స్టార్ హీరోకు గాయాలు, రెండు వారాల విశ్రాంతి | Hrithik Roshan injured on the sets of Mohenjo Daro | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోకు గాయాలు, రెండు వారాల విశ్రాంతి

Published Sun, Jan 17 2016 12:12 PM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

స్టార్ హీరోకు గాయాలు, రెండు వారాల విశ్రాంతి

స్టార్ హీరోకు గాయాలు, రెండు వారాల విశ్రాంతి

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరోసారి గాయపడ్డాడు. ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహంజోదారో షూటింగ్లో పాల్గొంటున్న ఈ మ్యాన్లీ స్టార్ గత నెలలో ఒకసారి గాయపడి షూటింగ్ కు విరామం తీసుకున్నారు. తాజాగా మరోసారి షూటింగ్లో జరిగిన ప్రమాదంలో హృతిక్ గాయపడ్డాడు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో క్వాలిటీ కోసం హృతిక్ తీసుకుంటున్న కేర్ కారణంగా గాయాలవుతున్నట్టుగా చెపుతున్నారు చిత్రయూనిట్.

షూటింగ్ సమయంలో ప్రమాదం జరగటంతో హృతిక్కు గాయాలైనట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది. కనీసం రెండు వారాల పాటు షూటింగ్లకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. దీంతో మరోసారి మొహంజోదారో షూటింగ్కు బ్రేక్ పడింది. ఈ సినిమాలో హృతిక్ సరసన ముకుంద సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అశుతోష్ గోవరీకర్ దర్శకుడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement