30 లక్షల మందిపైగా చూశారు! | More than 30 million people watch 'Mohenjo Daro' trailer | Sakshi
Sakshi News home page

30 లక్షల మందిపైగా చూశారు!

Jun 21 2016 9:55 AM | Updated on Sep 4 2017 3:02 AM

హృతిక్ రోషన్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మొహంజోదారో' ట్రైలర్ ను సోమవారం రాత్రి విడుదల చేశారు.

ముంబై: హృతిక్ రోషన్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మొహంజోదారో' ట్రైలర్ ను సోమవారం రాత్రి విడుదల చేశారు. మూడు నిమిషాలు నిడివివున్న ఈ ప్రచార చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందిపైగా వీక్షించారు. సోమవారం రాత్రి 9.57 గంటలకు స్టార్ టీవీ చాన్సల్ ద్వారా ఈ ట్రైలర్ విడుదల చేశారు. స్టన్నింగ్స్ విజువల్ ఎఫెక్ట్ తో 'మొహంజోదారో' కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు. ఇప్పటికే రిలీజ్ అయిన హృతిక్, ఫూజా హెగ్డే ఫస్ట్ లుక్ ఆన్ లైన్లో హవా చూపిస్తుండగా ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది.

'లగాన్' డైరెక్టర్ అసతోశ్ గోవారికర్ దరకత్వం వహించిన కబీర్ బేడి, అరుణోయ సింగ్ కీలకపాత్రలు పోషించారు. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సిద్ధార్థరాయ్ కపూర్, సునీత గోవారికర్ నిర్మించిన 'మొహంజోదారో' ఆగస్టు 12న విడుదల కానుంది. టీవీ ద్వారా వేగంగా ప్రేక్షకులను చేరుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ సినిమా ట్రైలర్ ను టీవీలో విడుదల చేసినట్టు దర్శకుడు అసతోశ్ గోవారికర్ తెలిపారు. ప్రచార చిత్రానికి వచ్చిన స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. యూట్యూబ్ లోనూ ఈ సినిమా ట్రైలర్ ను అప్పుడే 9 లక్షల మందిపైగా వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement