గుహలో రొమాన్స్! | hrithik Roshan, Pooja Hegde Romantic Scene in Mohenjo Daro | Sakshi
Sakshi News home page

గుహలో రొమాన్స్!

Published Mon, Sep 21 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

గుహలో రొమాన్స్!

గుహలో రొమాన్స్!

అదో పెద్ద గుహ. ఆ గుహని చూసినవాళ్ల గుండె జారడం ఖాయం. కానీ, ఆ ఇద్దరూ ప్రేమ మైకంలో ఉన్నారు. పరిసర ప్రాంతాలను పట్టించుకునే స్థితిలో లేరు. గుహలోనే రొమాన్స్ మొదలుపెట్టాలనుకుంటారు. ఆ ప్రేమికుల పేరు హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ పూజా హెగ్డే. ఇటీవల తన భార్య సుజానే ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న హృతిక్ తాజాగా తన సరసన ‘మొహంజొ దారో’లో నటిస్తున్న పూజా హెగ్డేతో ప్రేమలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా ఈ ఇద్దరూ ఆ గుహలో రొమాన్స్‌కి రెడీ అయ్యారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ఈ రొమాంటిక్ సీన్‌ని ‘మొహంజొదారో’ కోసం చిత్రీకరించనున్నారు. సుమారు రెండున్నర నిమిషాల పాటు సాగే ఈ రొమాంటిక్ సీన్‌ని త్వరలో చిత్రీకరించాలనుకుంటున్నారు. అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement