కెమెరా ముందు హీరోయిన్ చిందులు! | Mohenjo Daro, Hrithik Roshan get this star support | Sakshi
Sakshi News home page

కెమెరా ముందు హీరోయిన్ చిందులు!

Published Tue, Aug 9 2016 7:42 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

కెమెరా ముందు హీరోయిన్ చిందులు! - Sakshi

కెమెరా ముందు హీరోయిన్ చిందులు!

'గోపికమ్మ చాలును లేమ్మా' అంటూ తెలుగువారిని మురిపించిన పూజాహెగ్డే గుర్తుంది కదా! తెలుగులో వరుణ్‌ తేజతో 'ముకుంద', నాగాచైతన్యతో 'ఒక లైలా కోసం' సినిమాలు తీసిన ఈ చిన్నది.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'మొహెంజోదారో' సినిమాలో హృతిక్‌ రోషన్‌కు జోడీగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నది. వచ్చే శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమాపై పూజ చాలా ఆశలు పెట్టుకున్నది. హృతిక్‌ 'మొహెంజోదారో'- అక్షయ్‌కుమార్‌ 'రుస్తుం' సినిమాలు ఒకేసారి వస్తుండటం ఈ బాక్సాఫీసు క్లాష్‌పై చాలా ఆసక్తి నెలకొంది.

ఈ రెండు సినిమాలూ ఒకేసారి తీవ్రంగా పోటీపడుతున్నప్పటికీ.. హృతిక్‌, అక్షయ్‌ మాత్రం తమ పెద్ద మనస్సు చాటుకున్నారు. తమ రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద బాగా రాణించాలని పరస్పరం ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ నేపథ్యంలో తన తొలి సినిమా ప్రమోషన్‌ కోసం పూజాహెగ్డే ఒకింత చిత్రమైన స్టెప్‌ వేసింది. హృతిక్ తొలి సినిమా 'కహో నా ప్యార్‌ హై' సినిమాలోని టైటిల్‌ పాటకు డ్యాన్స్‌ చేస్తూ డబ్‌స్మాష్‌ వీడియోను పోస్టు చేసింది. మరో మూడురోజుల్లో విడుదలవుతున్న తన తొలి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ వీడియోను ట్విట్టర్‌లో పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement