Ashutosh Gowariker
-
కర్రమ్ కుర్రమ్
కర్రమ్ కుర్రమ్ అనగానే అప్పడాలు గుర్తుకు రాకమానవు. ‘లిజ్జత్ పాపడ్’ అనే పాపులర్ అప్పడాల చైన్ గుర్తుకు రాకుండానూ ఉండదు. కొంతమంది మహిళలు కలసి స్వయం ఉపాధిలో భాగంగా ఏర్పాటు చేసిన చైన్ ఇది. ఈ కథను సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకురాబోతున్నారు ప్రముఖ దర్శకులు అశుతోష్ గోవారీకర్. ‘లగాన్, స్వదేశ్’ వంటి సినిమాలు తెరకెక్కించిన ఆయన ప్రస్తుతం ఈ లిజ్జత్ పాపడ్ కథతో సినిమా నిర్మించనున్నారు. ‘కర్రమ్ కుర్రమ్’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కియారా అద్వానీ లీడ్ రోల్లో నటించనున్నారు. ఈ సినిమాలో అప్పడాలు తయారు చేసే అమ్మాయి పాత్రలో కియారా కనిపిస్తారు. గ్లెన్ బరెట్టో, అన్కుష్ మొహ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘పానీపట్’ను చుట్టుముట్టిన వివాదం
జైపూర్ : బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ రూపొందించిన చారిత్రక చిత్రం పానీపట్‌ను ఓ వివాదం చుట్టుముట్టుంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో మహారాజా సూరజ్మాల్ పాత్రను తప్పుగా చిత్రీకరించారని రాజస్తాన్‌లో జాట్లు ఆందోళన చేపట్టారు. అలాగే రాజస్తాన్ మంత్రి పర్యాటకశాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ కూడా ఈ చిత్రంలోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించారని ఆయన విమర్శించారు. ఉత్తర భారతంలో పానీపట్ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చిత్ర ప్రదర్శన కొనసాగితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పానీపట్ చిత్ర వివాదంపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఈ చిత్రంపై వస్తున్న ఫిర్యాదులను సెన్సార్ బోర్డు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సినిమాలో మహారాజా సూరజ్‌మాల్‌ను పాత్రను తప్పుగా చిత్రీకరించడం వల్ల.. రాజస్తాన్‌లోని చాలా మంది జాట్లు మనస్తాపానికి లోనయ్యారని తెలిపారు. సెన్సార్ బోర్డు జోక్యం చేసుకోని వివాదాన్ని పరిష్కరించాలన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు తక్షణమే జాట్లతో చర్చలు జరపాలని చెప్పారు. సినిమాలోని పాత్రలను సరైన విధంగా చూపిస్తే.. వివాదాలకు ఆస్కారం ఉండదని అభిప్రాయపడ్డారు. కళను, కళాకారులను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని.. కానీ వారు ఏ కులాన్ని, వర్గాన్ని, మతాన్ని, దేవతలని, గొప్ప వ్యక్తులని అవమానించకూడదని సూచించారు. కాగా, 1761లో జరిగిన మూడో పానీపట్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరాఠాలకు, ఆఫ్ఘానీ రాజుకు మధ్య జరిగే యుద్ధాన్ని ఈ చిత్రంలో చూపించారు. మరాఠా యోధుడు సదాశివరావ్ భౌగా అర్జున్ కపూర్, అతని భార్య పార్వతీ బాయ్ పాత్రలో కృతీ సనన్ నటించారు. అఫ్ఘానీ నుంచి మరాఠా సామ్రాజ్యం పై దండెత్తి వచ్చే అహ్మద్ షా అబ్దాలి పాత్రలో సంజయ్ దత్ నటించారు. -
మళ్లీ మొహంజొదారో
నాగరికత తొంభై శాతం మంది దర్శకుల ఊహలు తేలికైన కమర్షియల్ కథలకే పరిమితమవుతాయి. కానీ అశుతోష్ గోవారికర్ లాంటి దర్శకులు మాత్రం... థింక్ బిగ్ అన్నట్లు భారీ సినిమాలనే ఎంచుకుంటారు. ఆ కథలతో అద్భుతాలను సృష్టించి ప్రేక్షకులను అబ్బురపరుస్తారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన లగాన్, స్వదేశ్, జోథా అక్బర్... ఇలాంటి అనుభూతిని పంచినవే. లగాన్ భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ అవార్డులకు పోటీ పడింది. అశుతోష్ గోవారికర్ రూపొందిస్తున్న కొత్త సినిమా మొహంజొదారో కూడా భారీ చిత్రమే. మొహంజొదారో చిత్రం 100 కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సింధులోయ నాగరికత కథానేపథ్యం. ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో సింధులోయ నాగరికత ఒకటి. క్రీస్తు పూర్వం 6 వేల సంవత్సరాల నాడు ఈ నాగరికత విలసిల్లింది. ఈ నాగరికతలో మొహంజొదారో ఒక ముఖ్య పట్టణం. ఆనాడే జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మొహంజొదారో ఓ సాక్ష్యం. వేల ఏళ్ల క్రితమే సింధు ప్రజలు ఎంతో ముందుచూపుతో ఆలోచించారు. ఎంతో ప్రణాళికాబద్దంగా సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. 1920లో సింధు నాగరికత అవశేషాలు బయటపడ్డాయి. అప్పుడే హరప్పా, మొహంజొదారో పట్టణాల గురించి ఆధునిక ప్రజలకు తెలిసి వచ్చింది. యునెస్కో 1980లో మొహంజొదారోను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చరిత్ర ఆధారంగానే మొహంజొదారో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అశుతోష్. దానికోసం అతడు చాలా అధ్యయనం చేశాడు. ఏడుగురు పురావస్తు శాస్త్రజ్ఞుల సహాయంతో సింధు నాగరికత విషయాలు తెలుసుకున్నాడు. అప్పటి ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు, సంస్కృతి, భావోద్వేగాలు లాంటి సమాచారమంతా సేకరించాడు. పురావస్తు తవ్వకాలు జరిగిన గుజరాత్‌లోని ధోలావిరా లాంటి ప్రాంతాలు పరిశీలించాడు. సింధు నాగరికత గురించి అతికొద్ది ఆధారాలే లభిస్తున్నాయి. దీంతో చరిత్ర తెలుసుకుని సినిమాకు అన్వయించుకునేందుకు దర్శకుడికి మూడేళ్ల సమయం పట్టింది. మొహంజోదారో ఒక ప్రేమ కథ. సింధూ లోయ నాగరికతను ఆవిష్కరిస్తూ కథ సాగుతుంటుంది. తన శత్రువు కూతురిని ప్రేమించిన వ్యక్తి ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్నాడనేది ప్రధాన ఇతివృత్తం. అప్పటి పట్టణ వాతావరణాన్ని స్టూడియోలో వీఎఫ్ఎక్ తో పునసృష్టి చేశారు. ద డే ఆఫ్టర్ టుమారో, 10,000 బీసీ లాంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన నిపుణులు మొహంజొదారోను ప్రతిష్టించారు. ఆనాటి మానవుల శరీరాకృతి కోసం హృతిక్ రోషన్ మూడు నెలలు విదేశీ నిపుణుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. మొహంజొదారో కోసం హృతిక్ 50 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నాడట. ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన పాటలు ఈ నెల 6 న విడుదల అయ్యి ఇప్పటికే అలరిస్తున్నాయి. సినిమా ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది. -
‘చరిత్రలో ఫెయిలయ్యా.. కానీ చాలా ఇంట్రెస్ట్’
ముంబయి: తాను స్కూళ్లో చదివే రోజుల్లో చరిత్ర సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని.. కానీ, ఇప్పుడు మాత్రం బయటకు చెప్పని చరిత్రల గురించి దృశ్యరూపంలో చెప్పే అవకాశం వచ్చిందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అశుతోష్ గౌరీకర్ అన్నారు. ‘నాకు ఎప్పుడూ తేదీలు గుర్తుండేవి కాదు. చరిత్ర సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. జాగ్రఫీతో కూడా నాకు సంబంధం లేదు. అయితే, ఇప్పటి వరకు బయటకు ఎవరు చెప్పని కథల గురించి తెలుసుకునే ఆసక్తి మాత్రం తగ్గలేదు’ అని ఆయన అన్నారు. తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మొహంజదారో చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. సింధూ నాగరికత కాలంనాటి మొహంజదారో నగర విశిష్టతను దృశ్యరూపంగా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. మొహంజదారో చరిత్ర గురించి చెప్పడం అంటే తనకు ఎప్పటికీ ఆసక్తే అని అన్నారు. ‘నేను ఈ చిత్రాన్ని తీసినందుకు సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రానికి న్యాయం చేశానని అనుకుంటున్నాను. లగాన్, జోదా అక్బర్, నేడు మొహంజదారో వంటి చిత్రాలకు విడిది తీసుకోవడానికి గల కారణం తన పరిశోధనే అన్నారు. ఇవి ప్రత్యేకమైన చిత్రాలు అయినందున తాను అలా గ్యాప్ తీసుకుంటానని చెప్పారు. -
ఆ సిన్మా ట్రైలర్ పై జోకులే జోకులు!
రెండు వేల ఏళ్లకు పూర్వం వెలసిన సింధు నాగరికత నాటి కథతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా 'మొహెంజో దారో'. హృతిక్ రోషన్- పుజా హెగ్డే జంటగా ప్రముఖ దర్శకుడు అశుతోష్ గ్రోవారికర్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా ఆన్ లైన్ లో విడుదలైంది. యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ఈ ట్రైలర్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున జోకులు పేలుస్తున్నారు. చారిత్రక కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన 'మొహెంజో దారో' ట్రైలర్ ఇప్పుడు ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్రైలర్ పై కుప్పతెప్పలుగా వెల్లువెత్తుతున్న వ్యంగ్యాస్త్రాల్లో కొన్ని మీకోసం.. 2,500 ఏళ్లకు పూర్వం మొహెంజో దారోలో తొలిసారి ఆకాశంలో విమానాన్ని చూసి ఆశ్చర్యపోతున్న చిన్నారి ఫైల్ ఫొటో ఇది.. ఏంజెలినా జోలీకి పూర్వమే కాన్స్ లో పర్ఫెక్ట్ పోజు ఎలా ఇవ్వాలో హరప్ప మహిళలు నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. అమెరికా వలసదారులకు మహెంజో దారోలో ఏం పని? 'రోబో' సినిమాలోని 'కిలీ మంజారో' పాటను స్ఫూర్తిగా చేసుకొని.. మొహెంజోదారోలో వస్త్రాలు సిద్ధం చేసినట్టుంది.. మాజీ భార్య సుసానె నిజమైన మొసలి లేదర్ తో చేసిన హ్యాండ్ బ్యాగ్ విసిరేయడంతో హృతిక్ ఎలా తప్పించుకుంటున్నాడో చూడండి. మొహెంజో దారో పేరు నాకు ఎంతో నచ్చింది. మోహన్ జావో దారు లావో (మోహన్ వెళ్లి సారా తే) అన్నట్టు నాకు వినిపిస్తోందని ఓ నెటిజన్ చమత్కరించగా.. హృతిక్ రోషన్ యాంగ్రీ ఫేస్ వల్లే సింధు నాగిరకత కుప్పకూలి ఉంటుందని మరొకరు.. మొహెంజో దారో అంటే శవాల దిబ్బ అని అర్థం.. ఆ పేరునే నాటి ప్రజలు తమ నగరానికి పెట్టుకొని ఉండి ఉంటారని దర్శకుడు ఎలా భావించారంటూ మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు. -
మొహెంజొదారో ఫస్ట్ లుక్ విడుదల
బాలీవుడ్ మ్యాన్లీ హంక్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా మొహెంజొదారో. క్రీస్తూ పూర్వం విలసిల్లిన నాగరికతకు సంబందించిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లగాన్ ఫేం అశుతోష్ గోవరికర్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్‌తో పాటు హృతిక్ లుక్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌నూ రిలీజ్ చేశారు. రఫ్ లుక్‌లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో కనిపిస్తున్న హృతిక్ మరోసారి ఆకట్టుకున్నాడు. తన ట్విట్టర్లో మొహెంజొదారో పోస్టర్‌ను రిలీజ్ చేసిన హృతిక్, తన పాత్ర పేరు సార్మాన్ అంటూ ప్రకటించాడు. ప్రేమ, శక్తిలకు ప్రతిరూపం సార్మాన్ అంటూ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు హృతిక్. ఈ సినిమాలో ముకుందా ఫేం పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. The manifestation of love and power.. SARMAN .#MohenjoDaroPoster @utvfilms @agppl_tweets @hegdepooja @arrahman pic.twitter.com/kA5KR1hQ10 — Hrithik Roshan (@iHrithik) 7 June 2016 -
'చివరిసారి ఎప్పుడు ఏడ్చానో తెలియదు.. కానీ'
ముంబై: సినిమా షూటింగ్ లో గాయాలపాలైన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్... ఆందోళన చెందవద్దని తన అభిమానులకు సూచించాడు. సోనమ్ కపూర్ నటించిన 'నీరజా' మూవీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో హృతిక్ పాల్గొన్నాడు. 'చివరిసారిగా ఎప్పుడు ఏడ్చానో కూడా తెలియదు. కానీ, ఈ మూవీ ఎమోషనల్ గా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన మూవీ అని, సీనియర్ నటి షబానా అజ్మీకి సెల్యూట్' అంటూ హృతిక్ పేర్కొన్నాడు. తాను భయం లాంటి విషయాలు అసలు మాట్లాడనని, నీరజా మూవీ అందరికీ చాలా గర్వకారణమన్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహంజోదారో షూటింగ్లో పాల్గొంటున్న మ్యాన్లీ స్టార్ ఈ మూవీ తీస్తుండగానే రెండోసారి గాయపడ్డాడు. గత నెలలో ఒకసారి గాయపడి షూటింగ్ కు విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అశుతోష్ గోవారికర్ ఈ మూవీకి దర్శకత్వం చేస్తున్నాడు. కనీసం రెండు వారాల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. దీంతో మరోసారి మొహంజోదారో షూటింగ్‌కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే ఈ మూవీతో బాలీవుడ్ లో కాలు మోపనుంది. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో క్వాలిటీ కోసం హృతిక్ తీసుకుంటున్న జాగ్రత్తలే ప్రమాదాలకు కారణమవుతున్నాయని చిత్రయూనిట్ భావిస్తోంది. -
ప్యార్ కా పవర్
దేడ్ కహానీ - జోధా అక్బర్ మనిషికి రేపేం జరుగుతుందో తెలీదు. కాబట్టి ఫ్యూచర్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం ఇష్టం ఉండదు. ఇవ్వాళేం జరుగుతుందో తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడలేడు. నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలనే తపన. తన వెనక జరిగిన సంగతుల మీదున్న సాధా రణమైన ఇష్టమే సినిమాల్లో చరిత్రాత్మక మైన సినిమాలకి మంచి గిరాకీని తెచ్చిపెట్టిందని నాకనిపిస్తుంది.‘లగాన్’ అనే సినిమాతో భారీ హిట్టు కొట్టిన దర్శకుడు అశుతోష్ గొవారికర్ తర్వాతి సినిమా ‘స్వదేశ్’ వర్తమానానికి సంబంధించిన కథ. అది బాక్సీఫీసు దగ్గర దారుణంగా బోల్తాపడేసరికి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి చరిత్ర రూటు పట్టుకుని ‘జోధా అక్బర్’తో బాలీవుడ్‌కి పెద్ద కమర్షియల్ హిట్ ఇచ్చారు. చరిత్ర చెప్పినవాళ్లు కాని, రాసినవాళ్లు కాని అది జరుగు తున్న కాలంలో ఉండరు. విన్నవి, వాళ్లకి తెలిసినవి, వాళ్లకి దొరికిన ఆనవాళ్లని క్రోడీకరిస్తారు. కాబట్టి వీటికి కట్టుబడి ఉండాల్సిన గీతలు కొంచెం తక్కువే. పబ్లిక్‌లో బాగా పాపులర్ అయిన విషయాలకి వ్యతిరేకంగా వెళ్లకుండా ఉంటే చాలు. అదే చేశారు ‘జోధా అక్బర్’లో. 1960లో పృథ్వీరాజ్ కపూర్ అక్బర్‌గా, దిలీప్‌కుమార్ సలీమ్‌గా, మధుబాల అనార్కలిగా వచ్చిన ‘మొఘల్-ఎ- అజమ్’ చిత్రంలో అక్బర్ భార్య... జోధా బాయి అనే రాజపుత్ వంశీయురాలు, హిందువు. దాని ఆధారంగా 2008 ఫిబ్రవరి 15న ‘జోధా-అక్బర్’ అనే మంచి గంభీరమైన ప్రేమకథని అందించారు అశుతోష్. అక్బరు అఫ్గానిస్తాన్ నుంచి బంగాళాఖాతం తీరం మీదుగా నర్మదా నదీ తీరాన్ని జయించుకుంటూ మంచి ఊపు మీద ఉంటాడు. కానీ అక్కడ రాజపుత్ వంశీయులని వశపరుచుకోవడం చాలా కష్టమౌతుంది అతనికి. వాళ్లని ప్రతి ఘటించడం కన్నా బంధుత్వం కలుపు కోవడం తేలికని అనుకుంటాడు. రాజా భర్మల్ ఏకైక కూతురు జోధా, వివాహానికి రెడీగా ఉందని తెలుసుకుంటాడు. ఈలోగా భర్మల్ సాటి రాజపుత్ వంశస్థుడైన మరో రాజకుమారుడికి తన కూతురితో నిశ్చి తార్థం చేస్తాడు. తన తదనంతరం అతన్ని రాజుగా పట్టాభిషిక్తుణ్ని చేయాలన్న కండిషన్కీ తలొగ్గుతాడు. జోధా అన్నకు తన వారసత్వం చెల్లెలి మొగుడికి వెళ్లడం ఇష్టం లేక, అలిగి ఇల్లొదిలి వెళ్లిపోతాడు. ఈలోగా అక్బరు దండయాత్ర చేయబోతు న్నాడని తెలిసి, అతణ్ని అల్లుణ్ని చేసుకొనే ప్రతిపాదన తెస్తాడు. అదే కావాలనుకున్న అక్బరు ఒప్పుకుంటాడు. రాజకీయ చదరంగంలో పావులా మారిన జోధా పరిస్థితులకు తలొంచు తుంది. సాక్షాత్తూ ఆమె తల్లే జోధా చేతిలో విషం సీసా ఉంచి, ఏ రోజైనా అవసర మైతే దాన్ని వాడమంటుంది. ఆత్మాభి మానం గల జోధా పెళ్లయ్యాక అక్బరుని దగ్గరకి రానివ్వదు. రాజపుత్ యువ రాణిగా తన విలువని కాపాడుకుంటున్న ఆమె తీరు అక్బర్‌ని ఆకర్షిస్తుంది. అధికారంతో కాకుండా ప్రేమతో ఒకటవ్వాలని ఆమె అభిప్రాయాలని గౌరవించి దూరంగా ఉంటాడు. మత ఛాందసం భయంకరంగా ఉన్న అక్బరు అంతఃపురంలో కృష్ణుడి గుడి కట్టించుకుని పూజలు చేస్తుంది జోధా. క్రమంగా అక్బరు, జోధా మనసులు కలిసి ఒకటౌతారు. కానీ, అక్బరు జోధా అభి ప్రాయాలను గౌరవించడాన్ని ముస్లిములు అంగీకరించలేకపోతారు. వారిద్దరినీ కలవ కుండా చేయాలని రకరకాల పన్నాగాలు పన్నుతారు. అన్నిటినీ జయించి అజరా మరమైన ప్రేమికులుగా జోధా, అక్బరు ఎలా కలిశారన్నది కథ. ఈ చిత్రం రిలీజయ్యాక ఎంతోమంది చరిత్రకారులు అక్బరు భార్య జోధాబాయి కాదని, అసలు అక్బరు రాజపుత్ వంశస్థు రాలినే పెళ్లాడలేదని అన్నారు. అన్నిటినీ అశుతోష్ కొట్టిపారేశాడు. చిన్నప్పట్నుంచి చదువుకున్న విషయాన్ని, మళ్లీ సినిమా కోసం ఎంతో మంది హిస్టరీ లెక్చెరర్స్ని సంప్రదించిన విషయాన్ని తను సినిమాగా తీశానని నొక్కి వక్కాణించాడు. పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు ఎప్పుడూ స్టోరీ సిట్టింగ్స్‌లో ఒక విషయం చెప్తుండే వాళ్లు. ఏ ప్రేమకథైనా సూపర్‌హిట్ అవ్వా లంటే ప్రేమికులిద్దరూ కలిస్తే బావుణ్ను అని ప్రేక్షకుడికి అనిపించాలి అని. అంటే, పాత్రల మధ్య కలవలేని అవాంతరాలని స్క్రీన్‌ప్లేలో అందంగా అల్లుకుంటూ రావాలి క్లైమాక్స్ వరకూ. చూస్తున్న ప్రేక్ష కుడికి వాళ్లు కలిస్తే బావుణ్ను అన్న ఫీలింగ్ కలుగజేసి, పెంచి పెద్ద చేసి చివరికి వాళ్లని కలిపితే, అప్పుడు హమ్మయ్య అని తృప్తిగా బైటికెళతాడు, అప్పుడు కూడా బలమైన కారణం ఇంకోటి పెట్టి ఆ ప్రేమికుల్ని విడగొట్టి ట్రాజెడీ ఎండింగ్ ఇస్తే ఆ బాధని ప్రేక్షకుడు అనుభవించి సినిమాని సూపర్‌హిట్ చేస్తాడు అని. మరోచరిత్ర నుంచి మనసంతా నువ్వే దాకా ఏ సూపర్‌హిట్ ప్రేమకథ చూసినా అలాగే అని పిస్తుంది. ‘జోధా అక్బర్’ ప్రేమకథలో ఈ ఫీలింగ్ విషయంలో పెద్ద రిస్క్ ఒకటుంది. హీరో, హీరోయిన్లకి ముందు పెళ్లయిపోయి, ఒకే కోటలో కలిసుంటారు. కలిస్తే బావుణ్ను అనుకోడానికి బయటి నుంచి కారణాలు తక్కువ. సో, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ మీద ఆధారపడి వాళ్ల మనసులు కలిస్తే బావుణ్ను అని ప్రేక్షకుడితో అనిపించాలి. అది చాలా చాలా కష్టమైన పని. కానీ సాధించారు దర్శక, రచయితలు. అందరికీ ఆమోదయోగ్యంగా చిత్రీకరించారు కాబట్టే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి మిలీనియమ్‌లో మంచి ప్రేమకథగా నిలిచింది. హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ అద్భుతంగా సరిపోయారు జోధాగా, అక్బర్‌గా. టైటిల్‌కి తగినట్టు సినిమా అంతా వారిద్దరిదే. అయినా ఆ బరువుని తేలికగా మోశారిద్దరూ. రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి సగం బలం. పాటలు ఎంత హిట్టో, నేపథ్య సంగీతం అంత యాప్టు. సెట్స్, సినిమాటోగ్రఫీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించడం దీనితోనే మొదలైందీ తరంలో. ఈ చిత్రంలో సంఘ టనల కన్నా సంభాషణలు ఎక్కువ ఉండడం వల్ల హిందీ, ఉర్దూ భాషలు ఆస్వాదించలేని ప్రేక్షకులకి కాస్త బోరు కొట్టొచ్చు కానీ, జాగ్రత్తగా ఫాలో అయితే, సాధారణ సినిమా ప్రేమికులందరూ ఇష్టపడతారు. మేకింగ్‌కి పెద్ద పీట వేసే ఇలాంటి చిత్రా లకి బడ్జెట్ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఇవి తేడా రాకుండా తీయడం ముఖ్యం. అందుకే దర్శకుడు కూడా సగం నిర్మాతయ్యాడు ఈ చిత్రానికి. 2000 తర్వాత మగధీర, బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో, జోధా అక్బర్‌ల స్థాయిలో మన చిత్రాలు తీయడం ప్రారంభమైంది. మిలీనియమ్‌లో బాలీవుడ్ ప్రభావం కథల్లోనే కాకుండా భారీతనంలో కూడా మన మీద ఉందనడానికి ఇదే సాక్ష్యం. వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
స్టార్ హీరోకు గాయాలు, రెండు వారాల విశ్రాంతి
-
స్టార్ హీరోకు గాయాలు, రెండు వారాల విశ్రాంతి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరోసారి గాయపడ్డాడు. ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహంజోదారో షూటింగ్లో పాల్గొంటున్న ఈ మ్యాన్లీ స్టార్ గత నెలలో ఒకసారి గాయపడి షూటింగ్ కు విరామం తీసుకున్నారు. తాజాగా మరోసారి షూటింగ్లో జరిగిన ప్రమాదంలో హృతిక్ గాయపడ్డాడు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో క్వాలిటీ కోసం హృతిక్ తీసుకుంటున్న కేర్ కారణంగా గాయాలవుతున్నట్టుగా చెపుతున్నారు చిత్రయూనిట్. షూటింగ్ సమయంలో ప్రమాదం జరగటంతో హృతిక్‌కు గాయాలైనట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది. కనీసం రెండు వారాల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. దీంతో మరోసారి మొహంజోదారో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ సినిమాలో హృతిక్ సరసన ముకుంద సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అశుతోష్ గోవరీకర్ దర్శకుడు. -
కథల్ని ప్రేమిస్తా..!
హృతిక్ రోషన్‌తో కలసి జోధా అక్బర్ వంటి అద్భుత కళాఖండాన్ని సృష్టించిన నిర్మాత ఆశుతోష్ గోవరికర్ మరో ప్రేమకథను కథను తెరకెక్కించనున్నాడు. అదే మొహంజదారో. ఈ సవాలును స్వీకరిస్తున్నందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నాడీ జాతీయ పురస్కార గ్రహీత. ఈ కథ చెప్పగానే ఎంతో ఉత్తేజితుడినయ్యానని అని అన్నాడు. ‘కథలను ప్రేమిస్తా. అందులోనూ విభిన్న కాలాలకు చెందినవంటే ఇంకా ఎంతో ఇష్టం. అవికూడా అనేక శతాబ్దాల క్రితంనాటివంటే ఉత్సాహం అనేక రెట్లు పెరుగుతుంది’ అని అన్నాడు. ‘మొహంజదారో క్రీస్తుపూర్వం 2500 సంవత్సరంనాటిది. నేను తెరకెక్కించనున్న ఈ సినిమాలో హృతిక్ ఓ ప్రవక్తలా కనిపించనున్నాడు. ఈ సినిమా తెరకెకి కంచనుండడం నన్ను ఎంతో ఉత్సుకతకు గురిచేస్తోంది. పురాతన చరిత్ర ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకి మేమిద్దరం మరోసారి కలసి పనిచేయనుండడం నాకు చెప్పలేనంత ఆనందం కలిగిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యకలాపాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ ఏడాది చివరి తైమాసికంలో ఈ సినిమా సెట్లపైకి రానుంది. ఇదిలాఉంచితే జోధాఅక్బర్లో నటించిన హృతిక్ సైతం ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. ‘సవాళ్లను ఎదుర్కోవడం గొప్పగా అనిపిస్తుంది. ఇది ఆయా వ్యక్తుల శారీరక, మానసిక శక్తిని అభివర్ణిస్తుంది. ఈ సినిమా ఎంతో స్ఫూర్తిదాయకమైనది. అందులోనూ ఇది పురాతన భారతీయ ప్రేమగాధను వర్ణించే చిత్రం. సింధు నాగరికత అందరికీ తెలిసినదే. ఇది భారతీయులకే కాకుండా ఇతర దేశాలవారికీ ఎంతో ఆసక్తికరమైనది. ఆశుతోష్తో కలసి మరోసారి పనిచేయనుండడం నాకు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తోంది’ అని హృతిక్ ఈ సందర్భంగా అన్నాడు.