ఆ సిన్మా ట్రైలర్ పై జోకులే జోకులు! | Mohenjo Daro trailer spawns a thousand jokes on Twitter | Sakshi
Sakshi News home page

ఆ సిన్మా ట్రైలర్ పై జోకులే జోకులు!

Published Tue, Jun 21 2016 6:44 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

ఆ సిన్మా ట్రైలర్ పై జోకులే జోకులు!

ఆ సిన్మా ట్రైలర్ పై జోకులే జోకులు!

రెండు వేల ఏళ్లకు పూర్వం వెలసిన సింధు నాగరికత నాటి కథతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా 'మొహెంజో దారో'. హృతిక్ రోషన్- పుజా హెగ్డే జంటగా ప్రముఖ దర్శకుడు అశుతోష్ గ్రోవారికర్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా ఆన్ లైన్ లో విడుదలైంది. యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ఈ ట్రైలర్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున జోకులు పేలుస్తున్నారు. చారిత్రక కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన  'మొహెంజో దారో' ట్రైలర్ ఇప్పుడు ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్రైలర్ పై కుప్పతెప్పలుగా వెల్లువెత్తుతున్న వ్యంగ్యాస్త్రాల్లో కొన్ని మీకోసం..

2,500 ఏళ్లకు పూర్వం మొహెంజో దారోలో తొలిసారి ఆకాశంలో విమానాన్ని చూసి ఆశ్చర్యపోతున్న చిన్నారి ఫైల్ ఫొటో ఇది..

ఏంజెలినా జోలీకి పూర్వమే కాన్స్ లో పర్ఫెక్ట్ పోజు ఎలా ఇవ్వాలో హరప్ప మహిళలు నేర్చుకున్నట్టు కనిపిస్తోంది.


అమెరికా వలసదారులకు మహెంజో దారోలో ఏం పని?

'రోబో' సినిమాలోని 'కిలీ మంజారో' పాటను స్ఫూర్తిగా చేసుకొని..  మొహెంజోదారోలో వస్త్రాలు సిద్ధం చేసినట్టుంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement