోయింది. భారత క్రికెటర్స్‌తో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు సైతం పుష్ప మార్క్ స్టైల్‌లో 'తగ్గేదేలే' అంటూ బన్నీని అనుకరించడం చూశాం. తాజాగా పుష్ప2 విడుదలైంది. మార్చి 22నుంచి ఐపీఎల్-2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక వీడియోను పంచుకుంది. అందులో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 'పుష్ప' గాడి రూల్ సీన్‌ను రీక్రియేట్ చేశారు. సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్‌ను వారు రీక్రియేట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతుంది.
కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో పుష్ప ట్రెండ్ మార్క్ తప్పకుండా కనిపిస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా దగ్గర కావడంతో ఈసారి స్టేడియంలో పుష్పరాజ్ గెటప్‌లో చాలామంది కనిపిస్తారు. క్రికెటర్స్ వికెట్ తీసినా, సెంచరీ కొట్టినా 'తగ్గేదేలే' అంటూ ఫోజులు ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జడేజా విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే పుష్ప స్టైల్లో తన బ్రాండ్‌ను చూపించాడు. ఆ విజువల్ నెట్టింట భారీగా వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా జడేజాతో పుష్ప బీజీఎమ్‌తో ఒక సీన్ రీక్రియేట్ చేసి సోషల్‌మీడియాలో పంచుకుంది. వైల్డ్‌ఫైర్ అంటూ తమ డెన్ పూర్తి సిద్ధంగా ఉందంటూ ఐపీఎల్ 2025 కప్ కోసం ఛాలెంజ్ విసిరింది.
క్రికెట్‌లో పుష్ప మార్క్
క్రికెట్ స్టేడియంలో బ్యాటింగ్‌కు దిగాడంటే రెచ్చిపోయే ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సైతం పుష్పగాడికి అభిమాని అయిపోయాడు. పలుమార్లు 'తగ్గేదేలే' అంటూ బన్నీ అభిమానులను మెప్పించాడు. రీసెంట్‌గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా పుష్ప మార్క్ చూపించాడు. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై శతకంతో అలరించిన ఆయన అర్ధశతకం నమోదు చేయగానే ‘పుష్ప’ స్టైల్‌లో నితీశ్ స్వాగ్ చూపించాడు. దీంతో స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డీజే బ్రావో, పాండ్యా,నజ్ముల్ ఇస్లాం,శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ ఇలా ఎందరో పుష్పగాడి స్వాగ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment