Mohenjo Daro
-
మొహంజోదారో : ఆ డ్యాన్సింగ్ గర్ల్ విగ్రహం ఎవరిది?
మొహెంజోదారోలో జరిపిన తవ్వకాల్లో రెండు అద్భుతమైన శిల్పాలు బయట పడ్డాయి.అందులో ఒకటి నాటి పాలకుడిదిగా భావించారు. ఇది కేవలం ఆరు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది. నగరానికి మత పెద్దగా పూజారిగా ఉన్న వ్యక్తే మొహెంజోదారోను పాలించి ఉండచ్చని శిల్పం ఆకృతి వేషధారణ లక్షణాల ఆధారంగా నిర్ధారించారు. అందుకే ఆ శిల్పాన్ని కింగ్ ప్రీస్ట్ విగ్రహంగా పేర్కొన్నారు. దాంతో పాటు ఓ యువతి నృత్యం చేసే భంగిమలో ఉన్న శిల్పం కూడా బయట పడింది. దాన్ని డ్యాన్సింగ్ గర్ల్ విగ్రహంగా వర్ణించారు.మొహెంజోదాదోలో నృత్యకళ వైభవోపేతంగా ఆదరణకు నోచుకుందని ఈ విగ్రహం చెబుతోంది.1925 తవ్వకాల్లో బయట పడ్డ ఈ రెండు శిల్పాలను ఢిల్లీలో ఉన్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియంలో ఉంచారు.దేశ విభజన జరిగిన 23 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో 1970లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీని కలిసి మొహెంజోదారోలో బయటపడ్డ కింగ్ ప్రీస్ట్, డ్యాన్సింగ్ గాళ్ శిల్పాలను తమకు ఇవ్వాల్సిందిగా అభ్యర్ధించారు.ఎందుకంటే మొహెంజోదారో ఉన్న ప్రాంతం పాకిస్థాన్ భూభాగంలో ఉంది.అయితే ఇందిరా గాంధీ రెండు విగ్రహాలూ ఇవ్వడానికి అంగీకరించలేదు. కింగ్ ప్రీస్ట్ విగ్రహాన్ని పాకిస్థాన్ కు అందించిన ఇందిరా గాంధీ డ్యాన్సింగ్ గాళ్ విగ్రహాన్ని మాత్రం భారత్ లోనే ఉంచుకుంటామన్నారు.కింగ్ ప్రీస్ట్ విగ్రహం ప్రస్తుతం కరాచీ మ్యూజియంలో భద్రంగా ఉంచారు.మొహెంజోదారో ప్రజలు చాలా ప్రతిభావంతులు. చాలా రంగాల్లో నిష్ణాతులు. ఎన్నో నైపుణ్యాలు ఉన్న ప్రజ్ఞావంతులు. అప్పట్లో వారి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. గోధుమలు, బార్లీ ప్రధాన పంటలుగా సాగు చేసేవారు.అరటి , కర్బూజా, పచ్చిబఠానీలు కూడా పండించేవారు.వీటితో పాటు వాణిజ్య పంటగా పత్తిని పెద్ద ఎత్తున సాగు చేసేవారు.7వేల సంవత్సరాల క్రితమే పత్తిని సాగుచేసి బట్టలు ఉడికిన నైపుణ్యం మొహెంజోదారో ప్రజల సొంతం. అప్పట్లో మొహెంజోదారోతో పోటీ పడిన ఈజిప్ట్, మెసొపొటేమియా నాగరికతలు వర్ధిల్లిన చోట పత్తి సాగు లేదు. అది కేవలం సింధూ లోయకే పరిమితం కావడం విశేషం.వెండి,రాగి పాత్రలు తయారు చేసేవారు. ఇళ్ల నిర్మాణాల్లో వినియోగించే ఇటుకలను బ్రహ్మాండంగా తయారు చేసేవారు. మొదట్లో మట్టితో చేసిన ఇటుకలను ఎండలో ఎండబెట్టి వాటినే వాడే వారు. ఆ తర్వాత పచ్చి ఇటుకలను కొలిమిలో కాల్చి తయారు చేయడం మొదలు పెట్టారు.ఈ ఆవిష్కరణ కూడా వీరి సొంతమనే చెప్పాలి.ఇటుకలన్నీ ఒకే సైజులో ఒకే నాణ్యతతో కలకాలం మన్నిక ఉండేలా తయారు చేశారు. స్పాట్ డ్రెసింగ్ టేబుల్స్ అయితే లేవు కానీ. మొహాన్ని అద్దంలో చూసి అలంకరించుకోడానికి ఇసుకతో అద్దాన్ని తయారు చేయడం మాత్రం నేర్చుకున్నారు. అద్దాలతో పాటు చెక్కతో దువ్వెనలూ తయారు చేశారు. కాటుక నిల్వచేసుకునే సీసాలా ఉండే భరణి కూడా తయారు చేశారు.రక రకాల పూసలు, లోహాలతో ఆభరణాలు తయారు చేశారు. బట్టలు కుట్టుకునే సూదిని ఆవిష్కరించారు. గొడ్డలికి పురుడు పోసింది కూడా ఈ కాలంలోనే. వీరు డిజైన్ చేసిన గొడ్డలి రకాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నాం.చేపలను పట్టుకోడానికి అవసరమైన గేలాన్ని తయారు చేశారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు రూపొందించారు. బంతులు, బొంగరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి.వీరు తయారు చేసిన వస్తువులు విక్రయించేటపుడు వాటిపై వేసేందుకు రక రకాల ముద్రలు తయారు చేశారు. జంతువుల బొమ్మలతో వాటిని రూపొందించారు.మసాలాలు నూరే పొత్రం, రాయి, తిరగలి వంటివి తయారు చేశారు. రంగు రంగుల డిజైన్లు వేసిన కుండలు తయారు చేశారు. బాత్ టబ్స్ అప్పుడే రూపొందించారు ఈ మేథావులు.వర్తకాల్లో కొలమానాలను బరువులు తూచే సాధనాలనూ తయారు చేసుకున్నారు. కనీస బరువు 0.856 గ్రాములు తూగే రాయి ఉండేది. ఎక్కువగా వాడే రాయి బరువు 13.7 గ్రామాలు ఉండేది. అంటే కనీస బరువుకు సరిగ్గా 16 రెట్లు బరువైనది.హరప్పా లో వాడిన ముద్రలకు సింధూ నాగరికతలో బయట పడ్డ ముద్రలకు పోలికలు ఉన్నాయి. ఇలాంటివే ఈజిప్ట్, మెసొపొటేమియాల్లోనూ కనిపించాయి.హరప్పా నుండి మొహెంజోదారో మీదుగా 2200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెసొపొటేమియా వరకు వాణిజ్య లావాదేవీలు, సరుకుల ఎగుమతి దిగుమతులు జరిగినట్లు ఆధారాలు దొరికాయి.ఇక్కడ మాత్రమే దొరికే వింత రంగుల కార్నేలియన్ రాళ్లు, కలప, ఏనుగు దంతాలను మెసొపొటేమియాకు ఎగుమతి చేసేవారు.ఈ కార్నేలియన్ రాయి ఇప్పటికీ గుజరాత్ లో విస్తారంగా దొరుకుతుంది. అక్కడి నుండే ఇప్పటికీ అరబ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. అలాగే ఆసియాలో ఉండే మొత్తం ఏనుగుల్లో 60 శాతం ఏనుగులు భారత్ లోనే ఉన్నాయి. ఇప్పటికీ ఏనుగు దంతాలు భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి.మెసొపొటేమియాను పాలించిన అకాడియన్ సామ్రాజ్య చక్రవర్తి సారగాన్ భారీ దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయంలో అలంకారాల కోసం కార్నేలియన్ రాయి, ఏనుగు దంతాలు, కలపలను మెలుహా నుండి ఓడల్లో దిగుమతి చేసుకునేవారు. మొహెంజోదారోనే మెసొపొటేమియన్లు మెలుహాగా పిలుచుకునేవారు.ఇరాన్ ఇరాక్ లకు ఇక్కడి నుండి సరుకులు ఎగుమతి అయ్యేవి. పర్షియన్ గల్ఫ్ మీదుగా జలరవాణా మార్గంలోనూ ఎగుమతి దిగుమతులు జరిగేవి. స్పాట్ ఇంగ్లీషులో 26 అక్షరాలుంటే హిందీలో 46, ఉర్దూలో 39 అక్షరాలు తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. సింధూ లోయ నాగరికత లో సింధూ భాషకు ఏకంగా 419 అక్షరాలు ఉన్నాయి. అయితే ఇవి రక రకాల బొమ్మలు,చిహ్నాలతో నిండి ఉన్నాయి. సింధూ బాషను ఈ రోజుకీ ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. చాలా సంక్లిష్టమైనది ఈ భాష.మొహెంజోదారోలో అద్భుతమైన బౌద్ధ స్థూపం కూడా ఒకటి ఉంది. ఇందులో ఒక పాత్ర ఉంది. అందులో గౌతమ బుద్ధుని అస్థికల బూడిద ఉందని అంటారు. గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందినపుడు ఆయన పార్ధివ దేహం కోసం వివిధ వర్గాల భక్తులు పోటీ పడ్డారట. దాంతో బుద్ధుని దేహాన్ని ఖననం చేసి ఆ బూడిదను, అస్థికలను అందరికీ సమానంగా పంచారట. అలా తమ వాటాగా వచ్చిన బూడిదను భక్తులు ఒక పాత్రలో వేసి బౌద్ధ స్థూపాల్లో ఉంచి అక్కడే ప్రార్దనలు చేయడం ఆనవాయితీగా వస్తోందని అంటారు. అటువంటిది ఒకటి మొహెంజోదారోలో ఉంది.మొహెంజోదారో ప్రజల్లో ఎవరైనా చనిపోయినపుడు మూడు రకాలుగా అంత్యక్రియలు చేసేవారు. కొందరు ఖననం చేసేవారు. మరి కొందరు దహనం చేసేవారు. ఇంకొందరు ఈజిప్ట్ లో ఫారోల మాదిరిగా మృతదేహంతో పాటు చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్ధాలు, తేనె, ఆభరణాలు వంటివి పక్కనే ఉంచేవారట.చనిపోయిన మనుషులు తిరిగి బతికే అవకాశం ఉందని వీరు నమ్మేవారు. ఈ నమ్మకం ఈజిప్టు లోనూ ఉండేది. అలా బతికిన వారికి ఆకలి వేస్తే అవసరం అవుతుందనే ఆహార పదార్ధాలతో వాటిని పిరమిడ్లలో ఉంచేవారు ఈజిప్షియన్లు. రక రకాల వ్యాపారాలు చేశారు. ఎన్నో కళారూపాలు ఆవిష్కరించారు. సరికొత్త ఆవిష్కరణలు చేశారు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కారు. ఇంజనీరింగ్ లో తమకి తామే సాటి అని నిరూపించుకున్నారు. నగరంలో అందరూ కలిసి మెలిసి జీవించేవారు.అంతా ఆనందంగా వైభోగంగానే సాగిపోయింది. అయితే కాల క్రమంలో సింధూ నదిలో నీళ్లు తగ్గిపోయాయి. నీటికి కట కట వచ్చింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారు ఈ ప్రాంతంపై దండయాత్రలకు దిగారు. ప్రకృతి వైపరీత్యాలు వేధించాయి.పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితులు లేకపోవడం తో మొహెంజోదారో ప్రజలు తమ అద్భుత నగరాన్ని అయిష్టంగానే వీడి పొట్ట చేత పట్టుకుని వలసలు పోయారు. వారంతా తూర్పు వైపు వెళ్లిపోయారు. ఈ నగరం కాల క్రమంలో కాల గర్భంలో కలిసిపోయింది. తనతో పాటు ఎన్నో జ్ఞాపకాలను తనలో ఇముడ్చుకుంది. మౌనంగా భూగర్బంలో ఉండిపోయింది. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలతో గత వైభవ చిహ్నం మనల్ని పలకరించింది. ఇప్పటికీ ప్రపంచమంతా మొహెంజోదారో వైభవానికి సలామ్ చేస్తారందుకే. -
కొంచెం లైట్ గురూ!
ఒక మామూలు డ్రెస్ వేసుకోవడానికి ఎంత టైమ్ పడుతుంది? మహా అయితే రెండు, మూడు నిముషాలు. ప్యాంటు, చొక్కా అయితే అంత టైమ్ కూడా పట్టకపోవచ్చు. చీర అంటే కనీసం ఐదు నిముషాలైనా పడుతుంది. అదే కొంచెం గ్రాండ్‌గా డ్రెస్ చేసుకోవాలంటే మాత్రం మినిమమ్ అరగంటైనా కేటాయించాల్సిందే. ఇప్పుడీ లెక్కలు ఎందుకంటే... ఇటీవల విడుదలైన ‘మొహెంజొ దారో’ సినిమాలో వేసుకున్న ఒక్కో కాస్ట్యూమ్ కోసం పూజా హెగ్డే 25 నిముషాలపైనే వెచ్చించారట. ఆ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ- ‘‘నేను నెక్ట్స్ చేయబోయే సినిమాలో హాయిగా జీన్స్, టీ షర్ట్స్ ఉంటే బాగుంటుందనుకుంటున్నా. అవైతే వేసుకోవడానికి చాలా ఈజీ. సెకన్లలో రెడీ అయిపోవచ్చు. ‘మొహెంజొ దారో’ నన్ను కొంచెం కష్టపెట్టింది. వేసుకున్న డ్రెస్, పెట్టుకున్న నగలు అన్నీ బరువుగా ఉండేవి. ఒక్కో కాస్ట్యూమ్‌కి ఎక్కువ టైమ్ కేటాయించాల్సి వచ్చింది. అయినా నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే, ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. నటిగా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం. కానీ, ఇమ్మీడియట్‌గా ఇలాంటి సినిమా అంటే కష్టమవుతుంది. అందుకే తేలికగా ఉండే క్యారెక్టర్, లైట్‌గా ఉండే కాస్ట్యూమ్స్ అయితే బాగుంటుందనుకుంటున్నా’’ అన్నారు. తెలుగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ తర్వాత వేరే చిత్రాలు కమిట్ కాలేదీ బ్యూటీ. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డి.జె. దువ్వాడ జగన్నాథమ్’లో కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో ఆమె కోరుకుంటున్నట్లుగా బబ్లీ క్యారెక్టర్ అయ్యుంటుంది. -
ఆ సినిమాపై క్షమాపణ చెప్పాలి: పాక్ మంత్రి
ప్రాచీన సింధు నాగరికత నేపథ్యంగా తెరకెక్కిన 'మొహెంజోదారో' సినిమాపై పాకిస్థాన్ లోని సింధు ప్రాంత సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి సర్దార్ అలీ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. హృతిక్ రోషన్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని విమర్శించారు. ఇందుకుగాను చిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేవారు. ఐదువేల ఏళ్ల కిందట నాటి అత్యున్నత సాంస్కృతిక నాగరికత అయిన సింధు నాగరికతను అపహాస్యం చేసేలా ఈ సినిమా ఉందని డాన్ పత్రికతో షా పేర్నొన్నారు. ఈ విషయంలో సింధు ప్రజల అభ్యంతరాలు, ఆందోళనను చిత్ర దర్శకుడికి తెలియజేస్తానని ఆయన చెప్పారు. ఈ సినిమా నిండా దర్శకుడి కల్పిత ఊహలు మాత్రమే ఉన్నాయని, మొహెంజోదారో చరిత్రతో సినిమాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎంతో సంపన్నమైన నాగరికతగా సింధు చరిత్రకు ప్రపంచవ్యాప్తంగా పేరున్నదని, అందుకే మొహెంజోదారో ప్రాంతాన్ని యునెస్కో సైతం చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించిందని ఆయన అన్నారు. వందకోట్ల బడ్జెట్ తో భారీ అంచనాలతో రూపొందిన 'మోహెంజోదారో' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోని విషయం తెలిసిందే. -
మొహంజొదారో చిత్ర ప్రమోషన్లో ఆర్సీ ప్లాస్టో
భారత పురాతన నాగరికతను గుర్తుకుతెస్తూ... తెరకెక్కిన ‘మొహంజొదారో’ చిత్రానికి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్న ఆర్సీ ప్లాస్టో ఇందుకు సంబంధించి పలు ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్‌కు చెందిన ట్యాంకులు, పైపుల కంపెనీ ఆర్సీ ప్లాస్టో... ఇటీవల ముంబైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో హృతిక్ రోషన్, పూజా హెగ్డే తదితర మొహం జొదారో బృందాన్ని కలుసుకుంది. కలిసినవారిలో ఆర్సీ ప్లాస్టో డెరైక్టర్లు విశాల్ అగర్వాల్, నీలేశ్ అగర్వాల్‌తో పాటు సంస్థకు చెందిన కొందరు డీలర్లూ పాల్గొన్నారు. -
రూ.30 కోట్లుపైగా వసూళ్లు
ముంబై: హృతిక్ రోషన్ తాజా చిత్రం 'మొహంజోదారో' బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ లో రూ.30.54 కోట్లు మాత్రమే వసూలు చేసింది. లగాన్' దర్శకుడు అసతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదల రోజున రూ.8.87 కోట్లు, శనివారం రూ.9.6 కోట్లు, ఆదివారం రూ.12.07 కోట్లు రాబట్టిందని సినిమా యూనిట్ వెల్లడించినట్టు నెట్ బాక్సాఫీస్ కలెక్షన్(ఎన్బీఓసీ) తెలిపింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'మొహంజోదారో'ను సిద్ధార్థ రాయ్ కపూర్, సునీత గోవారికర్ నిర్మించారు. -
ఎదురులేని 'రుస్తుం'.. భారీ కలెక్షన్లు!
అక్షయ్ కుమార్ 'రుస్తుం' సినిమా భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్లు పెరిగిపోతుండగా దీనికి పోటీగా వచ్చిన హృతిక్ రోషన్ 'మొహెంజోదారో' మాత్రం చతికిలపడుతోంది. నావికా దళంలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'రుస్తుం' పట్ల రివ్యూలు పెద్దగా ఆకర్షణీయంగా రాకపోయినా మౌత్ టాక్ మాత్రం బాగా కలిసివస్తున్నదట. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రెండురోజుల్లోనే రూ. 30.54 కోట్లను కొల్లగొట్టింది. ఆదివారం కూడా ఈ సినిమాకు భారీగా వసూళ్లు వచ్చే అవకాశముందని, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సెలవు ఉండటం ఈ సినిమాకు కలిసివస్తుందని, మొత్తంగా తొలి వీకెండ్ లోనే దేశీయంగా రూ. 60 కోట్లకుపైగా 'రుస్తుం' సాధించవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో తొలి వీకెండ్ లో ఓవరాల్ గా రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి.. 'రుస్తుం' సూపర్ హిట్ గా నిలిచే అవకాశముందని ట్రేడ్ పరిశీలకులు చెప్తున్నారు. పటిష్టమైన కథనం, అక్షయ్ కుమార్ పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకు ప్లస్ గా మారాయని వారు అంటున్నారు. తొలిరోజు 'రుస్తుం' రూ. 14.11 కోట్లు వసూలు చేయగా, రెండోరోజు 16.43 కోట్లు రాబట్టింది. ఆదివారం రూ. 14 నుంచి18 కోట్లు రాబట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విదేశాల్లో ఈ సినిమా రూ. 8 కోట్లకుపైగా రాబట్టింది. చతికిలపడ్డ హృతిక్ సినిమా! సింధులోయ చారిత్రక కథతో, భారీ బడ్జెట్, అట్టహాసంతో విడుదలైన హృతిక్ రోషన్ 'మోహెంజోదారో' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా రెండురోజుల్లో రూ. 18.3 కోట్లు మాత్రమే రాబట్టింది. 'రుస్తుం' కన్నా ఎక్కువ థియేటర్లలో విడుదలైన 'మొహెంజోదారో' తొలిరోజు రూ. 8.8 కోట్లు, రెండోరోజు రూ. 9.5 కోట్లు రాబట్టింది. -
సినిమా బడ్జెట్లతో పోలిస్తే కలెక్షన్లు రివర్స్
బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు మొహంజదారో, రుస్తుం బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నాయి. శుక్రవారం ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. రుస్తుంను 65 కోట్ల రూపాయల వ్యయంతో తీయగా, మొహంజదారోను 120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కాగా తొలిరోజు ఈ రెండు సినిమాల కలెక్షన్లను రుస్తుందే పైచేయి. తొలిరోజు రుస్తుం సినిమాకు భారత్‌లో 14.11 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కాగా మొహంజదారోకు 8.87 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు వెల్లడించాడు. చారిత్రక కథతో తెరకెక్కిన మొహంజొదారో సినిమాలో హృతిక్ రోషన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, నావికా దళంలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన రుస్తుం సినిమాలో అక్షయ్ సరసన ఇలియానా నటించింది. -
హీరోపై అభిమానాన్ని ఇలా చూపాడు!
ముంబై: తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే ఫ్యాన్స్ కు పండగే. తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదర్శిస్తుంటారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజా చిత్రం 'మొహంజోదారో' విడుదల సందర్భంగా ఓ అభిమాని వినూత్నంగా ఆదరణ ప్రదర్శించాడు. తన ఫేవరేట్ హీరో హృతిక్ సినిమా రెండేళ్ల విడుదల కావడంతో రాహుల్ రాజ్ అనే అభిమాని సందడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా తానొక్కడే 70 టిక్కెట్లు కొనేశాడు. మార్నింగ్ షోకు 70 టిక్కెట్లు తీసుకుని హృతిక్ రోషన్ తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. టిక్కెట్లతో రాహుల్ రాజ్ ఉన్న ఫొటోను మరో అభిమాని ట్వీట్ చేశాడు. అయితే రాహుల్ రాజ్ ఎక్కడి వాడు అనే వివరాలు వెల్లడించలేదు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'మొహంజోదారో' సినిమా శుక్రవారం విడుదలైంది. 'లగాన్' డైరెక్టర్ అసతోశ్ గోవారికర్ దరకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ సరసన పూజా హెగ్డే నటించింది. కాగా, సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమా విడుదలైనప్పుడు కూడా ఓ అభిమాని ధియేటర్ లోని టిక్కెట్లులన్నీ తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన భార్యను ఇంప్రెస్ చేయడానికి అతడు ఈ పనిచేశాడు. -
'నా పిల్లలు బిగ్ స్క్రీన్‌పై చూస్తారట'
ముంబయి: తాను నటించిన మొహంజదారో చిత్రం ఇప్పటికే ఓ విజేత అని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అన్నారు. ఈ నెల(ఆగస్టు)12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఓ మీడియాతో హృతిక్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మొహంజదారో చిత్ర విశేషాలు చెబుతూ విజయం అనేది మనం దేనిని ప్రేమిస్తామో దానిని చేయడంలో ఉంటుందని అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో విజయాలు, అపజయాలు ఏమిటో తెలుసుకున్నానని చెప్పారు. ఇష్టపడి పనిచేయడంలోనే విజయం ఉంటుందని అన్నారు. ఈ సినిమా కోసం తానెంతో శ్రద్ధపెట్టి పనిచేశానని, గాయాలు కూడా అయ్యాయని అన్నారు. గౌరీకర్ తో తనకు ఇది రెండో చిత్రం అని, తొలిచిత్రం జోదా అక్బర్ సినిమాతోనే ఆయనపై తనకు విశ్వాసం పెరిగిందని, ఇది ఇప్పుడు మరింత రెట్టింపయిందని, ఆయన మంచి విలువలు ఉన్న దర్శకుడు అని హృతిక్ చెప్పారు. ఈ సినిమాను మీ కుమారులు చూశారా అని ప్రశ్నించగా.. వారు ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పైనే చూడాలని అనుకున్నారని, అందుకే ప్రివ్యూలో చూడలేదని, వారి రియాక్షన్ ఎలా ఉంటుందో తనకు ఇంకా తెలియదని చెప్పారు. ఈ సినిమా కోసం తాను కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని చెప్పారు. -
కెమెరా ముందు హీరోయిన్ చిందులు!
'గోపికమ్మ చాలును లేమ్మా' అంటూ తెలుగువారిని మురిపించిన పూజాహెగ్డే గుర్తుంది కదా! తెలుగులో వరుణ్ తేజతో 'ముకుంద', నాగాచైతన్యతో 'ఒక లైలా కోసం' సినిమాలు తీసిన ఈ చిన్నది.. ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'మొహెంజోదారో' సినిమాలో హృతిక్ రోషన్‌కు జోడీగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నది. వచ్చే శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమాపై పూజ చాలా ఆశలు పెట్టుకున్నది. హృతిక్ 'మొహెంజోదారో'- అక్షయ్‌కుమార్ 'రుస్తుం' సినిమాలు ఒకేసారి వస్తుండటం ఈ బాక్సాఫీసు క్లాష్‌పై చాలా ఆసక్తి నెలకొంది. ఈ రెండు సినిమాలూ ఒకేసారి తీవ్రంగా పోటీపడుతున్నప్పటికీ.. హృతిక్, అక్షయ్ మాత్రం తమ పెద్ద మనస్సు చాటుకున్నారు. తమ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బాగా రాణించాలని పరస్పరం ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన తొలి సినిమా ప్రమోషన్ కోసం పూజాహెగ్డే ఒకింత చిత్రమైన స్టెప్ వేసింది. హృతిక్ తొలి సినిమా 'కహో నా ప్యార్ హై' సినిమాలోని టైటిల్ పాటకు డ్యాన్స్ చేస్తూ డబ్స్మాష్ వీడియోను పోస్టు చేసింది. మరో మూడురోజుల్లో విడుదలవుతున్న తన తొలి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టింది. -
'హిస్టరీ అంటే ఇష్టమే లేదు'
చారిత్రాత్మక చిత్రం 'మొహంజొదారో'తో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిన హీరో హృతిక్.. తనకు హిస్టరీ సబ్జెక్ట్ అంటే ఇష్టమే ఉండేది కాదంటున్నాడు. మొహంజొదారో ప్రమోషన్ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. స్కూల్లో ఉన్నప్పుడు హృతిక్.. హిస్టరీ అంటే చాలా బోరింగ్ సబ్జెక్ట్ అని ఫీలయ్యేవాడట. కానీ ఆ తర్వాత చరిత్ర ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు. నేనే కాదు.. ఎవరైనా సరే చరిత్ర గొప్పతనం తెలుసుకుని తీరాలి. మన పుట్టుపూర్వోత్తరాల గురించి, సంస్కృతి,సంప్రదాయాల గురించి, గొప్ప వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవడం బావుంటుందంటున్నాడు హృతిక్. చదువుకునే రోజుల్లో మాత్రం హిస్టరీ సబ్జెక్ట్ అస్సలు నచ్చేది కాదట. ఇప్పుడు ఇదంతా చదివి నేనేం చేయాలి అనుకునేవాడట. తర్వాత్తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిందట. మన కుటుంబం గురించి, తాతముత్తాతల గురించి, వారి కష్టం గురించి తెలుసుకోవాల్సి అవసరం ఉంది. అన్నిటికీ మించి ప్రపంచ చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం, నా పిల్లలిద్దరికీ అదే చెప్తుంటానంటూ సెలవిచ్చాడు. హృతిక్, పూజా హెగ్డేలు జంటగా నటిస్తున్న 'మొహంజొదారో' ఆగస్టు 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం హృతిక్, పూజాలు చిత్ర ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు. -
కాలేజ్ అమ్మాయికి హృతిక్ స్పెషల్ గిఫ్ట్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఓ కాలేజ్ అమ్మాయికి స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ 'మొహంజొదారో' ప్రమోషన్ కోసం ఢిల్లీ చేరుకున్న హృతిక్, హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి శుక్రవారం గార్గీ గాళ్స్ కాలేజ్‌కి వెళ్లారు. హృతిక్‌కు అక్కడి అమ్మాయిల నుంచి అదిరే వెల్కం అందింది. స్టార్ హీరోను చూసిన ఆనందంలో యువతులంతా సంతోషంలో మునిగిపోయారు. హృతిక్, పూజాలిద్దరూ వారితో సరదా సంభాషణ జరుపుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ యువతి పుట్టినరోజని తెలిసింది. వెంటనే ఆమెను స్టేజ్‌పైకి ఆహ్వానించిన హృతిక్.. ఆమె కోరుకున్నట్టుగానే ఆమెతో కలిసి డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. 'జిందగీ న మిలేగీ దొబారా' సినిమాలోని హిట్ సాంగ్ సెనోరీటాకు ఆ బర్త్ డే గాళ్‌తో కలిసి స్టెప్పులేశాడు. అభిమాన హీరోతో కలిసి ఆడిపాడిన ఆమె స్వీట్ షాక్‌కు గురైంది. ఇది తనెప్పటికీ మర్చిపోలేని బర్త్ డే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. చారిత్రాత్మక కథనంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'మొహంజొదారో' ఆగస్టు 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
సీనియర్ హీరో సినిమాకు జూనియర్ ఝలక్!
ఈ నెల 12న బాక్సాఫీస్ వద్ద మరో బిగ్ ఫైట్‌కు తెరలేవబోతున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్లు అక్షయ్‌కుమార్ 'రుస్తుం', హృతిక్ రోషన్ 'మొహెంజోదారో' సినిమాలు ఒకేసారి 12న విడుదలకాబోతున్నాయి. ఇండిపెండెన్స్ డే రేసులో సత్తా చాటేందుకు ఈ రెండు సినిమాలు పోటీపడుతుండటంతో సహజంగా బాలీవుడ్ దృష్టి ఈ బిగ్ సినిమాలపైనే ఉంది. అక్షయ్, ఇలియాన, ఈషా గుప్తా జంటగా తెరకెక్కిన 'రుస్తుం' సినిమా.. 'మొహెంజోదారో'తో పోలిస్తే చిన్న సినిమా అనే చెప్పాలి. 'రుస్తుం' రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే.. అంతకు రెట్టింపు బడ్జెట్‌తో ప్రాచీన సింధు నాగరికత నేపథ్యంతో హృతిక్ రోషన్, పుజా హెగ్డేల 'మొహెంజోదారో' వస్తున్నది. కానీ, బాక్సాఫీస్ పరంగా చూస్తే సీనియర్ సూపర్ స్టార్ అయిన అక్షయ్ మంచి కథ-తక్కువ బడ్జెట్ కాంబినేషన్‌తో భారీ విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. ఎయిర్‌లిఫ్ట్, బేబీలాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఇక రెండేళ్ల కిందట వచ్చిన 'బ్యాంగ్ బ్యాంగ్' తర్వాత హృతిక్ వెండితెరపై కనిపించలేదు. కాబట్టి హృతిక్ ఇది కామ్బ్యాక్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సహజంగానే హృతిక్ 'మొహెంజోదారో' సినిమా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాకు బడా హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ అండగా ఉండటంతో దాదాపు 2,300 నుంచి 2,500 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతున్నది. ఇక అక్షయ్ సినిమా దాదాపు రెండువేల థియేటర్లకే పరిమితం కానుంది. బాలీవుడ్లో ఇద్దరు పెద్ద సూపర్ స్టార్ల సినిమాలు ఒకేరోజు విడుదల కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో షారుఖ్‌ఖాన్ 'దిల్వాలే', రణ్వీర్ సింగ్-దీపికా పదుకొనే 'బాజీరావు మస్తానీ' ఒకేరోజు విడుదలయ్యాయి. అయితే, 'బాజీరావు' ఆడినంతగా 'దిల్వాలే' ఆకట్టుకోలేకపోయింది. సల్మాన్ ఖాన్ 'సుల్తాన్', షారుఖ్ 'రాయిస్' ఒకేరోజున వస్తాయని భావించినప్పటికీ ఈ రేసు నుంచి షారుఖ్ తప్పుకోగా.. 'సుల్తాన్' తన దూకుడు చాటిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ లో హృతిక్ సందడి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హైదరాబాద్ విచ్చేశారు. కూకట్పల్లి సుజనామాల్‌లో ఆయన సోమవారం సందడి చేశారు. రాడో వాచీల ప్రచార కార్యక్రమంలో భాగంగా హృతిక్ నగరానికి వచ్చారు. పనిలో పనిగా ఆయన తాజా చిత్రం 'మొహంజొదారో' ప్రమోషన్లో కూడా పాల్గొన్నారు. మాల్కి బాలీవుడ్ టాప్ స్టార్ రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. హృతిక్.. అంటూ అరుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు హైదరాబాదీలు. థాంక్యూ హైదరాబాద్ అంటూ హృతిక్ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అమేజింగ్ పీపుల్, అమేజింగ్ ఫుడ్, అమేజింగ్ డే అంటూ నగరంలోని స్నేహితులతో గడిపిన ఫొటోలను పోస్ట్ చేశారు. చారిత్రక కథతో తెరకెక్కిన మొహంజొదారో సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ మంజూరయ్యింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. Thank you #Hyderabad for all the love!! pic.twitter.com/UwI8048GND — Hrithik Roshan (@iHrithik) 1 August 2016 When friends feel like family @PinkyReddy18 Amazing people+amazing food =amazing day! #memories #automaticfun pic.twitter.com/dFZADpbuCJ — Hrithik Roshan (@iHrithik) 1 August 2016 -
ముద్దు సీన్లకు 'సెన్సార్' ఓకే!
న్యూఢిల్లీ: ముద్దు సీన్ల విషయంలో ఫిలిం మేకర్స్‌కు , సెన్సార్ బోర్డుకు మధ్య చెలరేగుతున్న వివాదాలకు తెరపడినట్లేనా? హైకోర్టు అక్షింతలతో బోర్డు తన తీరు మార్చుకుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. హృతిక్ రోషన్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన 'మొహెంజొదారో' లో రొమాంటిక్ ట్రాక్ తోపాటు మూడు లిప్ లాక్ సీన్లు ఉన్నప్పటికీ.. సెన్సార్ బోర్డు ఆ సినిమాకు ఒక్కటంటే ఒక్క కట్ కూడా చెప్పకపోవడం విశేషం. సింగిల్ కట్ లేకుండా 'మొహెంజొదారో'కు యూ/ఏ సర్టిఫికేట్ జారీ అయనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. (అతనితో ముద్దుకి సిగ్గుపడలేదు!) ఎపిక్ అడ్వెంచర్ డ్రామాగా అశుతోష్ గొవారికర్ తెరకెక్కించిన 'మొహెంజొదారో' ఆగస్టు 12న విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తమ సినిమా సెన్సార్ చిక్కులను సులువుగా దాటిరావడంతో దర్శకనిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. సినిమాల్లో ముద్దు సీన్లపై దర్శకనిర్మాతలు, సెన్సార్ బోర్డుకు మధ్య వివాదాలు ఇటీవల తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. జేమ్స్ బాండ్ సినిమా 'స్పెక్ట్రే' మొదలు దీపికా- రణ్ బీర్ ల 'తమాషా', కాజల్ అగర్వాల్- రణదీప్ హుడాల 'దో లబ్జోంకీ కహానీ' తదితర సినిమాల్లో ముద్దు సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. కాగా, ఇటీవల 'ఉడ్తా పంజాబ్' సినిమా విడుదల సమయంలో సెన్సార్ బోర్డు తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 'సీన్లు కత్తిరించడంకాదు.. సర్టిఫికెట్ జారీ వరకే మీ బాధ్యత. సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టం' అని హైకోర్టు బోర్డును మందలించింది. -
మొహెంజోదారో ప్రమోషన్ ఈవెంట్
-
‘చరిత్రలో ఫెయిలయ్యా.. కానీ చాలా ఇంట్రెస్ట్’
ముంబయి: తాను స్కూళ్లో చదివే రోజుల్లో చరిత్ర సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని.. కానీ, ఇప్పుడు మాత్రం బయటకు చెప్పని చరిత్రల గురించి దృశ్యరూపంలో చెప్పే అవకాశం వచ్చిందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అశుతోష్ గౌరీకర్ అన్నారు. ‘నాకు ఎప్పుడూ తేదీలు గుర్తుండేవి కాదు. చరిత్ర సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. జాగ్రఫీతో కూడా నాకు సంబంధం లేదు. అయితే, ఇప్పటి వరకు బయటకు ఎవరు చెప్పని కథల గురించి తెలుసుకునే ఆసక్తి మాత్రం తగ్గలేదు’ అని ఆయన అన్నారు. తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మొహంజదారో చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. సింధూ నాగరికత కాలంనాటి మొహంజదారో నగర విశిష్టతను దృశ్యరూపంగా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. మొహంజదారో చరిత్ర గురించి చెప్పడం అంటే తనకు ఎప్పటికీ ఆసక్తే అని అన్నారు. ‘నేను ఈ చిత్రాన్ని తీసినందుకు సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రానికి న్యాయం చేశానని అనుకుంటున్నాను. లగాన్, జోదా అక్బర్, నేడు మొహంజదారో వంటి చిత్రాలకు విడిది తీసుకోవడానికి గల కారణం తన పరిశోధనే అన్నారు. ఇవి ప్రత్యేకమైన చిత్రాలు అయినందున తాను అలా గ్యాప్ తీసుకుంటానని చెప్పారు. -
ఆ సిన్మా ట్రైలర్ పై జోకులే జోకులు!
రెండు వేల ఏళ్లకు పూర్వం వెలసిన సింధు నాగరికత నాటి కథతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా 'మొహెంజో దారో'. హృతిక్ రోషన్- పుజా హెగ్డే జంటగా ప్రముఖ దర్శకుడు అశుతోష్ గ్రోవారికర్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా ఆన్ లైన్ లో విడుదలైంది. యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ఈ ట్రైలర్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున జోకులు పేలుస్తున్నారు. చారిత్రక కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన 'మొహెంజో దారో' ట్రైలర్ ఇప్పుడు ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్రైలర్ పై కుప్పతెప్పలుగా వెల్లువెత్తుతున్న వ్యంగ్యాస్త్రాల్లో కొన్ని మీకోసం.. 2,500 ఏళ్లకు పూర్వం మొహెంజో దారోలో తొలిసారి ఆకాశంలో విమానాన్ని చూసి ఆశ్చర్యపోతున్న చిన్నారి ఫైల్ ఫొటో ఇది.. ఏంజెలినా జోలీకి పూర్వమే కాన్స్ లో పర్ఫెక్ట్ పోజు ఎలా ఇవ్వాలో హరప్ప మహిళలు నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. అమెరికా వలసదారులకు మహెంజో దారోలో ఏం పని? 'రోబో' సినిమాలోని 'కిలీ మంజారో' పాటను స్ఫూర్తిగా చేసుకొని.. మొహెంజోదారోలో వస్త్రాలు సిద్ధం చేసినట్టుంది.. మాజీ భార్య సుసానె నిజమైన మొసలి లేదర్ తో చేసిన హ్యాండ్ బ్యాగ్ విసిరేయడంతో హృతిక్ ఎలా తప్పించుకుంటున్నాడో చూడండి. మొహెంజో దారో పేరు నాకు ఎంతో నచ్చింది. మోహన్ జావో దారు లావో (మోహన్ వెళ్లి సారా తే) అన్నట్టు నాకు వినిపిస్తోందని ఓ నెటిజన్ చమత్కరించగా.. హృతిక్ రోషన్ యాంగ్రీ ఫేస్ వల్లే సింధు నాగిరకత కుప్పకూలి ఉంటుందని మరొకరు.. మొహెంజో దారో అంటే శవాల దిబ్బ అని అర్థం.. ఆ పేరునే నాటి ప్రజలు తమ నగరానికి పెట్టుకొని ఉండి ఉంటారని దర్శకుడు ఎలా భావించారంటూ మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు. -
30 లక్షల మందిపైగా చూశారు!
ముంబై: హృతిక్ రోషన్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మొహంజోదారో' ట్రైలర్ ను సోమవారం రాత్రి విడుదల చేశారు. మూడు నిమిషాలు నిడివివున్న ఈ ప్రచార చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందిపైగా వీక్షించారు. సోమవారం రాత్రి 9.57 గంటలకు స్టార్ టీవీ చాన్సల్ ద్వారా ఈ ట్రైలర్ విడుదల చేశారు. స్టన్నింగ్స్ విజువల్ ఎఫెక్ట్ తో 'మొహంజోదారో' కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు. ఇప్పటికే రిలీజ్ అయిన హృతిక్, ఫూజా హెగ్డే ఫస్ట్ లుక్ ఆన్ లైన్లో హవా చూపిస్తుండగా ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. 'లగాన్' డైరెక్టర్ అసతోశ్ గోవారికర్ దరకత్వం వహించిన కబీర్ బేడి, అరుణోయ సింగ్ కీలకపాత్రలు పోషించారు. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సిద్ధార్థరాయ్ కపూర్, సునీత గోవారికర్ నిర్మించిన 'మొహంజోదారో' ఆగస్టు 12న విడుదల కానుంది. టీవీ ద్వారా వేగంగా ప్రేక్షకులను చేరుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ సినిమా ట్రైలర్ ను టీవీలో విడుదల చేసినట్టు దర్శకుడు అసతోశ్ గోవారికర్ తెలిపారు. ప్రచార చిత్రానికి వచ్చిన స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. యూట్యూబ్ లోనూ ఈ సినిమా ట్రైలర్ ను అప్పుడే 9 లక్షల మందిపైగా వీక్షించారు. -
చానీ.. లుకింగ్ సో చార్మింగ్!
లైలా తన లుక్‌తో అభిమానుల గుండెల్లో హీట్ పెంచేశారు. ఇంతకీ ఈ లైలా ఎవరో తెలిసే ఉంటుంది. తెలుగు చిత్రం ‘ఒక లైలా కోసం’లో నాగచైతన్య ప్రేయసి లైలాగా కుర్రకారు గుండెలను దోచేసిన పూజా హెగ్డే ఆ తర్వాత ‘ముకుంద’ చిత్రంలో నటించారు. హిందీలో తొలి చిత్రం ‘మొహంజదారో’ విడుదల కాక ముందే ఆ చిత్రంలోని లుక్‌తో బాలీవుడ్‌ను తన వైపు తిప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమెకు ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా...? ఒకే ఒక్క యాడ్‌తోనే ఆమె ఈ బంపర్ ఆఫర్ కొట్టేశారు. సినిమాల్లోకి రాకముందు పూజ చే సిన యాడ్ ‘మొహంజదారో’ టీమ్ దృష్టిలో పడింది. అంతే.. ఆ భారీ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ చాన్స్ వచ్చేసింది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.హృతిక్ ప్రేయసి చానీగా పూజ ఇందులో నటిస్తున్నారు. గురువారం విడుదల చేసిన చానీ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు ‘చానీ.. లుకింగ్ సో చార్మింగ్’ అని పూజాని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయాలనుకుంటున్నారు. -
మొహంజొదారోలో పూజా హెగ్డే
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముందుగుమ్మ పూజా హెగ్డే. తరువాత నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించిన ఈ బ్యూటీకి టాలీవుడ్లో పెద్దగా ఆఫర్స్ ఏవీ రాలేదు. దీంతో అమ్మడి కెరీర్ ఆరంభంలోనే ముగిసిపోయిందనుకున్నారు. అయితే అదే సమయంలో బాలీవుడ్ మ్యాన్లీ హంక్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మొహంజోదారో సినిమాలో కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చింది. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. తాజాగా పూజా హెగ్డే బాలీవుడ్ ఎంట్రీకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతగా చెబుతున్న మొహంజోదారో కాలంలో మహారాణిలా కనిపిస్తున్న పూజా లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన హృతిక్ ఫస్ట్ లుక్ ఆన్ లైన్లో హవా చూపిస్తుండగా.., ఇప్పుడు విడుదలైన పూజా ఫస్ట్ లుక్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. -
మొహెంజొదారో ఫస్ట్ లుక్ విడుదల
బాలీవుడ్ మ్యాన్లీ హంక్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా మొహెంజొదారో. క్రీస్తూ పూర్వం విలసిల్లిన నాగరికతకు సంబందించిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లగాన్ ఫేం అశుతోష్ గోవరికర్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్‌తో పాటు హృతిక్ లుక్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌నూ రిలీజ్ చేశారు. రఫ్ లుక్‌లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో కనిపిస్తున్న హృతిక్ మరోసారి ఆకట్టుకున్నాడు. తన ట్విట్టర్లో మొహెంజొదారో పోస్టర్‌ను రిలీజ్ చేసిన హృతిక్, తన పాత్ర పేరు సార్మాన్ అంటూ ప్రకటించాడు. ప్రేమ, శక్తిలకు ప్రతిరూపం సార్మాన్ అంటూ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు హృతిక్. ఈ సినిమాలో ముకుందా ఫేం పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. The manifestation of love and power.. SARMAN .#MohenjoDaroPoster @utvfilms @agppl_tweets @hegdepooja @arrahman pic.twitter.com/kA5KR1hQ10 — Hrithik Roshan (@iHrithik) 7 June 2016 -
అక్షయ్ వర్సెస్ హృతిక్!
ముంబయి: బాలీవుడ్ బాక్సాపీసు వద్ద ప్రముఖ హీరోలు హృతిక్ రోషన్.. అక్షయ్ కుమార్ తలపడనున్నారు. రుస్తుం సినిమాతో అక్షయ్ వస్తుండగా అదే సమయంలో అదే తేదీన మొహంజదారో చిత్రంతో హృతిక్ వస్తున్నాడు. ఈ రెండు చిత్రాలను కూడా ఆగస్టు 12కే విడుదల చేయాలని రెండు చిత్రాల నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రుస్తుం సినిమా విడుదల తేదినీ తాము ముందే ప్రకటించినందున తమకోసం మొహంజదారో చిత్ర విడుదల తేదిని మార్చాల్సిందిగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ అశుతోష్ గౌరీకర్ ప్రొడక్షన్స్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, తమ చిత్ర దర్శకుడిని ఎవరూ కలవలేదని, అయినా, తమ చిత్ర విడుదల తేదిని జనవరి 15, 2015లోనే ఆగస్టు 12గా ప్రకటించామని అశుతోష్ గౌరీకర్ ప్రొడక్షన్స్ అధికార ప్రతినిధి చెప్ఆపరు. తమ చిత్ర విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పారు. -
'చివరిసారి ఎప్పుడు ఏడ్చానో తెలియదు.. కానీ'
ముంబై: సినిమా షూటింగ్ లో గాయాలపాలైన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్... ఆందోళన చెందవద్దని తన అభిమానులకు సూచించాడు. సోనమ్ కపూర్ నటించిన 'నీరజా' మూవీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో హృతిక్ పాల్గొన్నాడు. 'చివరిసారిగా ఎప్పుడు ఏడ్చానో కూడా తెలియదు. కానీ, ఈ మూవీ ఎమోషనల్ గా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన మూవీ అని, సీనియర్ నటి షబానా అజ్మీకి సెల్యూట్' అంటూ హృతిక్ పేర్కొన్నాడు. తాను భయం లాంటి విషయాలు అసలు మాట్లాడనని, నీరజా మూవీ అందరికీ చాలా గర్వకారణమన్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహంజోదారో షూటింగ్లో పాల్గొంటున్న మ్యాన్లీ స్టార్ ఈ మూవీ తీస్తుండగానే రెండోసారి గాయపడ్డాడు. గత నెలలో ఒకసారి గాయపడి షూటింగ్ కు విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అశుతోష్ గోవారికర్ ఈ మూవీకి దర్శకత్వం చేస్తున్నాడు. కనీసం రెండు వారాల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. దీంతో మరోసారి మొహంజోదారో షూటింగ్‌కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే ఈ మూవీతో బాలీవుడ్ లో కాలు మోపనుంది. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో క్వాలిటీ కోసం హృతిక్ తీసుకుంటున్న జాగ్రత్తలే ప్రమాదాలకు కారణమవుతున్నాయని చిత్రయూనిట్ భావిస్తోంది. -
స్టార్ హీరోకు గాయాలు, రెండు వారాల విశ్రాంతి