క్వీన్‌ ఐశ్వర్య ‘ఐకానిక్‌ లెహంగా' ఆస్కార్ మ్యూజియానికి | Aishwarya Rai's Iconic Look In Red Lehenga From Jodhaa Akbar To Oscars Academy's Museum | Sakshi
Sakshi News home page

క్వీన్‌ ఐశ్వర్య ‘ఐకానిక్‌ లెహంగా' ఆస్కార్ మ్యూజియానికి

Published Wed, Dec 25 2024 3:36 PM | Last Updated on Wed, Dec 25 2024 3:48 PM

Aishwarya Rai's Iconic Look In Red Lehenga From Jodhaa Akbar To Oscars Academy's Museum

అద్భుతమైన ఒక డిజైనర్‌ లెహంగా  మరో అద్భుతాన్ని సాధించడం ఎక్కడైనా విన్నారా? నీతా లుల్లా  రూపొందించిన లెహంగా అలాంటి ప్రత్యేకతను సంతరించుకుంది. బాలీవుడ్ జోధా అక్బర్‌ మూవీలో, స్టార్  హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ (Aishwarya Rai) పాత్ర కోసం నీతా లుల్లా డిజైన్‌ చేశారు.   దీన్ని ఇపుడు ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా చూడగలిగేలా ప్రతిష్టాత్మక ఆస్కార్‌ మ్యూజియంలో కొలువు దీరింది. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్‌  ద్వారా వెల్లడించింది. 

ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) అకాడమీ మ్యూజియం కలర్ ఇన్ మోషన్ ఎగ్జిబిషన్‌లో సినిమాలో క్వీన్‌ ఐశ్వర్య ధరించిన దుస్తులే కాకుండా ఆమె ఆభరణాలు కూడా బొమ్మపై రూపొందించారు. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్‌  ద్వారా వెల్లడించింది.దీంతో ఈ లెహెంగాను రూపొందించిన నీతా లుల్లా నైపుణ్యం పై పలువురు ప్రశంసలు  కురిపిస్తున్నారు.

 >
ఐకానిక్ రెడ్ లెహెంగా,నగల విశేషాలివే
జర్దోజీ ఎంబ్రాయిడరీ , శతాబ్దాల నాటి హస్తకళా నైపుణ్యం ఈ  లెహెంగాలో దాగి ఉంది. ఇదే విషయాన్ని అకాడమీ తన పోస్ట్‌లో  పేర్కొంటూ,  ప్రశంసింయింది. నటి ధరించిన ఆభరణాలు మరింత ఆకర్షణగా ఉన్నాయి.  ఆమె ధరించిన నెక్లెస్‌ మధ్యలో నీలం రాళ్లతో భారతదేశ జాతీయ పక్షి  నెమలి మరో ఎట్రాక్షన్‌.

జోధా అక్బర్‌  (Jodha Akbar) "రాణికి సరిపోయే లెహంగా, వెండితెరపై ఎంతోమందిని ఆకర్షించింది ఇకపై  ఆస్కార్‌ మ్యూజియంలో కొలువు దీరనుంది అని అకాడమీ తెలిపింది. 

కాగా 2008లో అశుతోష్‌ గోవార్కర్‌ దర్శకత్వంలో  వచ్చి సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘జోధా అక్బర్‌’.  ఐశ్వర్య  'జోధా బాయి'  పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది.   ఈ మూవీలో హీరోగా హృతిక్ రోషన్ నటించారు. వీరి రాయల్‌ లుక్‌కోసం రాజస్తానీ, మొఘల సంస్కృతుల మేళవింపుతో  అసలు సిసలు  బంగారం, విలువైన రాళ్లతో మొత్తం 400 కిలోల ఆభరణాలను తయారు చేయించారన. ఇందులో 200 కిలోల  ఐశ్వర్య ప్రాతకోసం. ఈ మొత్తం ఆభరణాల తయారీకి 70 మంది కళాకారులు రెండేళ్ల పాటు శ్రమించారని  చెబుతారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement