'చివరిసారి ఎప్పుడు ఏడ్చానో తెలియదు.. కానీ' | I am fine now and It happens, says Hrithik Roshan | Sakshi
Sakshi News home page

'చివరిసారి ఎప్పుడు ఏడ్చానో తెలియదు.. కానీ'

Published Wed, Feb 17 2016 6:58 PM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

'చివరిసారి ఎప్పుడు ఏడ్చానో తెలియదు.. కానీ'

'చివరిసారి ఎప్పుడు ఏడ్చానో తెలియదు.. కానీ'

ముంబై: సినిమా షూటింగ్ లో గాయాలపాలైన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్... ఆందోళన చెందవద్దని తన అభిమానులకు సూచించాడు. సోనమ్ కపూర్ నటించిన 'నీరజా' మూవీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో హృతిక్ పాల్గొన్నాడు. 'చివరిసారిగా ఎప్పుడు ఏడ్చానో కూడా తెలియదు. కానీ, ఈ మూవీ ఎమోషనల్ గా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన మూవీ అని, సీనియర్ నటి షబానా అజ్మీకి సెల్యూట్' అంటూ హృతిక్ పేర్కొన్నాడు. తాను భయం లాంటి విషయాలు అసలు మాట్లాడనని, నీరజా మూవీ అందరికీ చాలా గర్వకారణమన్నాడు.

పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహంజోదారో షూటింగ్లో పాల్గొంటున్న మ్యాన్లీ స్టార్ ఈ మూవీ తీస్తుండగానే రెండోసారి గాయపడ్డాడు.  గత నెలలో ఒకసారి గాయపడి షూటింగ్ కు విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అశుతోష్ గోవారికర్ ఈ మూవీకి దర్శకత్వం చేస్తున్నాడు. కనీసం రెండు వారాల పాటు షూటింగ్లకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. దీంతో మరోసారి మొహంజోదారో షూటింగ్కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే ఈ మూవీతో బాలీవుడ్ లో కాలు మోపనుంది. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో క్వాలిటీ కోసం హృతిక్ తీసుకుంటున్న జాగ్రత్తలే ప్రమాదాలకు కారణమవుతున్నాయని చిత్రయూనిట్ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement